Sheena bora murder story

కూతురిని చెల్లిగా ప్రపంచానికి పరిచయం చేసి హత్య చేసిన ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ – Sheena Bora Murder Story

హాయ్ ఫ్రెండ్స్ వికీతెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఇంకొక కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను షీనా బోర మర్డర్ మిస్టరీ గురించి చెప్పబోతున్నాను.

ప్రపంచంలో అమ్మ ప్రేమ వెల కట్టలేనిది కానీ కొంత మంది ఈ మాట మరిచి అతి క్రూరంగా ప్రవర్తిస్తారు. ఈ రోజు నేను ఇంద్రానీ ముఖర్జీ తన కూతురు షీనా బోర ను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే స్టోరీ గురించి తెలుసుకుందాం.

 2015 వ సంవత్సరంలో పోలీస్ కమిషనర్ కు ఒక గుర్తుతెలియని మహిళా కాల్ చేసి షీనా బోర అనే అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి కనపడటం లేదు. ఆమె ను తన సొంత తల్లి అయిన ఇంద్రానీ ముఖర్జీ చంపిందని ఈ కేసు ను ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కాల్ కట్ చేసింది. ఇలా ఈ కేసు స్టోరీ మొదలవుతుంది.  

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే షీనా బోర  అస్సాం రాష్ట్రంలోని గౌహాటీ  కి చెందింది. ఇంద్రానీ వయసు 14 సంవత్సరాలు ఉన్నపుడు సిద్ధార్థ దాస్ అనే వ్యక్తి  తో  ప్రేమలో పడింది. పెళ్లి అవ్వకుండానే వీరిద్దరికి షీనా బోర మరియు మిఖాయిల్ బోర జన్మించారు.    

పెళ్లి అవ్వకుండానే వీరిద్దరూ విడిపోయారు. చిన్న వయసులో పుట్టడం తో గౌహాటీ లోనే తన అమ్మ నాన్నల వద్ద పిల్లలను  వదిలేసి తాను కోల్ కొత్త వెళ్లి చదువును కొనసాగించింది. 

కోల్ కత్తా లో ఉన్న సమయంలో 1993 లో సంజీవ్ ఖన్నా అనే వ్యక్తి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరికి  విధి అనే అమ్మాయి పుడుతుంది. 

1996 సంవత్సరంలో INX Services Private Limited అనే రిక్రూట్ కంపెనీ ను మొదలుపెడుతుంది. 2001 సంవత్సరంలో తన కంపెనీ పనుల మీద ముంబై కి షిఫ్ట్ అవుతుంది.

2002 వ సంవత్సరంలో భర్త సంజీవ్ ఖన్నా తో కూడా విడిపోతుంది. కూతురు నిధి ను తనతో పాటు ఉంచుకుంటుంది. అదే సమయం లో ఇంద్రానీ ముఖర్జీ పీటర్ ముఖర్జీ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త తో పరిచయం ఏర్పడుతుంది. విషయం పెళ్లిదాకా వెళుతుంది. తన కన్నా వయసులో 16 సంవత్సరాలు పెద్ద అయిన పీటర్ ముఖర్జీ తో పెళ్లి చేసుకుంటుంది.

పీటర్ ముఖర్జీ కి ఇది రెండవ పెళ్లి అలాగే ఇంద్రానీ ముఖర్జీ కి కూడా రెండవ పెళ్లి. ఇంద్రానీ ముఖర్జీ తన కూతురు నిధి గురించి మాత్రమే పీటర్ కి చెప్పింది.

చిన్న తనంలో పుట్టిన షీనా బోర మరియు మిఖాయిల్ బోరా లను తన చెల్లెలు మరియు తమ్ముడి లా పరిచయం చేసింది. 

2006 వ సంవత్సరంలో తన తల్లి రెండవ పెళ్లి చేసుకుందని తెలిసి షీనా బోరా కూడా ముంబై వచ్చి చదువును కొనసాగించింది.

షీనా బోరా కూడా ఎప్పుడూ తన తల్లి ఇంద్రానీ ముఖర్జీ అని ఎవరితో చెప్పలేదు. తన తల్లి యొక్క చెల్లెలి లాగానే నటించ సాగింది.

ముంబై లో ఉంటున్న సమయంలో షీనా బోరా పీటర్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్ తో ప్రేమలో పడుతుంది. మేటర్ చాలా సీరియస్ గా మారుతుంది, పెళ్లి చేసుకోవాలని అని కూడా అంటారు.

తండ్రి పీటర్ ముఖర్జీ ఈ పెళ్లి పై అభ్యంతరం తెలపక పోయిన ఇంద్రాణి ముఖర్జీ మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోదు. రాహుల్ కి షీనా బోరా వరుసకు చెల్లి అవుతుంది అదే కాకుండా ఒక వెల వీరి ఇద్దరి పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం షీనా బోరా కు వెళుతుందని కూడా ఇంద్రానీ ముఖర్జీ పెళ్లి కి అడ్డు చెప్పేది. 

పెళ్లి విషయం పై తల్లి కూతుళ్లు తరచూ గొడవ పడేవారు. ఇంతలో షీనా బోరా రాహుల్ ను కలవటం మానేస్తుంది షీనా బోరా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. 

షీనా బోరా గురించి రాహుల్ ఇంద్రానీ ముఖర్జీ ను అడిగినప్పుడు తాను USA వెళ్ళిపోయింది అని చెప్తుంది. రాహుల్ ఈ ఇంద్రానీ మాటలపై డౌట్ వస్తుంది ఎందుకంటే షీనా బోరా పాస్ పోర్ట్ రాహుల్ వద్ద ఉంటుంది.

రాహుల్ ఎంత వెతికిన షీనా బోరా దొరకక పోవటం తో పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఎక్కడికో వెళ్లి ఉంటుంది వచ్చేస్తుంది, దొరికితే మేము ఇన్ ఫార్మ్ చేస్తాం అని సర్ది చెప్పి పంపిస్తారు.

ఇదే సమయంలో రాహుల్ కి షీనా బోరా మొబైల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నేను పర్మనంట్ గా అమెరికా వెళ్ళిపోతున్నాను నన్ను వెతకవద్దు అని మెసేజ్ లో చెపుతుంది. షీనా బోరా మెయిల్ id నుంచి తాను పనిచేస్తున్న కంపెనీ కి కూడా కూని కారణాల వల్ల ఉద్యోగం మానేస్తున్నాను అని మెయిల్ చేస్తుంది.

ఇవన్నీ తెలిసాక రాహుల్ షీనా బోరా ను వెతకటం ఆపేస్తాడు. రాహుల్ క్రమంగా షీనా బోరా ను మరిచిపోతాడు. త్రీ సంవత్సరాలు గడిచిపోతాయి. 

మూడు సంవత్సరాల తరవాత పోలీస్ కమిషనర్ కి కాల్ లో షీనా బోరా చనిపోయిన సంగతి చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజంట్ లో ఆ కాల్ వచ్చిన తరవాత పోలీస్ కమిషనర్ ఆధారాల కోసం వెతకటం ప్రారంభిస్తారు. ఇంద్రానీ ముఖర్జీ మరియు పీటర్ ముఖర్జీ డబ్బులు ఉన్న వాళ్ళు మరియు ఒక పెద్ద వ్యాపార వేత్త కావటం తో అధరాలు లేకుండా అరెస్ట్ చేయలేరు.

 పోలీస్ ఆఫీసర్ లు ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెడతారు. 3 సంవత్సరాల క్రింద ఇంద్రానీ వద్ద డ్రైవర్ గా పనిచేసిన శ్యామ్ ను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటారు కానీ ఈ విషయం తెలిస్తే ఇంద్రానీ అలర్ట్ అవుతుందని పోలీసులు భావించారు. ఆ సమయంలో ఇంద్రానీ ఇండియా లో లేదు వేరే దేశంలో ఉంది. ఇంద్రానీ ఇండియా వచ్చిన తరవాత డ్రైవర్ శ్యామ్ ను అరెస్ట్ చేసి తమదైన శైలి లో పోలీసులు ఎంక్వయిరీ చేయగా జరిగిందంతా చెప్తాడు.

షీనా బోరా కి ఇంద్రానీ కి రాహుల్ తో పెళ్లి గురించి తరచూ గొడవలు జరుగుతున్నప్పుడు ఎలాగైనా షీనా బోరా ను చంపేయాలి అని ఇంద్రానీ ప్లాన్ చేస్తుంది.

ఈ ప్లాన్ లో తన నమ్మకస్తుడైన డ్రైవర్ శ్యామ్ ను మరియు తన రెండవ భర్త సంజయ్ ఖన్నా ను చేర్చుకుంటుంది. రెండవ భర్త కూతురు విధి ఇంద్రానీ వద్ద ఉండటం తో షీనా బోరా చనిపోతే సంజయ్ ఖన్నా కూతురికి ఆస్తి ఎక్కువగా వస్తుందని, వచ్చే ఆస్తి లో నీకు వాటా ఉంటుందని చెప్పటం తో సంజయ్ కూడా ప్లాన్ లో చేరాడు.

ఇంద్రానీ ఒక రోజు షీనా బోరా కు కాల్ చేసి రాహుల్ తో పెళ్లి విషయం మాట్లాడుదాం రమ్మని బాంద్రా ఏరియా కు పిలుస్తుంది. అక్కడికి వచ్చిన తరవాత కార్ లో ఎక్కించి నీళ్లు తాగటానికి ఇస్తారు. నీళ్లలో మత్తు పాదరటం కలపటం వల్ల షీనా బోరా స్పృహ కోల్పోతుంది. 

డ్రైవర్ ముందు నుంచి షీనా బోరా కాళ్ళు పట్టుకుంటే ఇంద్రానీ మరియు సంజయ్ ఖన్నా గొంతు నులిమి చంపేస్తారు.  పగటి సమయంలో శవాన్ని పాతి పెట్టడం కష్టం అని రాత్రి సమయంలో తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత శవాన్ని తీసుకొని పీటర్ ముఖర్జీ ఇంటికి వెళతారు. పార్కింగ్ లో కార్ పెట్టి రాత్రి అవ్వటం కోసం వెయిట్ చేస్తారు. 

రాత్రి అయిన తరవాత షీనా బోరాను శవాన్ని మధ్య లో కుర్చోబెట్టుకొని ఒక వైపు ఇంద్రానీ మరోవైపు సంజయ్ ఖన్నా కూర్చొని డ్రైవర్ సహాయం తో పెట్రోల్ కూడా తీసుకొని రాయి గడ్ కి వెళతారు. అక్కడ శవాన్ని పెట్రోల్ తో కాల్చేసి పూడ్చి పెట్టి ఇంటికి వచ్చేస్తారు.

రాత్రి సమయం అవ్వటం తో శవం యొక్క కొంత భాగం పైనే ఉండిపోతుంది.  ఈ విషయం అక్కడి పోలీసులకు తెలుసుతుంది. పోలీసులు కొన్ని రోజులు మిస్సింగ్ కంప్లైంట్ కోసం వెయిట్ చేస్తారు. ఎవరు ఆ శవం తాలూకు రాకపోవటం తో ఆ మిగిలిన కొంత భగాని పోలీసులు పూడ్చిపెడతారు.

డ్రైవర్ ఇదంతా చెప్పాక రాయగడ్ వెళ్లి షీనా బోరా డెడ్ బాడీ ను రికవర్ చేసుకుంటుంది. లోకల్ పోలీసుల ద్వారా మిగిలిన శవం యొక్క భగాలను రికవర్ చేసుకుంటారు.

ఈ హత్యలో ఇంద్రానీ హస్తం ఉంది అనటానికి ఎలాంటి సాక్ష్యం లేదు అని కాల్ రికార్డ్స్ చెక్ చేస్తారు. అప్పుడు ముగ్గురి కాల్ లొకేషన్స్ బాంద్రా మరియు రాయగడ్ లో ఉన్నట్లు చూపిస్తాయి.

కాల్ రికార్డ్స్ కంఫర్మ్ అయ్యాక ఇంద్రానీ ముఖర్జీ ని అరెస్ట్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతం ఇంద్రానీ జైలులో ఉంది. రీసెంట్ గా తన కూతురు బతికే ఉందని జైలు లో ఉన్న ఒక్క మహిళ చూసిందని కూడా ఆరోపణలు చేసింది. ఇదంతా జైలు నుంచి బయటకి రావటానికి చేస్తున్న ప్లాన్స్ అని చాలా మంది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *