
గాలిలో మాయమైన విమానం 35 సంవత్సరాల తరవాత తిరిగివచ్చింది Flight 513 Story
ఈ రోజు నేను చెప్పబోయే కథ కూడా ఏరోప్లేన్ మిస్టరీ కి సంబంధించినది. 1989 సంవత్సరంలో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లాయిడ్ లో పబ్లిష్ అయిన ఒక స్టోరీ.
1954 సంవత్సరంలో Santiago Airlines Flight 513 వెస్ట్ జర్మనీ లోని ఆచెన్ అనే పట్టణం నుంచి బ్రెజిల్ లోని పోర్టో అలెగ్రే అనే పట్టణానికి బయలుదేరింది.
ఈ ప్రయాణం యొక్క సమయం 18 గంటలు, ప్రయాణం మొదలు పెట్టిన విమానం అట్లాంటిక్ సముద్రం వద్దకు చేరుకున్నాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) తో కనెక్షన్ కట్ అయ్యింది. ఆ తరవాత కనిపించకుండా మాయమై పోయింది.
అప్పటి అధికారులు విమానం సముద్రం లో క్రాష్ అయ్యి ఉంటుందని భావించి సెర్చ్ చేయటానికి రెస్క్యూ టీం లను పంపించటం జరిగింది. ఎంత వెతికిన ప్లేన్ కానీ ప్లేన్ కి సంబంధించిన భాగాలు లేదా ప్రయాణికుల ఆచూకీ తెలియలేదు.
రెండు సంవత్సరాలు గడిచిన తరవాత సాంటియాగో విమాన కంపెనీ మూతబడిపోయింది. 1989 సంవత్సరంలో 35 సంవత్సరాలు గడిచిన తరవాత బ్రెజిల్ లోని పోర్టో అలెగ్రే ఎయిర్ పోర్ట్ లో ఒక విమానం అనధికారంగా ల్యాండ్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది.
ఎయిర్ పోర్ట్ ATC ఆ విమాన పైలట్ తో కాంటాక్ట్ చేయటానికి ట్రై చేస్తారు కానీ అక్కడినుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. చివరికి ప్లేన్ రన్ వే పై కి వచ్చి పర్ఫెక్ట్ లాండింగ్ చేస్తుంది.
ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న సిబ్బంది ఆ ప్లేన్ ను సాంటియాగో కంపెనీ కి చెందినది గా గుర్తిస్తారు కానీ సాంటియాగో కంపెనీ మాత్రం 1956 లోనే మూతబడిపోయింది. మరి ఈ ప్లేన్ ఎక్కడినుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతారు.
అక్కడున్న కొందరు ఇలాంటి ప్లేన్ 35 సంవత్సరాలకు ముందు మాయమైన విషయాన్నీ కూడా చర్చించటం మొదలుపెడతారు.
అక్కడున్న అధికారులు ప్లేన్ మంచి కండిషన్ లో ఉండటం మరియు ఇంజన్ రన్నింగ్ లో ఉండటం గమనించారు. మెల్లగా ఆ ప్లేన్ దగ్గరికి వెళ్లి డోర్లు ఓపెన్ చేసి చూడగా అక్కడున్న వారు భయం తో వణికిపోయారు.
డోర్ తెరిచి చూసినప్పుడు 88 పాసెంజర్లు మరియు నలుగురు సిబ్బంది, మొత్తం 92 మంది అస్థిపంజరాలు తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నాయి. సీట్ బెల్ట్ లు కూడా అలాగే ఉన్నాయి.
కాక్ పిట్ లో వెళ్లి చూడగా కెప్టెన్ మిగేల్ విక్టర్ కూడా అస్థిపంజరంలా మారి ఉన్నాడు కానీ తన చేతులు మాత్రం విమానం యొక్క కంట్రోలర్స్ పైన ఉన్నాయి.
ఈ ప్లేన్ లో పైలట్ తో సహా అందరు చనిపోతే ప్లేన్ సేఫ్ గా ఎలా ల్యాండ్ అయ్యింది అని కూడా సందేహాలు రావటం మొదలయ్యాయి.
35 సంవత్సరాల ముందు ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక ప్లేన్ 35 సంవత్సరాల తరవాత అదే ఎయిర్ పోర్ట్ కి ప్రయాణికుల అస్తిపంజరాలతో రావటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుందని తెలిసి బ్రెజిల్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
35 సంవత్సరాలు ఈ ప్లేన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది. ఒక చనిపోయిన పైలట్ విమానాన్ని ఎలా ల్యాండ్ చేసాడు. వీరందరి చావుకు కారణం ఏంటి అనే విషయాల పై ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు.
కొన్ని వాదనల ప్రకారం ఈ ప్లేన్ టైం ట్రావెల్ కి గురి అయ్యిందని చెప్పటం జరిగింది. ఎందుకంటే అంతరిక్షంలోని కొన్ని ప్రాంతాలలో టైం చాల స్లోగా కదులుతుంది. అక్కడ గడిపిన కొన్ని గంటలు భూమి కొన్ని సంవత్సరాలకు సమానం.
ఇలా టైం ట్రావెల్ చేసి 35 సంవత్సరాల తరవాత తిరిగివచ్చింది అని అందులో ఉన్న ప్రయాణికులు రేడియేషన్ వల్ల మరణించారని వాదించటం జరిగింది.
ఇంకొక థియరీ ప్రకారం ఆ విమానంపై టైం ట్రావెల్ కి సంబంచిన ఒక ఎక్స్పరిమెంట్ జరిగిందని కూడా వాదించటం జరిగింది.
కానీ ఇవన్నీ జరిగాయి అన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కథనాన్ని ప్రచురించిన వీక్లీ వరల్డ్ న్యూస్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు పైగా వీక్లీ వరల్డ్ న్యూస్ విమానాలకు సంబంధించిన పలు కథనాలు ఇంతకూ ముందు కూడా రాయటం జరిగింది.
ఈ టాబ్లాయిడ్ (వార్త పత్రిక) న్యూస్ ఫేక్ స్టోరీస్ రాస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంత మందికి ఇలాంటి స్టోరీస్ వినటానికి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి కానీ ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలు నిజం అని కూడా చెప్పలేము.