
రాయి తో కొట్టి అతి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్ STONE MAN స్టోరీ
హాయ్ ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ స్టోన్ మాన్ అనే సీరియల్ కిల్లర్ ది.
1985 సంవత్సరంలో ముంబై లోని సాయన్ లో మొదటిసారి ఒక ఫుట్ పాత్ పై పడుకునే వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తి ని ఎవరో చాలా బలమైన వస్తువు తో తల పై కొట్టి చంపినట్లు గమనించటం జరుగుతుంది.
కొన్ని రోజులు గడిచిన తరవాత ఫుట్ పాత్ పై పడుకునే మరొక వ్యక్తి చంపబడతాడు. సాయన్ తో పాటు కింగ్స్ సర్కిల్ లో కూడా ఫుట్ పాత్ పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువు తో నెత్తి పై కొట్టి చంపే ఘటనలు వెలుగు లోకి వస్తాయి.
చనిపోయిన వారు పేదవారు కావటం మరియు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవటం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్స్ ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇలా కొన్ని నెలల వ్యవధి లోనే ఆరుగురు వ్యక్తులు ఒకే పద్దతి లో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తి పై కొట్టి చంపబడతారు. ఆరు శవాలు దొరికిన తరవాత పోలీసులు ఈ మర్డర్స్ కి ఎదో కనెక్షన్ ఉంది అని గ్రహించి ఇది సీరియల్ కిల్లర్ పని గ్రహిస్తుంది.
ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండ రాయి దొరుకుతుంది. అన్ని మర్డర్స్ ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ప్రతి సారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండ రాయి ను ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జు నుజ్జు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేసారు.
ఇంత పెద్ద బండ రాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి లేకపోతే ఒకరి కన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ ఆరు శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపుతున్నప్పుడు లేకపోతె చంపిన తరవాత కానీ ఎవ్వరు చూడ లేదు.
కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండ రాయి ను ఆ చుట్టు పక్కల నుంచి తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకు రాక పోవటం,చీకట్లో ఒంటరిగా పడుకొని ఉన్న వారిని టార్గెట్ చేయటం, బంధువులు లేని వారిని చంపటం అన్ని కేసు లలో ఇదే pattern కనిపించింది.
పోలీసులు హత్యలు జరిగిన రెండు ప్రాంతాలలో ఫుట్ పాత్ పై ఒంటరిగా పాడుకోవద్దని చెప్పారు.రాత్రి సమయంలో పట్రోలింగ్ కూడా చేసేవారు, హత్యలు మాత్రం ఆగలేదు.
లక్కీ గా ఒకసారి ఫుట్ పాత్ పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోతాడు, పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటి గా ఉండటం వళ్ళ కిల్లర్ ఫేస్ సరిగా కనబడలేదు.
1985 వ సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి, ఈ మూడు సంవత్సరాలలో official రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మందిని పోలీసులు విచారిస్తారు కూడా కానీ సాక్ష్యులు లేనందుకు వదిలివేయాల్సి వచ్చేది.
1988 సంవత్సరంలో ముంబై లో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులకు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో కోల్ కత్తా నగరంలో ఫుట్ పాత్ పై పడుకునే ఒక వ్యక్తిని పెద్ద రాయి తో తలపై కొట్టి చంపడం జరిగింది.
ఒకటి తరవాత మరొకటి ఇలా ఫుట్ పాత్ పై శవాలు దొరకటం వల్ల కోల్ కత్తా పోలీసులు అలర్ట్ అవుతారు. కోల్ కత్తా లో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పాడుకోవద్దని కూడా చెప్పారు.
మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తరవాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్ పాత్ పై పడుకునే వారిని చంపేస్తాడు. కోల్ కత్తా లోని ఒక ఇంగ్లీష్ వార్త పత్రిక మొదటి సారి తమ ఆర్టికల్స్ లో ఈ కిల్లర్ ను స్టోన్ మాన్ గా రాయటం జరిగింది.
ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ మొదటిసారి కోల్ కత్తా లో ఈ సీరియల్ కిల్లర్ ను స్టోన్ మాన్ గా పిలవటం జరిగింది. అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ యొక్క స్టోన్ మాన్ గా పడింది.
ముంబై లో జరిగినా మర్డర్స్ మరియు కోల్ కత్తా లో జరిగినా మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, ఫుట్ పాత్ పై ఉండే వ్యక్తులు అంటే బహుశా తనకు కోపం లేదా వీళ్లంటే నచ్చకపోయేది అని ఇరు నగరాల పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్ గా మారాడు.
ఒక సంవత్సరం తరవాత ఈ హత్యలు కోల్ కత్తా లో కూడా ఆగిపోతాయి. పోలీసులకు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాం లోని గౌహటి లో మరొకసారి బండరాయి తో ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మాన్ బ్యాక్ అని వార్తలలో రావటం జరిగింది. అక్కడ కూడా త్రీ హత్యలు జరిగిన తరవాత ఈ హత్యలు ఆగిపోయాయి.
మూడు పెద్ద పెద్ద నగరాలలో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తరవాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలి ఉంది.