Pakistan cannibalism story

పాకిస్తాన్ కి చెందిన అతి భయంకర నరభక్ష సోదరుల స్టోరీ

2011 వ సంవత్సరంలో సైరా పర్వీన్ అనే కేవలం 24 సంవత్సరాల బాలిక క్యాన్సర్ జబ్బు తో చనిపోతుంది. స్మశాన వాటికలో పూడ్చి పెట్టిన మరుసటి రోజు బంధువులు అక్కడికి ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సమాధి ని తవ్వి మట్టిని ని బయటికి పడేయడాన్ని గమనిస్తారు. ఇంకాస్త గమనించగా ఆ సమాధిలో అసలు శవమే లేదు అన్న సంగతి తెలుసుకొని బంధువులు ఆశ్చర్యానికి గురి అవుతారు.  

ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు అవుతుంది. అదే ప్రదేశంలో ఉండే కొంత మంది సహాయంతో స్మశానానికి ఎవరెవరు వస్తారు మరియు వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు అనే కోణం లో ఇన్వెన్స్టిగేషన్ చేయటం జరుగుతుంది. తరవాత పోలీసులకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇన్వెస్టిగేషన్  చేస్తూ పోలీసులు  మొహమ్మద్ ఆరిఫ్ అలీ మరియు మొహమ్మద్ ఫర్మాన్ అలీ  అనే ఇద్దరు అన్న తమ్ముళ్ల ఇంటికి చేరుకుంటారు.

ఈ అన్న తమ్ముళ్లకు పెళ్లి అయ్యింది కానీ వీరిద్దరి భార్యలు వీరిని వదిలేసారు. వదిలేయడానికి కారణం వీరు తమ భార్యలను కొట్టటం హింసించటం చేసేవారని విచారణలో తెలిసింది.

ఈ ఇద్దరు సోదరులు అమ్మ నాన్నలతో మరియు చెల్లెలి తో కలిసి ఉండేవారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు ఫర్మాన్ అలీ కనిపించటం జరుగుతుంది. ఇంట్లో మొత్తం వెతుకుతారు కానీ అక్కడ ఏమి కనిపించదు. అక్కడే ఇంకొక రూమ్ కి లాక్ చేసి ఉండటాన్ని పోలీసులు గమనిస్తారు. 

ఈ రూమ్ ఎవరిది లాక్ ఎందుకు వేసి ఉంది పోలీసులు ఫర్మాన్ అలీ ను అడగగా, ఈ రూమ్ ఆరిఫ్ అలీ కి చెందినది ప్రస్తుతం తను బయటికి వెళ్ళాడు అని చెప్తాడు. 

ఆ రూన్ యొక్క కీస్ ను ఫర్మాన్ అలీ దగ్గరి నుంచి తీసుకొని లోపలి వెళ్లటం జరుగుతుంది.  ఆ గది లోకి వెళ్లిన తరవాత రూమ్ లో ఒక వైపు పెద్ద గిన్నెలో మాంసం తో చేసిన కూర కనిపిస్తుంది. ఆ గిన్నె పక్కనే ఒక పెద్ద చాకు మరియు ఒక లావు కట్టె, తవ్వటడానికి గడ్డపార ఒక చిన్న కత్తెర కనిపిస్తాయి.

వీటన్నిటి పై కూడా మాంసం ను కోసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. పోలీసు లను అక్కడ ఏం జరిగి ఉందొ అనే విషయం కొంచెం కూడా ఐడియా లేదు. అక్కడున్న ఇన్స్పెక్టర్ ఇంకాస్త దగ్గరగా గమమనించినప్పుడు ఆ రూంలోని చీమలపై పడుతుంది.  

ఈ చీమలు  ఎక్కడినుంచి వస్తున్నాయి అని ఇన్స్పెక్టర్ ఆసక్తి తో చూడగా అక్కడే ఉన్న ఒక మంచం కిందికి వెళ్తున్నాయి.

మంచం కింద ఏముందని చీమలు వెళుతున్నాయి అని మంచాన్ని జరపటం జరుగుతుంది. ఆ మంచం కింద ఒక గోనెసంచి ఉంది. ఆ గోన సంచి లో నుంచి చీమలు వస్తున్నాయి. 

పోలీసులకు అనుమానము వచ్చి గోన సంచిని విప్పగా అందులో సైరా పర్వీన్ యొక్క ముక్కలు ముక్కలుగా చేసిన శవం కనిపించింది. 

అక్కడ పెద్ద గిన్నె లో ఉన్న మాంసం మరెవరిదో కాదు సైరా పర్వీన్ కి చెందినది అని పోలీసులు తెలుసుకున్నప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.

ఆ శవం యొక్క మాంసాన్ని ఆ ఇద్దరు తమ్ముళ్లు వండి తిన్నారు. ఇదే విషయం ఫర్మాన్ అలీ కూడా ఒప్పుకోవటం జరుగుతుంది. వెంటనే పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తారు, బయటికి వెళ్లిన అన్నను కూడా వెతకటం జరుగుతుంది. అన్న దగ్గర్లోనే ఒక ప్రదేశం నుంచి దొరకటం జరుగుతుంది.

ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించగా దాదాపు 100 మంది శవాలను తాము ఇలానే వండుకొని తిన్నాము అని పోలీసులకు స్టేట్ మెంట్ ఇస్తారు. ఇలా తినడానికి కారణం ఏమిటి అని అడగగా మాకు ఒక మంత్రగాడు మనుషుల తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పాడు అందుకే తిన్నాము అని చెప్పాడు.

ఈ ఇద్దరు తమ్ముళ్ళను కోర్ట్ ముందు ప్రవేశ పెట్టగా వీరికి ఏ శిక్ష విదించాలో కోర్ట్ కు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ పీనల్ కోడ్ లో ఇలా చనిపోయిన వ్యక్తుల శవాలను తింటే ఏ శిక్ష విధించాలి అనే చట్టం లేదు.

పాకిస్తాన్  దేశం ఇలాంటి చట్టం అవసరం పడుతుంది అని బహుశా ఊహించలేదు. చేసేది ఏమి లేక ఆ సమయంలో శవం తో దుర్వ్యవహారం చేయడం చట్టం కింద కేవలం 2 సంవత్సరాల జైలు శిక్ష ను విదించటం జరిగింది.

ఈ రెండు సంవత్సరాలు కూడా వీరి మానసిక స్థితిని చెక్ చేయటానికి జైలులో కాకుండా హాస్పిటల్ లో ఉంచారు.  

2011 నుంచి 2013 వరకు శిక్షను పూర్తి చేసి బయటికి వచ్చారు. వీళ్ళు బయటికి వచ్చారనే విషయం తెలుసుకొని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. 

పోలీసులు ఆ ఇద్దరు అన్న తమ్ముళ్లను ఎక్కడైనా ఒక కొత్త చోటుకి వెళ్లి కొత్త పేర్లతో బతకమని సలహా ఇచ్చి పంపిస్తారు. పోలీసుల మాట విని ఇద్దరు అక్కడి నుంచి దూరం వేరే ప్రదేశానికి వెళ్లి జీవించటం మొదలుపెడతారు. 

సరిగ్గా ఒక సంవత్సరం తరవాత ఈ ఇద్దరు అన్న తమ్ముళ్లు ఉంటున్న ఇంటి పక్క వారు ఒక రకమైన దుర్వాసన రావటం గమనిస్తారు. వెంటనే పోలీసులకు ఇన్ఫోర్మ్ చేయగా పోలీసులు ఆ ఇంటి లోపలి వెళ్లి చూడగా మొదటి రూమ్ లో ఏమి దొరకదు కానీ రెండవ రూమ్ లాక్ చేసి ఉంది. 

ఇద్దరి తమ్ముళ్లల్లో ఒకరు అక్కడ ఉంటాడు. అతని దగ్గరి నుంచి కీస్ తీసుకొని రూమ్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది. 

ఆ పిల్లవాడి తల గురించి విచారించగా దగ్గరి లోనే ఒక కాలనీ లో ఈ పిల్లాడిని పూడ్చి పెట్టారు. విషయం తెలుసున్న అన్న తమ్ములు ఇంటికి తీసుకొచ్చి వండుకొని తిన్నారు.    

వీరి గురించి పాకిస్తాన్ పోలీసులకు ముందే తెలుసు కాబట్టి రెండవ వ్యక్తిని కూడా వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తారు. జైలు నుంచి వచ్చిన తరవాత కూడా వీరిద్దరు శవాలను తినటం మాత్రం మారలేదు. 

దాదాపు ఈ ఇద్దరు తమ జీవిత కాలంలో 150 శవాలను వండుకొని తిన్నారు. ఇంతమంది శవాలను తీసినప్పుడు ఎవరికీ డౌట్ రాలేదా అని మీకు సందేహం రావచ్చు. ఈ ఇద్దరు వేరు వేరు స్మశానాలలో నుంచి శవాలను తీసుకొనే వారు పైగా స్మశానాలలో పెద్దగా ఎవ్వరు ఉండరు. 

మొదటి సారి శవాన్ని తీసుకుని సరిగా పూడ్చలేదు అనే విషయాన్నీ గ్రహించి  శిక్ష పూర్తి చేసి బయటికి వచ్చిన తరవాత రెండవ సారి శవాన్ని తీసిన తరవాత జాగ్రత్తగా పూడ్చి పెట్టేవారు.     

ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ ముందు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సారి వీరి పై కఠిన శిక్ష విధించాలని ఆంటీ టెర్రరిజం చట్టం కింద 12 సంవత్సరాల శిక్ష ను విధించారు.   

2026 వ సంవత్సరంలో వీరి శిక్ష పూర్తి అవుతుంది. పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఈ ఇద్దరు కనిపిస్తే చంపేస్తాం అన్నంత కోపం లో ఉన్నారు. 

సో ఇది ఇవాళ్టి క్రైమ్ స్టోరీ,ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి.        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *