75 years Red shoe murder mystery

75 సంవత్సరాల తరవాత కూడా అంతుచిక్కని నాలుగేళ్ల పాప హంతకుడు – Red Shoe Murder story

ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక unsolved murder mystery. ఈ రోజుకి ఈ మర్డర్ జరిగి 75 సంవత్సరాలు అవుతుంది కానీ మిస్టరీ మాత్రం వీడలేదు.   

ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీ లో Rawdon Avenue లో నోర్మా మేరీ డేల్ అనే నాలుగు సంవత్సరాల పాప తల్లితండ్రులతో నివసించేది. 

1946 సంవత్సరం సెప్టెంబర్ 21, శనివారం రోజు నోర్మా డేల్ తండ్రి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీం మ్యాచ్ చూడటానికి వెళ్తాడు.

ప్రతి శనివారం నోర్మా డేల్ డాన్స్ క్లాసులకు వెళ్ళేది తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది.  ఆ రోజు కూడా ఎప్పటి లాగే డ్యాన్స్ క్లాసు ముగించుకొని తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగటానికి కోసం ఆగుతుంది.

నోర్మా డేల్ ఆ రోజు ఇంటికి రాను నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటాను అని చెప్తుంది. తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తుంది కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది.

తల్లి తన వెంట రావటం లేదు అని ఒక చిన్నగా భయపెట్టడానికి కొట్టి తన తో పాటు తీసుకెళుతుంది.

ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మా డేల్ ను వదిలేసి ఉంటె ఈ రోజు బతికే ఉండేది అని తల్లి తరవాత చాలా బాధ పడింది.

నోర్మా డేల్  ఇంట్లోకి వచ్చినట్లు వచ్చి మళ్ళీ బయటికి ఆడుకోవటానికి వెళుతుంది. బయటికి వెళ్లిన నోర్మా పొరిగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లి కి వినిపిస్తుంది. ఆ తరవాత తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకురావటానికి బయటికి వెళుతుంది. 

ఇంటి నుంచి బయటి వచ్చాక అదే స్ట్రీట్ లో ఉన్న ఒక అబ్బాయి తో ఆడుకోవటానికి వెళుతుంది. ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్లలో రాలు విసురుతూ ఉంటారు.

ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ల దగ్గరికి వెళ్లొద్దు మునిగిపోతారు అని చెప్పి, నోర్మా డేల్ ను తన తో పాటు ఆపిల్ పండు కొనిస్తానని చెప్పి తీసుకెళతాడు. 

ఇదంతా చుసిన ఆ అబ్బాయి తరవాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు బ్రౌన్ overcoat వేసుకొని ఉన్నాడని చెప్తాడు. 

తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి నోర్మా డేల్  ను పిలవగా ఎలాంటి జవాబు రాలేదు. ఆ చుట్టూ పక్క కూడా చూడగా ఎక్కడా కూడా నోర్మా డేల్ కనిపించలేదు.

3:30 నిమిషాలకు ఆ చుట్టు పక్క ఉన్న అందరికి నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది. నోర్మా డేల్ కోసం వెతకటం ప్రారంభిస్తారు.

సాయంత్రం 6:30 నిమిషాలకు నోర్మా డేల్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవ్వరు లేరు. బయటికి వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్నివెతుకుతున్నట్లుగా తెలుసుకుంటాడు. 

అర్ధరాత్రి వరకు నోర్మా డేల్ గురించి వెతుకుతూనే ఉంటారు. ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు.

ఉదయం 10 గంటలకు ఒక 11 సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మా డేల్ శవాన్ని చూస్తాడు.

వెంటనే వెళ్లి నోర్మా డేల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు. నోర్మా డేల్ యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే పడిఉంది.

నోర్మా డేల్ శవాన్ని చూసినప్పుడు తన కాలిలోని ఒక షూ మిస్సింగ్ గా ఉంది. తనను గొంతు నులిమి చంపేసినట్లు ఆధారాలు ఉన్నాయి.

డాక్టర్లు టైం అఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు. నోర్మా డేల్ ను చంపిన వ్యక్తి  శవాన్ని దాచిపెట్టి  ఉదయం 10 గంటల పదిహేను నిమిషాల సమయంలో నోర్మా డేల్ ఇంటి వద్ద పడేసాడు. 

నోర్మా డేల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలా మంది వెతికారు కానీ ఆ శవం ఇంతకు ముందు లేదు. అక్కడే ఒక లారీ ఉండటం తో ఆ లారీ యజమాని ను కూడా పిలిచి అడిగారు.       

ఆ లారీ డ్రైవర్ శనివారం రెండు గంటల యాభై నిమిషాలకు ఇంటికి వచ్చానని ఆ తరవాత మరుసటి రోజు 10 గంటల సమయంలోనే లారీ వద్దకు వెళ్లానని రెండు సార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు.

ఆ శవం దొరికిన దగ్గర్లోనే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురితో ఆడుకోవటానికి మా ఇంటికి నోర్మా వస్తూ ఉంటుంది అని చెప్పాడు. 

శనివారం రోజు మాత్రం రెండు గంటల 45 నిమిషాలకు తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను. 

అప్పుడే నోర్మా తండ్రి సైకిల్ పై వెళ్ళటం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను. ఆ తరవాత ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాను అని చెప్పాడు. నిజానికి నోర్మా డేల్ తండ్రి ఇంటి నుంచి రెండు గంటలకే వెళ్ళిపోయాడు. నోర్మా డేల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి 3:30 కి తెలిసింది. 

శవం వద్ద దగ్గరిలో ఉన్న రెండవ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన ఘటన తో మ్యాచ్ అవ్వటం లేదు. అతని పై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన స్నేహితుడిని విచారించగా ఔను మేము ఇద్దరం 2 :50 నిమిషాల నుంచి 5 :30 నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పటం తో అతని మీద కూడా అనుమానం పోయింది. 

ఒక 15 సంవత్సరాల అమ్మాయి కూడా 2:35 నిమిషాల సమయంలో నోర్మా డేల్ ను చూశానని చెప్పింది.  ఆ తరవాతే నోర్మా డేల్ కనిపించకుండా పోయింది.

పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో 1000 స్టేట్ మెంట్లను తీసుకున్నారు. నోర్మా డేల్ ఇంటి వెనక భాగంలో ఉన్న ఖాళీ  స్థలం లో 10 ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు. షూ మాత్రం కనిపించలేదు. 

ఎంత వెతికినా కిల్లర్ దొరకక పోవటం తో కేసు అలాగే పెండింగ్ లో ఉంది పోయింది. సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది.

అది ఏమిటంటే 2016 లో  80 సంవత్సరాల నోర్మా డేల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనే నోర్మా ను చంపిన అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు. 

మర్డర్ జరిగిన కొన్ని రోజుల తరవాత నోర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు. తల్లి బయట ఎవిరితోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలలో నోర్మా ను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.

తల్లి తన కొడుకు ఎదో పుస్తకం చదువుతున్నాడు మా మాటలను వినటం లేదు అనుకుంటుంది. కానీ నోర్మా గురించి విన్న వెంటనే పుస్తకం  చదువుతున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాడు.  

నోర్మా ఆడుకుంటునప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరానిది ఎదో చూసింది అందుకే చంపబడింది అని తన తల్లి ఒకరితో చెబుతుంటే విన్నానని చెప్పాడు. చంపిన వ్యక్తి పేరు కూడా చెప్పింది కానీ ఆధారాలు లేవు అని అన్నాడు.    

4 సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది. ఒక వేళా చుసిన తనకు ఎం గుర్తు ఉంటుంది. ఎవరో చేసిన దానికి అభం శుభం తెలియని నోర్మా డేల్ బలి అయ్యింది.

నోర్మా డేల్ మిస్ అయినా సమయంలోనే కొన్ని వార్త పత్రికలు గత నాలుగు నెలల్లో ఇది మూడో మర్డర్, ఇంతకు ముందు ఇంకో ఇద్దరు పిల్లలు చనిపోయారని  రాయటం జరిగింది.

కొంత మంది థియరీల ప్రకారం ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అని అయ్యి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయి ఉంది.

నోర్మా డేల్ మరో కజిన్ బ్రయాన్ డేల్ మరియు భార్య బెత్ కలిసి ఈ మొత్తం ఘటన పై ఒక బుక్ కూడా రాసాడు.

ఈ బుక్ పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు. ఈ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు కానీ తనే హత్య చేసాడని ఆధారం మాత్రం లేదు.  బుక్ పబ్లిష్ అయితే తమ పై లీగల్ ఆక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిష్ చేయలేదు. 

నోర్మా డేల్ తల్లి తండ్రులు ఇద్దరు వాళ్ల కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండానే  చనిపోయారు. ఆ సమయం లో DNA ద్వారా క్రిమినల్ ను పట్టే పద్దతి లేకపోవటం తో క్రిమినల్ మిస్ అయ్యాడు అని కొంతమంది చెబుతుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *