dhirendar singh seriall killer story

మనుషులను చంపి వారి మెదడును తినే ఒక నరభక్షకుడి సీరియల్ కిల్లింగ్స్ స్టోరీ – Serial killer dhirendar singh story

హాయ్ ఫ్రెండ్స్ క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ఇంతకు ముందు 2 ఎపిసోడ్ లలో నేను నరభక్షకుల స్టోరీలు చెప్పాను.  

ఈ రోజు చెప్పబోయే స్టోరీ కూడా ఒక నరభక్షకుడిది. ఈ స్టోరీ మీకు కాస్త డిస్టర్బింగ్ గా కూడా అనిపించ వచ్చు.

17 డిసెంబర్ 2000 సంవత్సరంలో అలహాబాద్ కు చెందిన హిందీ డైలీ న్యూస్ పేపర్ అయిన దిన పత్రిక కు చెందిన ఒక జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ కనిపించకుండా పోతాడు. రోజు తన పని పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చే ధీరేందర్ సింగ్ ఆ రోజు ఇంటికి రాక పోయే సరికి ఫ్యామిలీ వాళ్ళు వెతకటం ప్రారంభిస్తారు. ఎంత వెతికిన ఆచూకీ మాత్రం తెలియదు. మొబైల్ ఫోన్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రావటం జరిగింది.

చివరికి చేసేది ఏమి లేక ధీరేందర్ సింగ్ ఫ్యామిలీ కిడ్గంజ్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక అదే సమయంలో ధీరేందర్ సింగ్ తో పాటు ఇంకొంత మంది కూడా మిస్ అయినట్లు తెలిసింది.

పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ధీరేందర్ సింగ్ గురించి ఏమి తెలియలేదు. కాల్ డీటెయిల్స్ చేసి లాస్ట్ కాల్ ఎవరికీ చేసాడో కనుక్కుందామని చూసినప్పుడు పూలన్ దేవి అనే మహిళ యొక్క ల్యాండ్ లైన్ నెంబర్ కి ధీరేందర్ సింగ్ కాల్ చేసినట్లు తెలుస్తుంది. పూలన్ దేవి ఇంటి నుంచి కూడా ధీరేందర్ సింగ్ కు కాల్ వచ్చినట్లు తెలిసింది.  

పూలన్ దేవి అక్కడి గ్రామ సభ యొక్క సభ్యురాలు, పూలన్ దేవి ఇంటికి వెళ్లి జర్నలిస్ట్ గురించి అడిగినప్పుడు పూలన్ దేవి యొక్క భర్త రామ్ నిరంజన్ నాకు ధీరేందర్ సింగ్ తెలుసు అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాము. నా భార్య ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జర్నలిస్ట్ తో పరిచయం ఉంది అని చెప్పటం జరుగుతుంది. 

కానీ పోలీసులకు రామ్ నిరంజన్ చెప్పే మాటలు నమ్మ బుడ్డి అవ్వలేదు ఎందుకంటే అర్ద రాత్రి ధీరేందర్ సింగ్ కాల్ చేసి ఎందుకు మాట్లాడాడు. ఆ సమయంలో అంట ఇంపార్టెంట్ పని ఏమి ఉంది ఉంటుంది అనే కోణం లో విచారించారు. 

ఈ ఫ్యామిలీ గురించి విచారించినప్పుడు పెళ్లి అయిన తరవాత భర్త రామ్ నిరంజన్ భార్య పేరు పూలన్ దేవి మరియు ఇద్దరు కొడుకుల పేర్లు అదాలత్ అంటే కోర్ట్ మరియు జామానత్ అంటే బెయిల్ అని పెట్టినట్లు తెలిసింది. రామ్ నిరంజన్ Central Ordinance Depot (COD) లో ఒక మాములు ఉద్యోగి అని కూడా తెలిసింది.  

పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేతున్న సమయంలో ధీరేందర్ సింగ్ యొక్క బైక్, ఫోన్ మరియు ఛార్జ్ Central Ordinance Depot (COD) వద్ద కనిపించటం తో పోలీసుల అనుమానం ఇంకాస్త పెరిగింది. మరోసారి రామ్ నిరంజన్ ను విచారించగా నేను నిజం ఐతే చెప్తాను కానీ నన్ను ఏమి చేయొద్దు అని అంటాడు. పోలీసులు సరే అని అంటారు. 

ఇంటికి దూరం ఊరి బయట తన వ్యవసాయ భూమిలోనే ఒక చిన్న రూమ్ ఉండేది, ఆ రూమ్ వద్దకి తీసుకెళ్తాడు. ఈ రూమ్ కలన్దర్ యొక్క రాజుది, ఈ రాజు తన యొక్క తీర్పులను ఇక్కడే నిర్ణయిస్తాడు. అతని మెదడు చాలా చురుకైనది తనకు ఎవ్వరు పట్టుకోలేరు అని పోలీసులతో అంటాడు.

పోలీసులు ఈ కలం లో రాజు ఎక్కడినుంచి వచ్చాడు, ఈ కలన్దర్ రాజు ఎవరు అని ఆశ్చర్య పోతారు. అక్కడే పడి ఉన్న రెండు మనిషి యొక్క పుర్రెలను చేతిలో పట్టుకొని  వీరిద్దరిని కలన్దర్ రాజు చంపేశాడు అని అంటాడు. అక్కడే చెట్టుపై వేలాడుతున్న ఇంకొన్ని కలర్ చేసిన పుర్రెలను చూపించి వారందరిని కూడా కలన్దర్ రాజే చంపేశాడు అని అంటాడు. ఇవన్నీ రాజుకి చెందిన ట్రోఫీలు అని అంటాడు.

ఒక్క మిస్సింగ్ కోసం వచ్చిన పోలీసులకు 14 మంది పుర్రెలు దొరుకుతాయి. అప్పుడు ఈ హత్యల వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులకు అర్థము అయిపోతుంది.

పోలీసులు ధీరేందర్ సింగ్ ఎక్కడున్నాడని అడగగా, కలన్దర్ రాజు తనకు శిక్ష విధించాడని చెప్తాడు. అతని బాడీ ఎక్కడుందని అడగగా తీసుకెళ్లి బాడీ ని చూపిస్తాడు. ధీరేందర్ సింగ్ ను చంపి ముక్కలు  ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పాటి పెట్టాడు. ఇంతకీ కలన్దర్ రాజు ఎవరు అని అడగగా నేనే కలన్దర్ రాజు అని అంటాడు..

ఈ మాట విని ఆశ్చర్య పోయిన పోలీసులు ధీరేందర్ సింగ్ ను ఎందుకు చంపావు అని అడగగా నేను చంపక పొతే నా గురించే న్యూస్ పేపర్ లో స్టోరీ రాసేవాడు అందుకే చంపాను అని చెప్పాడు.

నీకు ఇంకెవరు సహాయం చేశారు అని అడగగా బావ మరిది సహాయం చేసేవాడని చెప్పాడు. మిగతా వారిని ఎందుకు చంపావు అని పోలీసులు విచారించగా నేను చంపిన వారు అందరు చాలా తెలివైన వారు అని అందుకే వీళ్లందరినీ చంపేవాడినని, చంపిన తరవాత శవం నుంచి తల భాగాన్ని వేరు చేసి మిగతా శరీరాన్ని ఎక్కడైనా దూరంగా వెళ్లి పూడ్చి పెట్టేవాడినని చెప్పాడు. తన వద్ద ఉన్న తల లో నుంచి వీరి బ్రెయిన్ యొక్క సూప్ చేసి తాగేవాడిని అని పోలీసులతో వివరిస్తాడు.

అక్కడున్న పుర్రెలపై ఎందుకు కాలాలు వేశావు అని అడగగా తనకు గుర్తు ఉందని కలర్ వేసి పేరు రాసుకుంటానని చెప్పాడు. 

పోలీసులు ఇతని గురించి ఇంకాస్త విచారించగా చిన్న చిన్న విషయాలలో ఇతనికి కోపం వచ్చేదని ఆలా కోపం వచ్చినప్పుడు లేదా ఏ కారణం లేకుండా కూడా తన వ్యవసాయ భూమి వద్దకు పిలిచి మనుషులను చంపేసేవాడు అని తెలిసింది.   

రామ్ నిరంజన్ లో చిన్నప్పటినుంచే  అంతగా తెలివితేటలు లేకపోవటం వల్ల తనను తానే బుద్ది మంతుడిగా మరియు రాజు గా ఊహించుకోవటం మొదలుపెట్టాడు.

 ఇతని ఇంటికి వెళ్లి కూడా సెర్చ్ చేయగా the court diary  అనే పేరు తో ఒక డైరీ దొరికింది. ఈ డైరీలో తానూ చంపిన 14 మంది పేర్లు ఉన్నాయి.

2001 లో కోర్టులో ఈ కేసు ను పెట్టగా 12  సంవత్సరాల తరవాత 2012 సంవత్సరంలో జీవిత ఖైదు విధించటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *