Source: India's Got Latent

ఇండియాస్ గాట్ లేటెంట్ – రణవీర్ అలాహాబాదియా కాంట్రవర్సీ ఫుల్ స్టోరీ

రణవీర్ అలాహాబాదియా యూట్యూబ్ లో పాడ్‌కాస్ట్‌ వీడియోలు చేస్తూ ఉంటాడు. 

ఇతని వీడియోలను లక్షల కొద్ధి మంది చూస్తారు. ఇతని ఛానల్‌లో పెద్ద పెద్ద సెలెబ్రిటీలను ఇంటర్వ్యూకు ఆహ్వానించడం జరిగింది.

ఇటీవల, “పాడ్‌కాస్ట్” ఫార్మాట్ చాలా వైరల్‌గా మారింది.

ఈ వారం రణవీర్, సమయ్ రైనా అనే స్టాండప్ కమెడియన్ యొక్క షో అయిన ఇండియా గాట్ లేటెంట్ అనే షో కి వెళ్లిన ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది.  

ఈ షో లో రణవీర్ వాడిన పదజాలం చాలామందిని ఇబ్బందికి గురి చేసింది. 

ఈ షో కి వచ్చిన ఒక కంటెస్టెంట్ తో రణవీర్ మాట్లాడుతూ “మీ అమ్మ నాన్న సె*  చేస్తూ ఉంటే రోజూ చూస్తావా ? లేదా నువ్వే స్వయంగా వెళ్లి ఆపుతావా” అని అసభ్యకరమైన భాషను ప్రయోగించి కామెంట్ చేసాడు. 

ఈ షో “మెంబర్స్ ఓన్లీ” కంటెంట్‌గా ఉండటంతో, సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారే చూడగలరు. అందుకే ఈ వీడియో వైరల్ అవ్వటానికి కాస్త సమయం పట్టింది. 

ఈ వీడియోను చూసిన వారు, దానికి సంబంధించిన చిన్న క్లిప్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించారు.

చాలా తక్కువ సమయంలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.రణవీర్ అలాహాబాదియ అనే యూట్యూబర్ ఇలాంటి పదజాలం వాడటం ఫాన్స్ తట్టుకోలేకపోయారు. 

రణవీర్ ఛానల్‌లో ప్రధానంగా గంభీరమైన (సీరియస్) విషయాలపై వీడియోలు అప్లోడ్ చేస్తారు. అలాంటిది రణవీర్ ఇలాంటి అసభ్య వీడియోలు చేయటం ప్రజలలో కోపాన్ని ఇప్పించింది. 

షో హోస్ట్ చేసిన సమయ్ ను మరియు రణవీర్ ను అరెస్ట్ చేయాలని చాలా మంది సోషల్ మీడియా ద్వారా నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. 

ఈ వీడియోపై ప్రజలు చూపిస్తున్న ఆగ్రహం మరియు ఫ్యాన్స్ అసంతృప్తిని చూసి, రణవీర్ క్షమాపణలు చెప్పారు.

“నేను చేసినది తప్పే. నేను నా తప్పును సమర్థించుకోవడం లేదు. నాకు అస్సలు కామెడీ చేయడం రాదు. అందుకు మీరు అందరూ క్షమించాలి” అని రణవీర్ తన ట్విట్టర్‌లో ఓ చిన్న వీడియో పోస్ట్ చేశారు.

ఇంతకీ “ఇండియాస్ గాట్ లేటెంట్” షో అంటే ఏమిటి?

ఈ లేటెంట్ షో అనేది కొన్ని నెలల ముందు సమయ్ రైనా అనే కాశ్మీర్ కి చెందిన ఒక స్టాండప్ కమెడియన్ ప్రారంభించాడు. 

సమయ రైనా చేసే అడల్ట్ జోకుల కారణంగా చాలా తక్కువ కాలంలో ఫేమస్ అయ్యాడు. స్టేజి షోస్ మరియు యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లు చేసేవాడు. 

ఇక తాను చేసే కామెడీ అందరికి నచ్చుతుందని తెలుసుకున్న సమయ్ తన సొంత షో ” India got latent” అనే షో ను ప్రారంభించాడు. 

ఈ షో లో ప్రతి కాంటస్టెంట్ కి 90 సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది. తమలో ఉన్న ఏ ట్యాలెంట్ అయినా సరే చేసి చూపించాలి అలాగే తాము చేసే performance కి కంటెస్టెంట్స్ మార్కులు ఇచ్చుకోవాలి. 

పెర్ఫార్మెన్స్ తరవాత జడ్జిలు కూడా మార్కులు ఇస్తారు. ఇద్దరి మార్కులు సమానం అయినప్పుడు కంటెస్టెంట్ గెలిచాడు అని నిర్దారిస్తారు. 

ఉదహరాకి రమేష్ అనే కంటెస్టెంట్ గా అక్కడికి వెళ్ళాడు. రమేష్ తనకి ఇచ్చిన 90 సెకన్డ్స్ టైం లో ఒక మంచి పాటను పాడి తన టాలెంట్ ను చూపించుకున్నాడు. రమేష్ స్టేజి పైకి రాక ముందే తన పెర్ఫార్మెన్స్ కి 7 మార్కులు ఇచ్చుకున్నాడు. 

రమేష్ పడటం అయిపోయిన తరవాత జడ్జీలు తమకు తోచిన విధంగా మార్కులు ఇస్తారు. అందరు జడ్జీలు ఇచ్చిన మార్కుల యొక్క సగటు 7 మార్కులు అయితే అప్పుడు రమేష్ గెలిచినట్టు అవుతుంది. 

సమయ్ రైనా ఎవరు?

సమయ్ రైనా కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు.

 సమయ్ చూడటానికి తెల్లగా ఉండటం వల్ల చిన్నప్పుడు స్కూల్ లో తోటి పిల్లలు చాలా సతాయించేవారు. 

పెద్దగైనా తరవాత ప్రింటింగ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నాడు. 

మెల్లగా కామెడీ వీడియోలు చేయటం ప్రారంభించాడు. తన కామెడీ టైమింగ్ చాలా మందికి నచ్చేది. చాలా కొద్దీ కాలంలోనే తన యూట్యూబ్ ఛానల్ కి మిలియన్ ఫాలోవర్స్ చేరారు. 

ప్రైమ్ లో కామిక్ స్తాన్ అనే షో లో పోటీ పడీ గెలిచాడు. క్రమ క్రమంగా తన షోస్ కి జనాలు ఎక్కువగా రావటం ప్రారంభించారు. 

తనకున్న పాపులారిటీ ను గ్రహించి ఒక కొత్త షో   India’s got latent ను ప్రారంభించాడు. 

సాధారణంగా సమయ్ షో లో సాధారణ జోకులతో పాటు అడల్ట్ జోకులు కూడా ఉంటాయి. కానీ ఈ వరం చేసిన ఎపిసోడ్ లో జోక్స్ చేయటం లో హద్దులు దాటారని ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు, హిందీ న్యూస్ ఛానల్ లలో దీనిని కవర్ చేయటం వల్ల ఇది ఒక పాపులర్ న్యూస్ స్టోరీ గా మారింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *