Uruguayan rugby team crash story

ప్లేన్ క్రాష్ అయిన తరవాత మనుషుల మాంసం తిని 72 రోజులు బతికిన రగ్బీ ఆటగాళ్ల స్టోరీ Uruguayan Air Force flight 571 Story

హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. మనుషులు జీవించడానికి నీళ్లు మరియు ఆహారం ఎంతో ముఖ్యం. ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకలేరు కానీ ఉరుగ్వే కి చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా 72 రోజులు బతికారు. 

1972 వ సంవత్సరం అక్టోబర్ 12 వ తారీకు రోజున ఉరుగ్వే కి చెందిన రగ్బీ టీం ఉరుగ్వే కాపిటల్ సిటీ అయిన మాంటె వదియొ  నుంచి చిలీ కాపిటల్ సాంటియాగో కి  మ్యాచ్ ఆడటానికి బయలుదేరాలి. ఆటగాళ్లు ప్రయాణించడానికి ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం 571 ఎన్నుకోబడుతుంది. 

ఈ విమానం లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫామిలీ లేదా ఫ్రెండ్స్ ను కూడా తీసుకురావచ్చు అని చెప్పటం జరుగుతుంది. ఆటగాళ్లతో పాటు ఫామిలీ మరియు ఫ్రెండ్స్ కలిసి 40 మంది మరియు ఐదుగురు క్రూ తో మొత్తం 45 మంది ఈ విమానంలో ప్రయాణించడానికి తయారు అవుతారు. 

ఈ విమానం మాంటె వదియొ నుంచి అండీస్ పర్వతాల మీరు నుంచి సాంటియాగో కి చేరుకోవాలి. ఈ విమానాన్ని నడపటానికి బాగా అనుభవం ఉన్న పైలట్ మరియు కో పైలట్ లను ఎంచుకోవటం జరుగుతుంది.

1972 సంవత్సరం అక్టోబర్ 12 వ తారీకు అనుకున్న ప్రకారం ఫ్లైట్ సాంటియాగో కి బయలుదేరుతుంది. వాతావరణం సరిగా లేకపోవటం వల్ల మార్గమధ్యం లో ఉన్న ఆర్జెంటినా రాజధాని మెన్డోజా లో రాత్రి గడపటం జరుగుతుంది.

 మెన్డోజా నుంచి సాంటియాగో కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే కానీ ఈ మార్గం లో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తునుంచి వెళ్లడం కష్టం అని 600 కిలోమీటర్ల దారిని ఎన్నుకోబడుతుంది.

ఆ మరుసటి రోజు కూడా వాతావరం సరిగా లేదు మధ్యాహ్నం సమయంలో కాస్త వాతావరణం లో మార్పు వస్తుందని అంచనా వేసారు. పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి రెండు గంటల 18 నిమిషాలకు మెన్డోజా నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటాడు.   

ఈ ప్లేన్ నడిపే పైలట్ ఈ మార్గం గుండా 29 సార్లు విమానాన్ని నడిపాడు. తన తో పాటు కో పైలట్ మాత్రం ఈ మార్గం లో నడపలేదు. కో పైలట్ కు ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానాన్ని నడపడానికి కో పైలట్ కి ఇవ్వటం జరుగుతుంది.

ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండటం తో పైలట్ 60 కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నాను అనుకోని ల్యాండ్ చేయటానికి పర్మిషన్ అడుగుతాడు.

పైలట్ ప్లేన్ ను ల్యాండ్ చేద్దామని కిందికి దింపినప్పుడు ఒక్కసారి ప్లేన్ turbulence కి గురి అయ్యి షేక్ అవుతుంది. మొదట విమానంలో ఉన్న వారు ఇది కామన్ అని అనుకుంటారు కానీ కాసేపట్లోనే ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. 

పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి పై కి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు కానీ లాభం లేదు అప్పటికే లేట్ అయిపోయింది. ప్లేన్ రెండు మూడు సార్లు పర్వతాన్ని ఢీ కొట్టి కొన్ని వందల ఫిట్లు కిందికి పడుతుంది. 

కిందికి పడుతున్న సమయంలో విమానం పలు భాగాలు ద్వంసం అవుతాయి. టేల్ సెక్షన్ కూడా ద్వంసం అవ్వటం తో విమాన వెనక భాగం లో కూర్చున్న 5 మంది విమానం లో నుంచి కిందికి పడిపోతారు. విమానం కిందికి పడే క్రమంలో ఇంకో ఇద్దరు విమానం నుంచి కిందికి పడిపోతారు. 

టైల్ సెక్షన్ లో నుంచి కింద పడ్డ ఐదుగురు చనిపోతారు. తరవాత కింద పడ్డ ఇద్దరిలో ఒకరు అక్కడిక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచు లో కూరుకుపోయి గాలి అందక చనిపోవటం జరుగుతుంది.               

విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీ కొట్టడం తో కాక్ పిట్ లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతాడు.  ప్లేన్ ను నడుపుతున్న ట్రైనింగ్ పైలట్ కి తీవ్ర గాయాలు అవుతాయి. ప్రయాణికులలో మరో నలుగురు చనిపోతారు. 

తీవ్రంగా గాయ పడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో తాను బతికే అవకాశం లేదు తన వద్ద గన్ ను తీసుకొని కాల్చమని అడగగా ప్రయాణికులు నిరాకరిస్తారు.

45 మంది ప్రయాణికులలో నుంచి 33 మంది బతుకుతారు కానీ వీరిలో కూడా కొంత మంది తీవ్రంగా గాయపడి ఉంటారు. ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయటం మొదలుపడతారు. 

మరోవైపు ప్లేన్ రాడార్ నుంచి మిస్ అవ్వటం వల్ల సెర్చ్ ఆపరేషన్ మొదలు అవుతుంది. రెస్క్యూ టీం ప్లేన్ క్రాష్ అయిన స్థలం పై నుంచి కూడా వెళతాయి. ప్రయాణికులు అరవటం మొదలుపెడతారు. ప్రయాణికులలో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకొని విమానం పై భాగంలో SOS రాయటానికి  ప్రయత్నిస్తారు కానీ లిప్స్టిక్ సరిపోదు. క్రాష్ అయిన ప్లేన్ వైట్ కలర్ లో ఉండటం మరియు మంచు ఎక్కువగా ఉండటం వల్ల  పై నుంచి అక్కడ ప్లేన్ ఉన్ననట్లు కనిపించదు. 

చలి ప్రభావం లోపల ఉన్న వాళ్లకి తగలకుండా ప్లేన్ యొక్క వివిధ భాగాలతో ప్లేన్ ను కప్పుతారు. ఈ ప్రయాణికులకు తెలియని విషయం ఏమిటంటే ఈ క్రాష్ అయిన స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరం లో ఒక పాడుబడ్డ హోటల్ ఉంది.  

మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్ తో పాటు ఇంకో నలుగురు చనిపోయారు. మూడో రోజు 19 సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోతుంది. ఇప్పుడు 45 ప్రయాణికులలో నుంచి 27 మంది మిగిలారు. 

మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది 8 చాకొలేట్ బార్ లు, mussels యొక్క ఒక టిన్, మూడు చిన్న జామ్ జార్లు, కొన్ని డ్రై ఫ్రూప్ట్స్, కాండీస్, కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది. వీటిని అందరు సమానంగా పంచుకొని కొంచెం కొంచెం తినసాగారు.         

8 రోజులు వెతికిన తరవాత రెస్క్యున్ టీం ఈ పాటికి అందరు చనిపోయి ఉంటారు అని సెర్చ్ ఆపరేషన్ ను ఆపేస్తారు. శవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని అనుకున్నారు.  

ప్లేన్ లో పడి ఉన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో ను ప్రయాణికులలో ఒకరు సరి చేసి న్యూస్ వినగా సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది.  ఈ వార్త విన్న తరవాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలి ఉండవచ్చో చెప్పనక్కర్లేదు. అందరు నిరాశ కు గురయ్యారు. అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు మనమే బయటికి వెళ్లేదారి వెతుక్కోవాలి అని అందరికి ధైర్యాన్ని ఇచ్చాడు. 

కేవలం ఒక్క వారం లోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది ఆకలికి తట్టుకోలేక సీట్లపై ఉన్న లెథర్ ను మరియు సీట్ల లోపల ఉన్న కాటన్ ను తిన్నారు. ఇవి తినటం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది. 

ఆ మంచు లో ఒక్క జంతువులు, మొక్కలు కూడా లేవు. చివరికి చేసేదేం లేక మిగిలిన వారు ఒక కఠిన మైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తాము బతకాలి అంటే ఆహారం కావాలి. ఇక్కడ చనిపోయిన వారి శవాల నుంచి మాంసాన్ని తిని బతకటమే మిగిలిన దారి అని తమ ఫామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క శవాల నుంచి మాంసాన్ని తిని బతకడానికి ప్రయత్నిస్తారు. 

మాంసాన్ని కోయడానికి విమానం యొక్క విరిగిన అద్దాల యొక్క ముక్కలను ఉపయోగిస్తారు. మొదట మాంసం మాత్రమే తిని బతుకుతారు కానీ మాంసం కూడా అయిపోయిన తరవాత శవాల యొక్క గుండె, మెదడు మరియు లంగ్స్ తిని బతకడానికి ప్రయత్నిస్తారు. 

క్రాష్ జరిగిన 17 రోజుల తరవాత అక్టోబర్ 29 వ తారీకున అందరు పడుకున్న తరవాత మంచు యొక్క తుఫాను ఆ విమానం పై విరుచుకు పడుతుంది. విమానం మొత్తం మంచులో కూరుకుపోతుంది. ఆ రోజు రాత్రి ఇంకో ఎనిమిది మంది చనిపోతారు.

మిగిలిన వారికి లోపల సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా లభించదు వెంటనే ఒక రాడ్ సహాయం తో విమానం పై భాగానికి  గాలి రావటానికి రంద్రం చేస్తారు.

మిగిలిన వారు ఆ తుఫాను లో చనిపోయిన వారి శవాలను తిని ఇంకొన్ని రోజులు బతికారు. ఇలా తింటూ ఎక్కువ రోజులు బాటలేము అని వాళ్లకు అర్థం అయ్యింది. పైలట్ చనిపోయే ముందు చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్ల తరవాత మనుషులు ఉండవచ్చు అని చెప్పాడు. 

అక్కడ ఉండే గ్రామానికి వీళ్లు దాదాపు 90 కిలోమీటర్లు దూరం లో ఉన్నారు. మిగిలిన 19 మంది ఇక్కడినుంచి బయట పడాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయిస్తారు.          

క్రాష్ సైట్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ ఆల్టిట్యుడ్ సిక్ నెస్ మరియు భరించ రాణి చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే లేక పోయే వారు.

ప్రయాణికులలో నుంచి ముగ్గురు ప్రయాణికులు హెల్ప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణానికి కావాల్సినంత మాంసం మరియు విమానం సీట్ల నుంచి కాటన్ మరియు లెదర్ ను చలి నుంచి కాపాడుకోవటానికి ఉపయోగిస్తారు. 

దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తరవాత విమానం నుంచి విరిగిపడ్డ ఒక భాగం కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా అది తోక భాగం అని తెలుస్తుంది. అక్కడ వారికి ఒక బాక్స్ చాకోలెట్స్, రమ్, సిగేరేట్, బట్టలు, కామిక్ పుస్తకాలు మరియు మందులు దొరుకుతాయి. 

ఆ రోజు రాత్రి వాళ్లు కామిక్ పుస్తకాలు చదువుతూ అక్కడే క్యాంప్ చేసి పడుకుంటారు. రెండవ రోజు ఇంకాస్త ముందుకి వెళతారు. రెండవ రోజు రాత్రి తీవ్ర మైన చలిలో పడుకోవటం తో ఇక చనిపోతాము అని అనిపించింది. 

తరవాత మళ్ళీ ఆ తోక భాగానికే వచ్చి అక్కడ ఉన్న బ్యాటరీస్ తో సహాయం తో రేడియో ను కనెక్ట్ చేసి సిగ్నల్ పంపుదాము అని అనుకుంటారు కానీ విమానం లో ఉన్న రేడియో AC మరియు బ్యాటరీస్ డీసీ అవ్వటం తో ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం పనిచేయలేదు. 

అదే సమయంలో సరైన తిండి లేకపోవటం వల్ల మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోవటం జరుగుతుంది.ఇందులో చనిపోయిన ఒక వ్యక్తి బరువు కేవలం 25 కేజీలు మాత్రమే. వీళ్ళు తిండి లేకా ఎంతగా బరువు తగ్గారో అర్థం చేసుకోవచ్చు.   

ఇక ఇక్కడే ఉంటె మంలో ఎవ్వరు కూడా బతకరు అని ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి మిగతా వారి కోసం హెల్ప్ తీసుకురావాలని అనుకుంటారు.

కానీ అక్కడినుంచి బయలుదేరి బయటి ప్రపంచం నుంచి హెల్ప్ తీసుకురావటానికి అందరూ ఆలోచిస్తారు. చివరికి ముగ్గురు తయారవుతారు.  

ప్రయాణం లో చలి నుంచి కాపాడుకోవటానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన మెటీరియల్ ను రాత్రి సమయంలో పడుకోవటానికి తీసుకున్నారు. ఒక్కొక్కరు 3 జతల జీన్స్ మరియు 4 జతల సాక్స్ వేసుకొని తమ తో మాంసం ను తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

తమ ముందు ఉన్న పెద్ద మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు. ముందు వాళ్లు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి ముగ్గురిలో ఒకరు రిటర్న్ విమానము వద్దకి వెళ్లాలని అనుకుంటారు.

తిరిగి కిందికి వెళ్ళేటప్పుడు స్లోప్ గా ఉండటం వల్ల తమ తో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయం తో కేవలం ఒక గంటలో విమానం వద్దకి చేరుకుంటాడు.

మిగిలిన ఇద్దరు మృత్యువు చావు దగ్గరికి తాము వెళతాము కానీ చావు ను తమ వద్దకి రానివ్వం అని పారాయణం కొనసాగించారు. 10 రోజులు నడిచిన తరవాత  సాయంతం పూట అలిసి పోయి కూర్చున్నప్పుడు మొదటి సారి గుర్రాలను స్వారీ చేస్తున్న మనుషులు కనిపించారు. వీరిద్దరి మధ్య ఒక పెద్ద నది ఉండటం వల్ల సహాయం కోసం వీరు అరవగా వారికి వినిపించలేదు. 

అవతలి వైపు నుంచి టుమారో అని చెప్పి గుర్రపు సవారి చేస్తున్న మనుషులు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఒక పేపర్ పెన్ ను నది అవతలి వైపుకు విసరగా. మేము రగ్బీ ప్లేయర్స్ మా ప్లేన్ క్రాష్ అయ్యింది మేము సహాయం కోసం ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు సహాయం చేయండి అని రాసి ఆ పేపర్ మళ్ళీ అవతలి వైపుకు విసిరారు.     

గుర్రాలపై సవారి చేస్తున్న వారు కూడా ప్లేన్ క్రాష్ అయిన న్యూస్ విన్నారు కానీ ఇన్ని రోజులు బతికి ఉంటారని వారు కూడా ఊహించలేదు.  అందు లో ఒకరు వాళ్లకు సహాయం తీసుకురావటానికి 10 గంటలు గుర్రపు స్వారీ చేసాడు. 

రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తరవాత ఇన్ని రోజులు బతికే ఉన్నారని వార్తలు బయటికి రావటంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించటం మొదలుపెట్టారు.

వెంటనే రెస్క్యూ హెలికాప్ర్ట్స్ అక్కడికి చేరుకున్నాయి. సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్ లో ఒకరు నేను క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తా అని చెప్పి హెలికాఫ్టర్ లో వెళ్లి చూపించాడు. వాతావరణ పరిస్తుతులు సరిగా లేకపోవటం తో కేవలం సగం మంది నీ ఆ రోజు రెస్క్యూ చేశారు మిగతా వారి కోసం రేపు వస్తాం అని చెప్పారు. 

ఆ మరుసటి రోజు 23 December 1972  మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు. బతికిన వాళ్ళందరూ మనుషుల మాంసం తిన్నారని విమర్శలు రాగా, తాము కేవలం తమను తాము బతికించుకోవటానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని ఈ పని చేయలేదు అని జవాబు ఇచ్చారు.

ఇలా 45 మంది లో నుంచి కేవలం 16  మంది మాత్రమే బతికి బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *