Kolkata Partho dey story

చనిపోయిన చెల్లెలి డెడ్ బాడీ తో 6 నెలలు జీవించిన సోదరుడు పార్థో దెయ్ స్టోరీ

హాయ్ ఫ్రెండ్స్ వికీతెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను.

ఈ రోజు నేను కోల్  కత్తా లో  నివసించిన ఒక ఫ్యామిలి గురించి చెప్పబోతున్నాను. ప్రస్తుతం మనం నివసిస్తున్న కాలంలో మన పక్క ఉన్న ఇళ్లలో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారో తెలియదు. 

మన చుట్టుపక్కల ఎం అవుతుందో తెలుసుపోక పోవటం వల్ల చాలా రకాల క్రైమ్స్, సుసైడ్స్ అవుతుంటాయి. 

2015 సంవత్సరం, జూన్ 10 వ తేదీన కోల్కత్త లోని త్రీ రాబిన్సన్ స్ట్రీట్ అనే ఒక పాశ్ ఏరియా లో ఉన్న ఒక ఇంటి నుంచి మంటలు చెలరేగుతూ ఉంటాయి. కాసేపట్లో ఆ మంటలను ఆర్పటం జరుగుతుంది. 

ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడున్న ఒక బాత్రూం లో నుంచి మంటలు వస్తున్నాయి. బాత్ రూమ్ ని ఓపెన్ చేసి చూడగా ఆ రూమ్ లో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని చనిపోయాడు.

పోలీసులు అక్కడికి వచ్చారు, విచారించటం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తి అరబింద్ డే వయస్సు 77 సంవత్సరాలు.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే అరబిందో డే తండ్రి కోల్ కత్తా లోని ఈ ఇంటిని కొంటాడు. అరబిందో డే కి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. ఇద్దరు అన్న దమ్ములు రాబిన్సన్ స్ట్రీట్ లో ఉన్న ఇంట్లో ఉండేవారు. ఈ ఇల్లు దాదాపు ఒక ఎకరంలో విస్తరించి ఉంటుంది. ఇల్లు పెద్దది కావటం తో ఒక వైపు అన్న అరబిందో మరియు మరోవైపు తమ్ముడు Arun ఉండేవాడు. 

అరబిందో డే కి ఒక భార్య Arati De అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి పేరు దేబ్ జానీ మరొకరి పేరు పార్థో డే.

అరబిందో డే ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేసేవాడు. కోల్ కత్తా నుంచి దూరంగా బెంగళూరు మరియు ముంబై లో ఉద్యోగం చేసేవాడు. 

అరబిందో మరియు తమ్ముడు అరుణ్ కి గొడవలు అయ్యేవి. అరుణ్ ఇంటికి కేవలం దేబ్ జానీ మాత్రమే వెళ్ళేది అది కూడా తన నాన్నమ్మ ఉంది అని. నాన్నమ్మ చనిపోయిన తరవాత దేబ్ జానీ కూడా అక్కడికి వెళ్ళటం మానేసింది.   

కోల్కత్త లో ఫామిలీ ను వదిలి ఉండటం ఇష్టం లేకో లేదా పిల్లలు గుర్తు వచ్చో, ఏదైతే ఏముంది తన ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకొని 1988 లో Arabindo de  కోల్కత్త కి తిరిగి వచ్చాడు. 

కొడుకు పార్థో డే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. మొదట ఇండియా లోనే ఒక కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. 

ఇక్కడ కొన్ని రోజులు పనిచేసిన తరవాత కంపెనీ పార్థో ను అమెరికా కి పంపింది. అక్కడికి వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. పార్థో మరియు తన ఫామిలీ మెంబెర్స్ మొత్తం ఎక్కువగా ఎవరితో మాట్లాడేవారు కాదు. 

కొన్ని న్యూస్ చానెల్స్ ప్రకారం పార్థో యొక్క తల్లి తండ్రులు తరచూ గొడవ పడేవారు.

కోల్కత్త లోని ఇంట్లో పార్థో తల్లి చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేది. 

తండ్రి రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఎక్కువ సమయం కోల్కత్త లోని సోషల్ క్లబ్స్ లో గడిపేవాడు. గోల్ఫ్ ఆడటం , కార్ నడపటం లాంటివి చేసేవాడు.

ఇక మిగిలింది పార్థో అక్క, అక్క దేబ్ జానీ మ్యూజిక్ కి సంబంచిన కోర్స్ చేసింది. అక్కడే ఒక స్కూల్ లో మ్యూజిక్ టీచర్ గా కూడా పనిచేసేది. అక్కడ తన తో పాటు పనిచేసే ఒక టీచర్ తో నాకు పెళ్లి చేసుకోవటం లేదు, నేను ఒక సన్యాసిలా మారాలనుకుంటున్నాను అని తన ఆలోచనలను చెప్పేది. 

2007 వ సంవత్సరంలో అరబిందో డే కుటుంబంలో వచ్చిన ఒక్క విషాదం ఆ ఇంట్లో వాళ్ళ తలరాతను మార్చేస్తుంది. పార్థో తల్లి కాన్సర్ వ్యాధి కారణంగా చనిపోతుంది. తల్లి చనిపోయినప్పుడు పార్థో ఇండియా కి రాలేకపోతాడు.

తల్లి చనిపోయిన బాధను పార్థో మరియు తన అక్క భర్త జీర్ణించుకోలేక పోతారు. 

అరబిందో బయటికి ఎక్కువగా వచ్చే వ్వక్తి ఇంటికే పరిమితమవుతాడు. అక్క దేబ్ జానీ కూడా స్కూల్ మానేసి ఇంట్లోనే ఉండసాగేది.

కొన్ని రోజులకి పార్థో కూడా ఇండియా కి తిరిగి వచ్చేస్తాడు. ఇక మగ్గురు అంత పెద్ద ఇంట్లో ఒకరితో మరొకరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు.

అంతలో పార్థో మరియు దేబ్ జానీ దైవ భక్తిని ఎక్కువగా పెంచుకుంటారు. ఇద్దరు అక్క మరియు తమ్ముడు ఒక రూమ్ కి పరిమితం అవుతారు. ఆ రూమ్ లోనే మెడిటేషన్ చేస్తూ ఉండేవారు. అమెరికా కు చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు Joyce Meyer ను ఫాలో అయ్యే వారు. గురువు చెప్పే స్పీచ్ లను స్పీకర్స్ లో పెట్టి రోజు మొత్తం వినేవారు.

పార్థో కి మరియు తండ్రికి కూడా మంచి సంభందాలు లేవు  తండ్రితో  డైరీల సహాయం తో మాట్లాడేవారు. ఎం కావాలన్నా పేపర్ల పై రాసుకొని చదివేవారు.

అదే సమయంలో పార్థో రెండు పెంపుడు కుక్కలను ఇంటికి తీసుకువస్తాడు. ఆ పెంపుడు కుక్కలు అక్కడే ఇంటి ముందు ఉన్న గార్డెన్ లో తరచూ ఆడుకునేవి. ఈ కుక్కలంటే దేబ్ జానీ కి చాలా ఇష్టం. వాళ్ళ దురదృష్టం ఏమో కానీ కుక్కలు కొన్ని రోజుల తరవాత రెండూ చనిపోతాయి. 

ఈ భాదను భరించలేక కుక్క యొక్క శవాలను పూడ్చిపెట్టకుండా పార్థో  బాల్కనీ లోనే ఉంచుతాడు. 

రెండు మూడు రోజులు గడచిన తరవాత కుళ్ళిన వాసన రావటం తో ఇరుగు పొరుగు వారు ఏంటి ఈ వాసన అని పార్థో తో అడగగా కుక్క చనిపోయింది అని అంటాడు. పూడ్చి పెట్టావయ్యా బాబు భరించరాని వాసనా వస్తుంది అని చెప్పగా ఆ కుక్క శవాలను పూడ్చి పెట్టకుండా తన బెడ్ రూమ్ లో తీసుకెళ్లి పెట్టుకుంటాడు. 

మరోవైపు అరబిందో డే ఇంటికి పరిమితం అవ్వటం తో తన ఫ్రెండ్స్ ఇంటికి కాల్ చేసి అడగటానికి  కాల్ చేసేవారు కానీ కాల్ చేసినప్పుడల్లా పార్థో లిఫ్ట్ చేసి నాన్న లేడు, పడుకున్నారు, బాత్రూం లో ఉన్నారు అని చెప్పి ఫోన్ కట్ చేసేవాడు.

ఈ ఇంటి బయట ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండేవాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ యొక్క పని ఏమిటంటే లోపలి ఎవ్వరు వెళ్లకుండా చూసుకోవటం. అరబిందో డే నడిపే కారు కూడా పార్కింగ్ లోనే నిల్చొని ఉండేది. కొన్ని కొన్ని రోజులకు మెకానిక్ వచ్చి కార్ ను శుభ్రం చేసి ఒకసారి నడిపి మళ్ళీ పార్కింగ్ లో పెట్టి వెళ్లిపోయేవాడు.

ఈ ఫ్యామిలీ ఉండే ఇంట్లోకి బయటి నుంచి రావటానికి అనుమతి ఉండక పోయేది. ఈ ఇంటికి పనిమనిషి కూడా ఉండక పోయేది. 

దగ్గర్లో ఉన్న హోటల్ నుంచి పార్థో ఫుడ్ ని ఆర్డర్ చేసేవాడు, హోటల్ అబ్బాయి ఆ హోటల్ నుంచి ఒక పెద్ద టిఫిన్ లో ఫుడ్ తీసుకొని వచ్చేవాడు. టిఫిన్ సెక్యూరిటీ గార్డ్ పార్థో కి ఇవ్వటం, పార్థో సెక్యూరిటీ గార్డ్ కి డబ్బులు ఇచ్చేవాడు. 

 కొన్ని కొన్ని సార్లు ఆ మరుసటి రోజు టిఫిన్ తిరిగి ఇచ్చినప్పుడు ఫుడ్ అంతా అలానే ఉండేది. ఎవ్వరు దాంట్లో నుంచి ఏమీ తినకపోయేవారు.

పార్థో అమెరికా నుంచి వచ్చినప్పుడు 100 కు పైగా శరీర బరువు ఉండేది కానీ ఇండియా వచ్చిన తరవాత సరిగా ఫుడ్ తినక 65 కేజీల శరీర బరువు అయ్యింది.    

ఇలా సెక్యూరిటీ గార్డ్ ద్వారానే బయటి వారి తో కాంటాక్ట్ చేసేవారు.   

 ఒక సారి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ చాయ్ తాగటానికి వెళ్ళిపోతాడు. అంతలో హోటల్ నుంచి ఫుడ్ ను తీసుకువచ్చిన అతను నేరుగా ఆ ఇంట్లో పైకి ఎక్కి ఫుడ్ ఇవ్వటానికి వెళతాడు.

డోర్ తీసిన పార్థో కి విపరీతమైన కోపం వస్తుంది, అరుస్తూ ఆ అబ్బాయి ని కిందికి పంపిస్తాడు. సెక్యూరిటీ గార్డ్ మీద చాలా అరిచాడు, ఇంకోసారి ఇలా చేస్తే జాబ్ లో నుంచి తీసేస్తా అని అన్నాడు.

ఇరుగు పొరుగు వారు కూడా పార్థో కొంచెం డిఫరెంట్ గా ప్రవర్తించే వాడని, చాలా త్వరగా కోపం వచ్చేదని కూడా చెప్పేవారు. 

రోజులు గడిచాయి తండ్రి ఒక రూమ్ కి పరిమితమైతే పిలల్లకు ఇద్దరు ఒక రూమ్ కి పరిమితం అయ్యారు. పార్థో అక్క క్రమ క్రమంగా దైవ భక్తిని ఎక్కువగా చేయసాగింది. తన ఫ్యామిలీ మంచిగా ఉండాలని ఉపవాసాలు చేయటం మొదలుపెట్టింది.

క్రమ క్రమంగా తక్కువ తినటం చేసేది, ఇంకొన్ని రోజులకు కేవలం నీళ్లు తాగి జీవించేది. చివరికి నీళ్లను కూడా తక్కువగా తాగటం ప్రారంభించింది.

ఇలా ఆహారాన్ని మానుకోవటం వల్ల కొన్ని రోజులకే చాలా వీక్ గా మారిపోయింది. పార్థో కానీ తండ్రి కానీ హాస్పిటల్ కి మాత్రం తీసుకెళ్లలేదు. చివరికి అదే ఇంట్లో ఒక రోజు దేబ్ జానీ చనిపోతుంది.

ముందు రెండు కుక్కల శవాలను పెట్టుకున్న పార్థో ఈ సారి తన అక్క శవాన్ని ఇంట్లోనే ఉంచుకుంటాడు. కూతురు చనిపోయిన విషయం తండ్రికి కూడా తెలియదు. తన రూమ్ యొక్క కిటికీలు మొత్తం మూసేస్తాడు. ఒక్క రంద్రం కనిపించకుండా చిన్న చిన్న బట్టలతో కప్పేస్తాడు.

తన అక్క శవాన్ని పక్కనే పెట్టుకొని పడుకునేవాడు. అక్క చనిపోయిన కొన్ని నెలల తరవాత పార్థో ఇంట్లో ఒక బర్త్ డే పార్టీ జరుగుంతుంది.

ఈ ఫ్యామిలీ కి చాలా సన్నిహితంగా ఉన్న వారే ఆ రోజు వస్తారు. పార్థో వాళ్ళందరిని హాల్ లోనే కూర్చోబెడతాడు, వేరే రూమ్స్ లోకి వెళ్లోద్దని చెబుతాడు. కొంత మంది ఆ ఇంట్లో కి మొదటి సారి వచ్చారు. ఇద్దరు ముగ్గురు దేబ్ జానీ ఎక్కడుంది కనపడటం లేదు అని అడగగా, తండ్రి అరబిందో డే తన కూతురు ఆశ్రమం లో ఉందని చెప్తాడు. పార్థో మాత్రం కోపం తో గెట్ అవుట్ అని చాలా దురుసుగా వాళ్ళందరిని పంపించేస్తాడు. 

కొన్ని సంవత్సరాల తరవాత మేము ఇంటికి వస్తే ఇలా అవమానం జరిగిందని ఆ రోజు వచ్చిన వాళ్ళు అన్నారు.

ఇంకొన్ని రోజులు గడిచిన తరవాత  పార్థో తండ్రి తన ప్రాపర్టీ తన ఇద్దరు సంతానానికి చెందాలని ఒక లాయర్ ను కూడా కలుస్తాడు. అరబిందో కి తెలియని విషయం ఏమిటంటే తన కూతురు ఎప్పుడో చనిపోయిందని.

చనిపోయిన రోజు మాత్రం గుడ్ బాయ్ పార్థో అని రాసి కిరోసిన్ పోసుకొని చనిపోతాడు. చనిపోయే ముందు తన కూతురు ఎప్పుడో చనిపోయిందన్న విషయం గ్రహించి కేవలం గుడ్ బాయ్ పార్థో అని రాసాడని  కొంతమంది నమ్ముతారు.

ప్రస్తుతం, ఇన్ని రోజులు ఎవ్వరు అడుగుపెట్టని ఆ ఇంట్లో మొదటి సారి పోలీసులు ఆ ఇంటిని మొత్తం వెతకటం ప్రారంభిస్తారు. 

బాత్ రూమ్ లో పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టె ఉండటం వల్ల ఆత్మహత్య అని పోలీసులు నిర్దారణకు వస్తారు. అక్కడున్న మిగతా రూమ్ లను చెక్ చేయగా ఒక ఇంట్లో దేబ్ జానీ అస్తి పంజరాలు మరియు రెండు కుక్కల అస్థిపంజరాలు ఒక బెడ్ షీట్ తో కప్పబడి ఉన్నాయి. 

ఆ రూమ్ లో భరించరాని వాసన వస్తుంది. ఇది ఎవరి అస్థిపంజరం అని అడగగా మొదట పార్థో చెప్పడు కానీ తరవాత అది అక్క అస్తి పంజరాలు అని అంటాడు. ఇంతటి దుర్వాసనతో ఎలా ఉంటున్నావు అని అడగగా నాకు అలవాటు అయ్యింది అని అంటాడు.   

అక్కడ అస్తి పంజరం వద్దనే తన అక్క కోసం రోజు ప్లేట్ లో ఫుడ్ పెట్టిన ఆనవాళ్లు కూడా కనిపించాయి.     

ఇదంతా చుసిన పోలీసులు పార్థో ను హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించారు. తాను మానసిక రోగం తో భాదపడుతున్నదని డాక్టర్లు అంటారు. పైగా రోజుల కొద్దీ బ్రష్ కూడా చేయలేదని తెలుస్తుంది. 

ఈ న్యూస్ బయటికి వచ్చాక జనాలు ఆ ఇంటి ముందు నిల్చోని సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభిస్తారు.. అక్కడే ఉన్న చాయ్ కొట్టు అతను రోజుకి కొన్ని కప్పుల చాయ్ అమ్మేవాడు. 

కానీ ఈ ఘటన జరిగిన తరవాత అక్కడ రోజు ఎంతో మంది రావటం తో వందల సంఖ్యలో జనాలు వచ్చి చాయ్ తాగేవారు.    

ఇన్వెస్టిగేషన్ మొత్తం జరిగిన తరవాత తండ్రి కూతుళ్లను పార్థో చంపలేదు, వాళ్ళే చనిపోయారు అని రిపోర్ట్ వస్తుంది.

అస్థిపంజరాలు ఆలా ఎందుకు పెట్టుకున్నావు అని అడగగా నేను దేబ్ జానీ ను చాలా ఎక్కువగా లవ్ చేస్తాను అని తాను నాతో రోజు మాట్లాడుతుందని చెప్పడు. 

తన తండ్రి యొక్క శవాన్ని తీసుకెళ్లామని అడగగా నేను తీసుకోను అని అన్నాడు. ఆశ్చర్య పోయిన పోలీసులు బందువులకు ఫోన్ చేస్తుండగా తన తండ్రి శవాన్ని బంధువులు ముట్టవద్దు అని అంటాడు.

తరవాత నేను బాగానే ఉన్నాను నన్ను వదిలేయమని పార్థో పోలీసులతో అన్నాడు. దాదాపు ఒక సంవత్సరం హాస్పిటల్ లో ఉన్న తరవాత పార్థో ను హాస్పిటల్ నుంచి పంపించేస్తారు. పోలీసులు ఆ ఇంట్లో ఉన్న చాలా డైరీలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. 

 డైరీలలో దేబ్ జానీ కి మరియు పార్థో కు శారీరక సంభందాలు ఉన్నాయని  ఆ సమయంలో కొన్ని పుకార్ల కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి ఎలాంటి ప్రూఫ్ లేదు.

చివరికి పార్థో పోలీసుల అదుపు లో నుంచి బయటికి వచ్చి 3 రోబిన్సన్ స్ట్రీట్ లో ఉన్న ఇంటిని ఇరవై కోట్లకు అమ్మి వేరే ఏరియా లో ఒంటరిగా ఉండటం ప్రారంభించాడు.

న్యూస్ లో తన ఫ్యామిలీ గురించి రావటం, అక్కకు తనకు మధ్య సంభందాలు ఉన్నాయని రావటం బహుశా పార్థోను చాలా భాద కి గురిచేసింది.

దాదాపు ఒక సంవత్సరం గడిచిన తరవాత 2017వ సంవత్సరంలో తరవాత పార్థో బాత్ రూమ్ కి వెళ్లి పెట్రోల్ పోసుకొని తన తండ్రి లాగానే చనిపోయాడు. తన రూమ్ లో ఒక పుస్తకం “యు కెన్, యు విల్ (You can You will) ” అనే నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అన్న పుస్తకం కనిపించింది.

పార్థో బాడీ ను తీసుకెళ్లమని పోలీసులకు బందువులకు చెప్పగా ఎవ్వరు కూడా ముందుకు రారు. చివరికి పోలీసులే పార్థో శవాన్ని పూడుస్తారు.    

చనిపోయే ముందు పార్థో చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కొంతమంది డాక్టర్లు చెప్పటం జరిగింది. ఉన్నత చదువులు చదువుకున్న ఫ్యామిలీ మొత్తం ఇలా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

సో ఇది ఇవాళ్టి స్టోరీ, నెక్స్ట్ స్టోరీ అప్డేట్ కోసం website check చేయండి.             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *