Nithari killer surendar koli story

నిఠారి చిన్న పిల్లల నరభక్షకుడి సీరియల్ మర్డర్స్ స్టోరీ – Nithari serial killer story

హాయ్ ఫ్రెండ్స్, క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే కథ ఒక నరభక్షకుడిది. 

ఇంతకు ముందు నేను పాకిస్తాన్ కి చెందిన ఇద్దరు సోదరులు స్మశానం లోని శవాలను ఎలా తిన్నారో స్టోరీ చెప్పాను. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఇండియా కి చెందిన సురేంద్ర కోహ్లీ అనే నరభక్షకుడిది. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో సెక్టర్ 31 నోయిడా లోని నిఠారి గ్రామంలో బిజినెస్ మాన్ అయిన మోనీందర్ సింగ్ పండేర్ ఫార్మ్ హౌస్ D5 ఉంది.  

ఈ ఫార్మ్ హౌస్ లో మొదట మొనిందర్ సింగ్ తన ఫ్యామిలీ తో ఉండేవాడు కానీ తరవాత ఫ్యామిలీ పంజాబ్ వెళ్లిపోయిన తరవాత తన ఒక స్నేహితుడి వద్ద పనిచేస్తున్న సురేందర్ కోహ్లీ ను తన ఫార్మ్ హౌస్ లో caretaker గా ఉద్యోగం లో ఉంచుకున్నాడు. మొనిందర్ సింగ్ కేవలం 15 రోజులకు లేదా నెలకు ఒకసారి వచ్చి అక్కడ ఉండేవాడు.

వచ్చిన ప్రతి సారి దళారుల ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకొని రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసేవాడు.       

2005వ సంవత్సరం నుంచి D5 ఇంటికి సమీపంలో ఉంటున్న పిల్లలు మిస్ అవ్వటం మొదలైంది. ఈ ఇంటి సమీపంలో ఎక్కువగా కూలి పనులు చేసుకొని బతికేవారు. 

పిల్లలు మిస్ అయిన పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయటం జరుగుతుంది. పోలీసులు పెద్దగా ఆసక్తి చూపించరు ఎందుకంటే ఇలాంటి కేసులలో పిల్లలు అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావటం జరుగుతుంది. పిల్లలు తిరిగి వచ్చాక కూడా పేరెంట్స్ కంప్లైంట్ వెనక్కి తీసుకోక పోవటం వల్ల మిస్సింగ్ కేసెస్ ఫైల్స్ పెరుగుతూ పోతాయి.

కంప్లైంట్ ఇచ్చిన వారు కూలీలు అవ్వటం వల్ల పోలీసులు FIR రిజిస్టర్ చేయలేదనే వాదనలు కూడా వచ్చాయి. పిల్లలు మాత్రం మిస్ అవ్వటం మాత్రం ఆగలేదు.

2006వ సంవత్సరం మే 7వ తేదీ ఇదే D5 ఇంటి సమీపంలో పాయల్ అనే అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్లలో పాయల్ వయసులో పెద్ద అమ్మాయి కావటం తో తండ్రి నంద లాల్ కూతురుని వెతకటం ప్రారంభిస్తాడు. అదే సమయంలో D5 ఏరియా లో ముందు నుంచి చిన్న పిల్లలు మిస్ అవుతున్నారనే విషయం కూడా నంద లాల్ కు తెలుస్తుంది. 

తన కూతురు ఆపదలో ఉన్న విషయం గ్రహించి ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అడగటం ప్రారంభిస్తాడు. ఇలా వెతుకుతున్నప్పుడు మే 7వ తేదిన రోజు పాయల్ రిక్షాలో ప్రయాణం చేసిందన్న విషయం తెలుస్తుంది.

నందలాల్ రిక్షా నడిపే వాళ్ళని తన కూతురు గురించి అడిగినప్పుడు ఒక రిక్షా నడిపేవాడు గుర్తు పట్టి “నా రిక్షాలోనే పాయల్ ఎక్కింది నేను పాయల్ ని D5 ఫార్మ్ హౌస్ వద్ద దింపాను. రిక్షా డబ్బులు లోపలినుంచి తీసుకువస్తానని చెప్పి ఎంతకూ బయటికి రాకపోతే నేనే లోపలి వెళ్లి అడగగా ఆ ఇంట్లో నుంచి సురేంద్ర కోహ్లీ బయటికి వచ్చి పాయల్ ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు ” అని రిక్షా నడిపేవాడు నంద లాల్ తో అన్నాడు.      

పాయల్ యొక్క తండ్రి నందలాల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటానికి కూడా  వెళ్ళటం జరుగుతుంది కానీ ఈ సారి కూడా పోలీసులు FIR రెజిస్టర్ చేసుకోరు.

మిగతా తల్లీ తండ్రులలా నందలాల్ ఊరికే ఉండకుండా ఒక లాయర్ సహాయం తో కోర్ట్ ను ఆశ్రయిస్తాడు. కోర్ట్ లో నా కూతురు తప్పి పోయింది పోలీసులు FIR నమోదు చేయటం లేదు అని, D5 ఇంట్లో ఉండే వాళ్ళ పై అనుమానం ఉందని చెప్పగా, వెంటనే FIR రెజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని కోర్ట్ ఆర్డర్ చేస్తుంది.

ఈ ఫార్మ్ హౌస్ యజమాని మొనిందర్ సింగ్ డబ్బున్న వాడు అవ్వటం వల్ల పోలీసులకు లంచం ఇచ్చి FIR ను రద్దు చేసేలా కూడా ప్రయత్నించాడు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ను చాలా స్లో గా చేసేవారు.   

మొనిందర్ సింగ్ తన ఇంటిపై చేసిన FIR ను రద్దు చేయించటానికి ఉన్నత న్యాయస్థానంను కూడా ఆశ్రయించటం జరుగుతుంది కానీ కోర్ట్ మాత్రం FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని ఆర్డర్స్ ఇస్తుంది.

చేసేదేమీలేక పోలీసులు ఫార్మాలిటీ కోసం మొనిందర్ సింగ్ యొక్క ఫార్మ్ హౌస్ కి వెళతారు. అక్కడ మొత్తం ఇంటిని సెర్చ్ చేస్తారు. చివరికి ఆ ఇంట్లో ఏమి దొరకదు. అదే సమయంలో అక్కడ జనం కూడా గుమి కూడటం మొదలుపెట్టారు. ఎందుకంటే మిస్ అయిన దాదాపు అందరు పిల్లలు D5 సమీపంలోనే ఆఖరి సారి చూసినట్లు కొంత మంది చెప్పటం జరిగింది. 

పోలీసులే కాకుండా అక్కడ గుమికూడిన జనం అక్కడ ఇక్కడ చూస్తుండగా ఆ ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక పెద్ద నాళ పై పడుతుంది. అందులో చాలా పాలిథిన్ కవర్లు పడి ఉన్నాయి.

ఈ విషయం పోలీసులకు చెప్పగా ఒక్క పాలిథిన్ కవర్ ను బయటికి చెక్ చేయగా అందులో నుంచి ఒక్క చిన్న పిల్లాడి యొక్క కాలి భాగం కనిపించింది. ఇది చుసిన కానిస్టేబుల్ వెంటనే తన తన పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.  

వెంటనే అక్కడున్న అన్ని కవర్లను తీసి చూడటం జరుగుతుంది. అన్ని కవర్లలో చిన్న పిల్లల వేరు వేరు శరీర భాగాలు ఉన్నాయి.

ఈ శరీర భాగాలలో తల కింది భాగం మరియు నడుము పై భాగం తప్ప మిగతా శరీర భగాలు కవర్లలో దొరుకున్నాయి. అన్ని కవర్లను చెక్ చేయగా 17 మంది శరీర భగాలు ఉన్నట్టుగా గుర్తించటం జరిగింది. 

ఫార్మ్ హౌస్ యజమాని మొనిందర్ సింగ్ మరియు సురేందర్ కోహ్లీ ను అరెస్ట్ చేయటం జరుగుతుంది. మీడియా మరియు అక్కడున్న జనాలు ఇది అవయవాల తస్కరి ముఠా చేసిందని పుకార్లు వచ్చాయి కానీ అదంతా ఫేక్ అని తరవాత తెలిసింది.

ఈ విషయం మీడియా లో రావటం వల్ల అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయిపొయింది. స్వయంగా ముఖ్య మంత్రి కూడా అక్కడి  జరిగిన విషయాన్ని కనుక్కోవటం జరిగింది. 

ఆ టైం లో సరిగా డ్యూటీ చేయని పోలీసు ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేయటం జరిగింది. మరోవైపు మోనీందర్ సింగ్ మరియు సురేందర్ కోహ్లీ ను విచారించటం మొదలుపెడతారు. 

ఆ ఇంటి యజమాని అయిన మోనీందర్ సింగ్ పోలీసులకు తన వంతు నిజాలన్నీ చెప్పాడు. తాను కేవలం ఇక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడని ఈ ముర్డర్లతో ఎలాంటి సంభందం లేదని చెప్పటం జరుగుతుంది.

పోలీసులకు కూడా మోనీందర్ సింగ్ హత్యలు చేసాడన్న దానికి ప్రూఫ్స్ లేనందుకు సురేందర్ కోహ్లీ ను అడగటం ప్రారంభిస్తారు.

రెండు మూడు రోజులు పోలీసులు తమదైన శైలిలో విచారించిన తరవాత సురేందర్ కోహ్లీ హత్యల వెనక కారణం చెప్పటం మొదలుపెడతాడు.

సురేందర్ కోహ్లీ ఉత్తరాఖండ్ కి చెందిన వాడు, పెళ్లి అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వంట బాగా చేస్తాడు అని మోనీందర్ సింగ్ దగ్గర పనిలో చేరిన తరవాత అక్కడికి అమ్మాయిలు రావటం రెండు మూడు రోజులు గడపటం సురేందర్ కోహ్లీ గమనించేవాడు. 

మొనీందర్ సింగ్ అమ్మాయిలతో రూమ్ లో ఉన్నప్పుడు సురేందర్ కోహ్లీ చాటుగా చూసేవాడు. ఇదంత చుసిన తరవాత తానూ కూడా మొనీందర్ సింగ్ పండేర్ లా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కొంత మంది కాల్ గర్ల్స్ తో కలవటం కూడా జరుగుతుంది, ఆ సమయంలో కాల్ గర్ల్స్ సురేందర్ కోహ్లీ తో నువ్వు సెక్స్ చేయలేవు అని హేళన చేసేవారు.

ఈ విషయం విన్న సురేందర్ కోహ్లీ మనసులో తాను నపుంసకుడు అయ్యాడనే భయం వెంటాడ సాగింది. ఒకరోజు ఫార్మ్ హౌస్ యజమాని అమ్మాయి తో రాత్రి గడిపిన తరవాత ఒక అర్జెంటు పని మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ  ఆ అమ్మాయిని ఉదయం ఆటో లో ఎక్కించి పంపించమని చెప్పి వెళ్ళిపోతాడు.

ఉదయం ఆ అమ్మాయి వద్దకు వెళ్లి నేను కూడా డబ్బులు ఇస్తాను నాతో కూడా సమయం గడుపు అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి సురేందర్ కోహ్లీ ను హేళన చేయగా కోపం లో ఆ అమ్మాయి ను చంపేస్తాడు. 

చంపేసిన తరవాత ఆ అమ్మాయితో బలాత్కారానికి కూడా పాల్పడుతాడు. తరవాత ఆ బాడీ ను మూడు ముక్కలుగా చేస్తాడు. తల ఒక ముక్కగా కాళ్ళను రెండవ ముక్కగా మరియు పొట్ట భాగాన్ని మూడవ ముక్కగా చేసాడు.

ఇలా చేసిన ముక్కలలో నుంచి కొంత భాగాన్ని కుక్కర్ లో వండుకొని తిన్నాడు. ఈ మాట విన్న అక్కడి పోలీసు ఆఫీసర్లలో ఇద్దరు బయటికి వెళ్లి వామిటింగ్ చేసుకున్నారు. 

తాము విచారిస్తున్న సురేంద్ర కోహ్లీ ఎంత పెద్ద నర భక్షకుడో తెలుసుకున్నాక పోలీసులు మరింత జాగ్రత్తగా విచారించటం మొదలుపెట్టారు.

ఆ అమ్మాయి ని చంపి, తిన్న తరవాత శరీర భాగాలను కవర్లో కట్టి ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక పెద్ద నాలాలో పడేసాడు.మొదట భయం అనిపించినా ఆ అమ్మాయి కోసం ఎవ్వరు వెతుక్కుంటూ రాకపోవటం మరియు తన యజమాని యొక్క పరిచయం పోలీసు వాళ్లతో ఉండటం వల్ల పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

ఫలితంగా సురేందర్ కోహ్లీ కి ఇంకాస్త ధైర్యం వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తరవాత D5 బయట ఆడుతున్న ఒక అమ్మాయిని చాక్లెట్స్ ఇస్తానని చెప్పి లోపలికి తీసుకుకెళ్లి గొంతు నులిమి చంపేసాడు ఆ తరవాత ఆ డెడ్ బాడీ తో  తన కోరిక ను పూర్తి చేసుకొని ఆ చిన్న పాప బాడీ ని మూడు ముక్కలుగా చేసేవాడు.

ఈ ముక్కలలో నుంచి చెస్ట్ మరియు చేతుల యొక్క మాంసాన్ని వండుకొని తినేవాడు. మిగిలిన భాగాలను చిన్న చిన్న కవర్లలో కట్టి ఇంటి వెనక భాగంలో ఉన్న నాలా లో పడేసేవాడు.  

ఇలాగే కొన్ని కొన్ని రోజులకు చిన్న పిల్లలను చాక్లెట్స్ పేరుతో ఇంటికి పిలిచి చంపటం మరియు తినటం చేసేవాడు. ఇలా చిన్న పిల్లలను ఎందుకు చంపావు అని అడగగా అది ఆ సమయంలో అలా జరిగిపోయింది అనే చెప్పేవాడే తప్ప అసలు కారణం చెప్పలేదు.

సురేందర్ కోలికి కోర్ట్ ఉరి శిక్ష విధించింది, ఇంతవరకు ఇంకా అది అమలు చేయలేదు. జైలు లోనే ఉన్నాడు , బహుశా ఫ్యూచర్ లో లేదా వచ్చే సంవత్సరాలలో ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *