Operation diamond story

ఒక్క ఫైటర్ ప్లేన్ కోసం రెండు సార్లు ఫెయిల్ అయిన ఇజ్రాయెల్ మోసాద్ గూఢచార సంస్థ ఆపరేషన్ డైమండ్ స్టోరీ – Operation diamond story

హలో ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టొరీ తో మీ ముందుకు వచ్చాను.

ఇజ్రాయెల్ దేశం యొక్క గూఢచార సంస్థ ఐన మోసాద్ చేసిన ఆపరేషన్స్ చాలా వరకు విజయవంతం అయ్యాయి. తమ దేశ ప్రజలకోసం మరియు తమ దేశ రక్షణ కోసం ఎలాంటి ఆపరేషనే అయినా సరే చేయడానికి వెనకాడరు. 

తమ దేశ రక్షణ కోసం మరియు రాబోయే కాలంలో అరబ్బు దేశాలతో జరిగే యుద్ధాలలో తమదే పై చెయ్యి ఉండాలనే ఉద్దేశం తో ఆపరేషన్ డైమాండ్ ను చేయటం జరిగింది.

1952 నుంచి 1963 సంవత్సరంలో ఇస్సేర్ హరేల్( Isser Harel) ఇజ్రాయెలీ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ కు మరియు మోసాద్ కు డైరెక్టర్ గా ఉన్నారు.

1963 సంవత్సరంలో తన పదవి నుంచి రిటైర్ అయ్యిన తరవాత మేయర్ అమిత్ (Meir Amit) అనే కొత్త డైరెక్టర్ నియమించబడ్డాడు.

డైరెక్టర్ అయ్యిన తరవాత మేయర్ అమిత్ ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ అధికారులను కలిసి మోసాద్ ద్వారా తమకు ఎం సహాయం కావాలి అని అడిగాడు.

ఆ సమయంలో ఉన్న ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ జనరల్ తమకు రష్యా తయారు చేసిన MIG- 21 కావాలని చెప్పాడు.

మిగ్ -21  ను ఎందుకు అడిగాడో తెలుసుకోవటానికి, కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే రష్యా 1961 వ సంవత్సరంలో మిగ్-21 అనే యుద్ధవిమానాన్ని లేటెస్ట్ టెక్నాలజీ తో తయారుచేసారు.

ఈ యుద్ధ విమానాన్ని అమ్మటానికి రష్యా కొన్ని షరతులు పెట్టింది. అమెరికా మిత్ర దేశాలకు ఈ యుద్ధ విమానాన్ని అమ్మవద్దని కేవలం రష్యా యొక్క మిత్ర దేశాలకు మాత్రమే అమ్మాలని నిర్ణయించింది.

ఈ మిత్ర దేశాలలో సిరియా , ఈజిప్ట్,  ఇరాక్ కూడా ఉన్నాయి. ఈ యుద్ధ విమానాన్ని ఎట్టి పరిస్తుతులలో అమెరికా లేదా అమెరికా మిత్ర దేశాలకు ఇవ్వొద్దు అని చెప్పింది. ఇదే కాకుండా ఈ ప్లేన్ లో ఉన్న టెక్నాలజీ ను కూడా గోప్యంగా ఉంచాలని చెప్పింది.

ఈ యుద్ధ విమానాలను నడపటానికి కూడా ఆ దేశానికి చెందిన నమ్మకస్తులే నడపాలి అని నియమాలు పెట్టింది. ఈ విమానం లో అవసరానికి మించి ఎక్కువగా ఇంధనం కూడా నింపవద్దు అని కూడా నియమాలు పెట్టింది.

ఇదంతా గమనిస్తున్న ఇజ్రాయెల్ తమ దేశానికి దీని వల్ల చాలా ముప్పు ఉందని గ్రహించారు ఎందుకంటే ఇజ్రాయెల్ కి మరియు అరబ్బు దేశాలకు తరచు ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.

ఇలాంటి సమయంలో వారి వద్ద ఒక అత్యంత ఆధునిక మైన యుద్ధ విమానం ఉండటం చాలా ప్రమాదం. ఆ విమానాన్ని ఎలాగైనా తాము దక్కించుకోవాలి అని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మోసాద్ డైరెక్టర్ తో కోరారు.

ఆ విమానం తమ దేశానికి ఎంత అవసరమో గ్రహించిన మోసాద్ డైరెక్టర్ ఆపరేషన్ డైమండ్ ను ప్రారంభించారు. ఈ మిషన్ ప్రకారం అరబ్బు దేశాలలోMIG -21 ను నడుపుతున్న ఒక పైలట్ ను డబ్బు తో కొనుక్కొని ఆ విమానాన్ని ఆ దేశం నుంచి దొంగిలించి ఇజ్రాయెల్ కి తీసుకురావాలి. 

ఇంతకు ముందు ఉన్న మోసాద్ డైరెక్టర్ రెండు సార్లు ప్రయత్నం చేసాడు కానీ రెండు సార్లు కూడా మిషన్ ఫెయిల్ అయ్యింది.

1960 సంవత్సరంలో ఈ ప్లాన్ ను అమలు పరచడానికి మొట్ట మొదటి సారి జీన్ థామస్ అనే మోసాద్ ఏజెంట్ ఈజిప్ట్ కు చెందిన ఒక పైలట్ తో స్నేహం చేస్తాడు.  ఈ పైలట్ MIG -21 యుద్ధ విమానాన్ని నడిపేవాడు. 

ఆ పైలట్ తనకు దగ్గరయ్యాడని విషయం గ్రహించి తన ప్లాన్ గురించి చెప్తాడు. నువ్వు మిగ్-21 విమానాన్ని ఈజిప్ట్ నుంచి దొంగిలించి ఇజ్రాయెల్ కి చేరవేస్తే 1 మిలియన్ US dollars  ఇస్తామని చెప్పాడు. ఈ విషయం విన్న పైలట్ నేరుగా తన అధికారులకు ఈ విషయం చెప్పటం తో జీన్ థామస్ మరియు తన తో పాటు ఉన్న అందరిని అరెస్ట్ చేయటం జరుగుతుంది.

రెండు సంవత్సరాల తరవాత తమ దేశంలో ఉండి గూడాచారిగా పనిచేసినందుకు జీన్ థామస్ తో పాటు మరో ఇద్దరినీ ఉరి తీయటం జరుగుతుంది. మిగతా వారికి జీవిత ఖైదు ను విధించటం జరుగుతుంది.

మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యిన తరవాత రెండవ సారి ఇరాక్ కు చెందిన పైలట్ లను డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఆఖరి సమయంలో తాము ఈ  పనిని చేయలేము ఇది చాలా డేంజర్ అని చెప్పి చేతులెత్తేస్తారు. 

ఇలా రెండు సార్లు ప్లాన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి మూడోసారి ప్లాన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలని కొత్త డైరెక్టర్ అనుకుంటాడు.

అదే సమయంలో ఇరాక్ లో ఉంటున్న జోసెఫ్ అనే వ్యక్తి మోసాద్ కి మెసేజ్ చేసి తాను ఇజ్రాయెల్ కి మిగ్-21 ను దక్కించుకోవటం లో సహాయం చేస్తానని చెప్పాడు.

జోసెఫ్ ఇరాక్ లో పుట్టిన ఒక jew, 10 సంవత్సరాలున్న వయసు నుంచి ఒక క్రిస్టియన్ కుటుంబం ఇతనిని దత్తత తీసుకుంది. ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ ఆ ఫ్యామిలీ కి చాలా దగ్గరయ్యాడు.

 యుద్ధ పరిణామాల వల్ల 1950 తర్వాత ఇరాక్ లో ఉంటున్న jews అందరు ఇజ్రాయెల్ కి వలస పోగా కొంత మంది మాత్రం ఇరాక్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లలో జోసెఫ్ కూడా ఒకడు.  

60 సంవత్సరాల  వయసులో తాను ఉంటున్న క్రిస్టియన్ ఫ్యామిలీ లోని ఒక సభ్యుడి తో గొడవ అయ్యిన తరవాత  బాధపడి తాను  ఇన్నిరోజులు దూరం పెట్టిన మతం జుడాయిజం గురించి నేర్చుకోసాడు.

తన దేశం కోసం ఏదైనా చేయాలనే తపన వల్ల మోసాద్ కు చెందిన గూఢచారులను కలిసాడు. తనను ఇన్ని రోజులు దత్తత తీసుకున్న క్రిస్టియన్ ఫ్యామిలీ లో ఇరాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక పైలట్ Munir Redfa ఉన్నాడని, ఆ పైలట్ ఇరాక్ ప్రభుత్వ వ్యవహారం తో సంతృప్తి గా లేడని చెప్పటం జరిగింది.

ఈ ఫ్యామిలీ క్రైస్తవ మతానికి చెందింది కాబట్టి ఆక్కడి ప్రభుత్వం వీరితో మరోలా వ్యవహరించేది.  ఇదే కాకుండా ఇరాక్ ప్రభుత్వం Munir Redfa ను ఇరాక్ లో ఉండే కుర్దుల పైన కూడా బాంబుల వర్షం కురిపించడానికి కూడా పంపేవారు.

నిస్సహాయులైన కుర్దు సముదాయాన్ని చంపటం ఇష్టం లేక ఒకసారి జోసెఫ్ తో ఈ దేశాన్ని విడిచి పోవాలని కూడా చెప్పాడు.      

ఇదంతా చుసిన జోసెఫ్ Munir Redfa ఇజ్రాయెల్ చేయబోతున్న ఆపరేషన్ డైమండ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనుకోని మోసాద్ ని ఆశ్రయించాడు.

ఆ తరవాత ఒక మోసాద్ ఏజెంట్ గా ఉన్న ఒక అమ్మాయి ని redfa తో సన్నిహితంగా ఉండటానికి పంపిస్తారు. ఆ అమ్మాయి తో సన్నిహితంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పలు టూరిస్ట్ places కి వెళ్లి ఎంజాయ్ చేసేవారు.

అదే సమయంలో తాను ఇరాక్ ఎయిర్ ఫోర్స్ లో పడుతున్న బాధలను కూడా చెప్పేవాడు. తనను కావాలనే తన స్వస్థలం అయిన బాగ్దాద్ నుంచి దూరంగా ఉంచారని, తాను క్రైస్తవ మతస్తుడు కావటం తో విమానంలో ఎక్కువ ఇంధనం కూడా వేసేవారు కాదని తరచూ చెప్పేవాడు.

Munir Redfa ఈ ప్లాన్ కి సరిపోతాడు అని అనిపించినా మోసాద్ ఛాన్స్ తీసుకోవాలి అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మోసాద్ ఏజెంట్ ఉరి తీయబడ్డాడు. అందుకే కన్ఫర్మ్ గా తన గురించి పూర్తిగా తెలుసుకున్న తరవాతే ప్లాన్ చెప్పాలని మోసాద్ నిర్ణయించుకుంది.

ఎప్పటిలాగే మునీర్ redfa మరియు ఆ అమ్మాయి హాలిడే ట్రిప్ కి బయలుదేరారు. ఆ ట్రిప్ నుంచి redfa ను ఇజ్రాయెల్ కి తీసుకెళ్లి అక్కడ తమ ప్లాన్ గురించి మొత్తం చెప్పటం జరిగింది.

ఇజ్రాయెల్ ఆఫర్ విన్న తరవాత ఇన్ని రోజులు తన వెంట ఉన్న అమ్మాయి ఒక ఏజెంట్ అని తన పై ఆమెకి ఎలాంటి ఇంటరెస్ట్ లేదనే విషయం కూడా మునీర్ redfa త్వరగానే గ్రహించాడు.

పదే పదే అలోచించి ఇజ్రాయెల్ చేస్తున్న మిషన్ కి ఒప్పుకున్నాడు. కానీ కొన్ని షరతులు పెట్టాడు, తనకు డబ్బుతో పాటు తన ఫ్యామిలీ మరియు తన ఇతర బంధువులను కూడా ఇజ్రాయెల్ కి తరలించి అక్కడి సిటిజెన్ షిప్ ఇవ్వాలని కోరాడు.

ఈ మిషన్ గురించి మంచిగా ఆలోచించమని ఒక్కసారి అవును అని చెప్పిన తరవాత వెనుదిరిగే అవకాశం లేదని, ఈ మిషన్ ఫెయిల్ అయితే తన ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని చెప్పగా నేను ప్లేన్ ను తీసుకువస్తాని అని మునీర్ redfa అంటాడు.  

ఫ్యామిలీ వరకు ఐతే ఒకే కానీ ఇతర బంధువులను కూడా తీసుకురావటం కష్టం అని తెలుసుకొన్నారు. ఎందుకంటే మిగ్-21  ను నడిపే pilot ఫ్యామిలీ ఒక్కసారిగా మాయమైతే ఇరాక్ గూఢచారులకు ఈజీ గా తెలిసిపోతుందని మోసాద్ పతకం ప్రకారం వారిని బయటికి తీసుకరావాలని అనుకున్నారు.

మునీర్ రెడీఫా యొక్క తల్లి తండ్రులను మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో దేశం దాటించారు. భార్య పిల్లలను హాలిడే ట్రిప్ పేరుతో దేశం దాటించారు. మునీర్ redfa యొక్క బంధువులు ఇంకా బాగ్దాద్ లోనే ఉన్నారు. వీరిని తరవాత తీసుకరావాలని ప్లాన్ చేసారు.

మరోవైపు మునీర్ redfa తో ప్లాన్ మొత్తం వివరించారు. ట్రైనింగ్ లో భాగంగా మునీర్ ప్లేన్ ను తరచూ నడిపేవాడు, అలా ట్రైనింగ్ కోసం ప్లేన్ ను నడుపుతున్నప్పుడు ప్లేన్ ను తీసుకొని నేరుగా ఇజ్రాయెల్ కి తీసుకోరేవాలన్నదే ప్లాన్.

ఈ ప్లాన్ గురించి వివరిస్తున్నప్పుడు మోసాద్ మునీర్ తో పాటు పనిచేసే వారి పేర్లు చెప్పటం, వారి రోజు షెడ్యూల్ మరియు  ఎయిర్ బేస్ యొక్క మ్యాప్ మొత్తం తెలిసి ఉండటం మునీర్ కు  ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్లాన్ అంత బాగానే ఉంది కానీ ఈ విమానం బేస్ నుంచి ఇజ్రాయెల్ దూరం 900 కిలోమీటర్లు, ఇంతకు ముందు నేను చెప్పినట్లు మునీర్ కు రష్యా యొక్క ఆదేశాల మేరకు కేవలం సరిపడ ఇంధనం మాత్రమే ఇచ్చేవారు.   

ఇరాక్ ఎయిర్ బేస్ లో ఇంధనం నింపే వాళ్ళకి రష్యా ఆదేశాలు మనమెందుకు పాటించాలి అని కూడా అనిపించేది. ఇదే విషయాన్నీ అదనుగా తీసుకొని ప్లేన్ ను చోరీ చేయాలని మునీర్ redfa నిర్ణయించుకున్నాడు.

1966 ఆగష్టు 16 వ తారీకు రోజున ఈ మిషన్ చేయాలని నిర్ణయించుకున్నారు.  రోజు మాదిరిగానే తనతో పనిచేసే వాళ్లతో మాట్లాడాడు కానీ వాళ్లకు తెలియంది ఏమిటంటే ఇక మునీర్ ఎప్పటికి ఇరాక్ రాడు.

ప్లేన్ ను నడిపే ముందు ఇంధనం నింపడానికి వెళ్ళాడు. అక్కడ ఇంధనం నింపే వారు ఆ రోజుకి సరిపడ ఇంధనం వేయగా మొత్తం ఫుల్ గా నింపాలని redfa కోరుతాడు. పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఎక్కువ నింపలేము అని అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఆ రష్యా ఆర్డర్స్ ఫాలో అవ్వండి కానీ నేను చెప్పే ఆర్డర్స్ ఫాలో అవ్వద్దు అని హేళన చేసి redfa మాట్లాడగా రష్యా ఆదేశాలు తాము ఎందుకు వినాలి అని మొత్తం ట్యాంక్ ను నింపారు.

విమానం గాలిలోకి ఎగిరింది, ఇరాక్ ప్రభుత్వం ఇచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ లో వెళ్ళటం గమనించి ఇరాక్ ఎయిర్ బేస్ నుంచి redfa ను తాను వేరే దారిలో వెళుతున్నాడని రేడియో ద్వారా చెబుతారు. తాను ఏమి మాట్లాడకుండా అలాగే విమానాన్ని నడుపుతూ ఉంటాడు. ఎయిర్ బేస్ నుంచి ఈ సారి హెచ్చరికలు వస్తాయి. విమానాన్ని తిరిగి తీసుకురాకపోతే పేల్చేస్తామని హెచ్చరిస్తారు. 

వెంటనే రేడియో ఆఫ్ చేసి మునీర్ redfa విమానాన్ని నడుపుతూ ఉంటాడు.  అప్పటికే redfa యుద్ధ విమానం ఇరాక్ నుంచి జోర్డాన్ కి చేరుకుంటుంది.                              

జోర్డాన్ రాడార్ లో మిగ్-21 డిటెక్ట్ అవ్వటం వల్ల అక్కడి ATC ప్లేన్ గురించి విచారించటం మొదలుపెట్టారు. అదే సమయంలో మరోవైపు ఇజ్రాయెల్ సిరియా యొక్క ATC ను హ్యాక్ చేసి ఈ ప్లేన్ సిరియా కు చెందింది ట్రైనింగ్ కోసం మాత్రమే అక్కడికి వచ్చిందని చెప్పగా జోర్డాన్ నుంచి ఆ ప్లేన్ ఇజ్రాయెల్ వైపు కి వెళ్ళసాగింది. 

అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి రెండు ఫైటర్ విమానాలు మిగ్ – 21 తో పాటు చేరి సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా సహాయం చేసాయి. 

అక్కడికి మిగ్- 21 చేరుకున్న వెంటనే ఇరాక్ లోని ఇతర బంధువులను పిక్నిక్ పేరుతో ట్రక్ లో ఎక్కించుకొని కుర్దు ల సహాయం తో ఇరాక్ నుంచి బయటపడి  ఇరాన్ చేరారు. ఇరాన్ నుంచి హెలికాప్టర్ ద్వారా వారిని ఇజ్రాయెల్ కి చేరవేయటం జరిగింది. 

ఇజ్రాయెల్ లో ఉన్న పైలట్ ఆ విమానం గురించి మొత్తం తెలుసుకొని కేవలం ఒక గంట వ్యవధి లోనే దానిని ఎలా నడపాలో నేర్చుకున్నాడు. 

ఆ మరుసటి రోజు న్యూస్ పేపర్ లో ఈ వార్త రావటం తో  ప్రపంచానికి ఈ విషయం తెలిసిపోయింది. ఇరాక్ మరియు రష్యా పరువు పోయినట్లు అయ్యింది.

1967 లో సిరియా తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్  మిగ్ -21 సిరియా కు చెందిన 6 మిగ్-21 లను ద్వంసం చేసింది.

మున్నార్ redfa తన ఫ్యామిలీ తో ఇజ్రాయెల్ లో స్థిరపడ్డాడు, ఇజ్రాయెల్ ప్రభుత్వం డబ్బుతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చింది.

ఈ మిషన్ మొత్తానికి కారణమైన జోసెఫ్ తనకు దత్తత తీసుకున్న ఫామిలీ కి మరియు తాను ప్రేమించే ఇజ్రాయెల్ దేశానికి సహాయపడ్డాడు.  

ఈ మిషన్ ను చేసింది ఇజ్రాయెల్ అని తెలిసాక రష్యా తమ ప్లేన్ ను తిరిగి ఇవ్వాలని ఆదేశించగా ముందు నుంచే అడుగుతున్నా అమెరికా దేశానికి మిగ్ -21 ను ఇజ్రాయెల్ దేశం ఇచ్చేసింది. 

ఇప్పుడు మా దగ్గర విమానం లేదు అమెరికా వద్ద ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యా తో అంది.

ప్రస్తుతం ఈ ప్లేన్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం లో ఉంది దీని పేరును మార్చి 007 గా పెట్టడం జరిగింది.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *