
100 కు పైగా ముక్కలు చేయబడ్డ నీరజ్ గ్రోవర్ మర్డర్ స్టోరీ
2008 వ సంవత్సరం, మే 07 న మలాడ్ లోని ధీరజ్ సాలిటైర్ అపార్ట్ మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 201 లో ఎమిల్ జెరోమ్ మాథ్యూ, నీరజ్ గ్రోవర్ ను అతి క్రూరంగా చంపి డెడ్ బాడీ ను దాదాపు 100 ముక్కలుగా చేస్తాడు. ఈ కేసు వెలుగులోకి రావటానికి కొన్ని రోజులు పట్టిన తరవాత నేషనల్ మీడియా లో ఒక సంచలనంగా మారింది.
ఈ కథ మూగ్గురు వ్యక్తులకు చెందినది. నీరజ్ గ్రోవర్, టీవీ సీరియల్స్ క్రియేటివ్ టీం ఎగ్జిక్యూటివ్; మరియా మోనికా సుసైరాజ్, కన్నడ నటి; మరియు ఎమిల్ జెరోమ్ మాథ్యూ, కొచ్చిన్ లో ఒక నావెల్ ఆఫీసర్.
నీరజ్ గ్రోవర్ యొక్క పూర్తి పేరు నీరజ్ అమర్ నాథ్ గ్రోవర్. గ్రోవర్ బాలాజీ టెలి ఫిల్మ్ లిమిటెడ్ లోని క్రియేటివ్ టీం లో పనిచేసేవాడు. ఈ కంపెనీ టీవీ సీరియల్స్ ను ప్రొడ్యూస్ చేసేది.
ఆ సమయంలో నీరజ్ గ్రోవర్ అంధేరి లోని ఒక అపార్ట్మెంట్ లో తన కజిన్ బ్రదర్ తో కలిసి ఉండేవాడు.
నీరజ్ తన కెరీర్ లో చాలా వేగంగా ఎదుగుతూ ఉంటాడు అదే సమయంలో కన్నడ నటి అయిన మరియా మోనికా సుసైరాజ్ తో పరిచయం ఏర్పడుతుంది.
మరియా కర్ణాటక లోని మైసూర్ లో నివసించేది. ఎలాగైనా కెరీర్ లో గొప్ప నటిగా ఎదగాలని ఆశలతో ముంబై రావాలనుకుంటుంది.
మరియా ఇంట్లో ముంబై వెళ్ళవద్దు అని చెప్పిన కూడా, వాళ్ళ నిర్ణయానికి విరుద్ధంగా ముంబై కి వస్తుంది. ముంబై స్ట్రగ్లింగ్ చేస్తున్న నటులకు ఒక కళల ప్రపంచం లాంటిది. దేశం నలుమూలల నుంచి చాలా మంది సినిమాలలో అవకాశాల కోసం వస్తూ ఉంటారు.
మరియా ముంబై లో టీవీ సీరియల్స్ లేదా సినిమా ఇండస్ట్రీ లో పనిచేయాలని గట్టి పట్టుదలతో ముంబై చేరుకుంటుంది.
మరియా కు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతని పేరు ఎమిల్ జెరోమ్ మాథ్యూ.
మాథ్యూ కూడా కర్ణాటక లోని మైసూర్ కి చెందిన వాడు. మాథ్యూ శాంతమైన మరియు మృదుస్వభావి, వీరి ఫ్యామిలీ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు.
మాథ్యూ మరియు తన తమ్ముడు క్రికెట్ ఆడటానికి కూడా బయటికి వెళ్లేవారు కాదు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ప్రకారం మాథ్యూ చాలా మంచి అబ్బాయి.
మాథ్యూ మరియు మోనికా సుసైరాజ్ చాలా కాలం నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు.
లాంగ్ డిస్టెన్స్ మరియు తమ తమ కెరీర్ ల పై ఫోకస్ చేస్తూ ఉండటం కారణంగా వీరి రిలేషన్ షిప్ లో ఇబ్బందులు వచ్చేవి.
మాథ్యూ కొచ్చి లో ఒక నావెల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరియా మీద ప్రేమ కారణంగా ఈ రిలేషన్ షిప్ లో మాథ్యూ పొసెస్సివ్ మరియు సెన్సిటివ్ గా ప్రవర్తించేవాడు .
నీరజ్ గ్రోవర్ మర్డర్ :
ఇకపై నేను చెప్పబోయే స్టోరీ మరియా సుసైరాజ్ స్వయంగా పోలీసులకు చెప్పారు.
2008 వ సంవత్సరం ఏప్రిల్ నెల ఆఖరు లో మరియా టీవీ సీరియల్ లలో నటించడానికి ముంబై సిటీ కి వస్తుంది.
ముంబై లో టీవీ సీరియల్ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఆడిషన్స్ ఇచ్చే సమయంలో నీరజ్ గ్రోవర్ తో పరిచయం ఏర్పడుతుంది.
మహాభారతం సీరియల్ లో అవకాశం పొందటానికి తన ఆడిషన్ సీడీ ను నీరజ్ సహాయం తో బాలాజీ టెలీఫిల్మ్స్ కు ఇస్తుంది. నీరజ్ కూడా మరియా కెరీర్ కోసం సహాయం చేయాలనుకుంటాడు.
మరియా మాతృ బాష కన్నడ కావటంతో హిందీ భాష మాట్లాడటం అంతగా రాకపోయేది, ఫలితంగా ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యేది. ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వక పోయిన తమ ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది.
ఈ పరిచయం కాస్త మంచి స్నేహంగా మారుతుంది. ఇద్దరు నంబర్లు మార్చుకుంటారు, కాల్స్ చేయటం మెసేజెస్ చేసుకోవటం మొదలుపెడతారు. స్నేహం పెరగటం వల్ల ఇద్దరు ప్రతి రోజు కలుస్తూ ఉంటారు.
వీరిద్దరి మధ్య స్నేహానికి మించి రిలేషన్ ఉంది అని చుసిన వారికి తెలిసేది.
అదే సమయంలో మరియా ముంబై లోని మలాడ్ లో ఉన్న ధీరజ్ సాలిటైర్ అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్ నెంబర్ 201 ను రెంట్ కు తీసుకుంటుంది.
మే 6వ తేదీన రెంట్ తీసుకున్న ఫ్లాట్ సామాను కోసం మరియా షాపింగ్ చేస్తూ ఉంటుంది.
అదే సమయంలో నీరజ్ కలవటానికి కాల్ చేస్తాడు. “నేను చాలా అలిసిపోయాను కలవటం వీలు కాదు” అని మరియా నీరజ్ తో అంటుంది.
మరియా మరియు నీరజ్ కలుస్తూ ఉంటారు అని మాథ్యూ కు తెలుసు. మే 6 వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మరియా తన ఫ్లాట్ యొక్క షిఫ్టింగ్ నడుస్తుందని పక్కనే ఉన్న మిస్ మయూరి ఫ్లాట్ లో బాత్రూం ను యూస్ చేసి బయటికి వస్తుంది.
అదే సమయంలో ఫ్లాట్ నంబర్ 201 డోర్ ముందు నీరజ్ నిల్చొని ఉన్నట్లు గమనిస్తుంది. నీరజ్ ను మిస్ మయూరి తో ఇంట్రడ్యూస్ చేయిస్తుంది.
ఈ టైం లో ఇక్కడికి ఎందుకు వచ్చావని మరియా అడిగినప్పుడు నీకు షిఫ్టింగ్ లో హెల్ప్ చేయటానికి వచ్చానని నీరజ్ అంటాడు.
11:30 నిమిషాల సమయంలో ఎమిల్ జెరోమ్ మాథ్యూ మరియా కు కాల్ చేస్తాడు.
నీరజ్ కూడా అక్కడే ఉన్న విషయం మాథ్యూ కి తెలుస్తుంది. నీరజ్ డిన్నర్ చేసి వెళ్ళిపోతాడని మరియా మాథ్యూ కి కాల్ లో చెబుతుంది.
ఒక వైపు మరియా ఇల్లు క్లీన్ చేస్తుంటే నీరజ్ ఫ్రెండ్స్ కాల్ చేసి పార్టీ కి రమ్మని చెబుతారు. నీరజ్ నేను పార్టీ కి రాలేను అని అంటాడు.
ఆ మరుసటి రోజు నీరజ్ కి మలాడ్ లోనే పని ఉండటం వల్ల మరియా ఫ్లాట్ లోనే నైట్ గడుపుతాను అని రిక్వెస్ట్ చేస్తాడు.
మరియా కూడా ఓకే అని చెబుతుంది. ఆ రోజు ఇద్దరు అదే ఫ్లాట్ లో పడుకుంటారు.
మరియా తో నీరజ్ రాత్రి ఫ్లాట్ నెంబర్ 201 లోనే పడుకొని ఉంటాడని మాథ్యూ మరియా మీద అనుమాన పడతాడు. ఎలాగైనా ముంబై వెళ్లి కనుక్కోవాలి అని అనుకుంటాడు.
ఉదయం ఫ్లైట్ లో ట్రావెల్ చేసి ముంబై చేరుకుంటాడు. మే 7 వ తేదీ న డోర్ బెల్ రింగ్ అవుతుంది. మరియా డోర్ ఓపెన్ చేస్తుంది, డోర్ వద్ద ఎమిల్ జెరోమ్ మాథ్యూ ఉంటాడు.
మాథ్యూ నేరుగా ఇంటి లోపలి వస్తాడు. అప్పటికి నీరజ్ కూడా నిద్ర నుంచి లేచి ఉంటాడు. మాథ్యూ ని చుసిన నీరజ్, తాను నీ బాయ్ ఫ్రెండ్ కదా అని అంటాడు.
మరియా మరియు మాథ్యూ యొక్క ఫోటోలు నీరజ్ చూడటం కారణంగా నీరజ్ గుర్తుపడతాడు.
ఇంతలో కోపం తో ఉన్న మాథ్యూ నీరజ్ పై పిడికిలి దెబ్బలు కొడుతూ దాడి చేస్తాడు. నీరజ్ మరియు మాథ్యూ ఒకరినికోరు కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు కొట్టుకుంటూ మరియా ను తోసేస్తారు.
మరియా కింద పడుతుంది. మరియా పైకి లేచేసరికి మాథ్యూ కిచెన్ లో ఉన్న కత్తి తో నీరజ్ ను పొడవటం ప్రారంభిస్తాడు.
మాథ్యూ ను ఆపడానికి మరియా ప్రయత్నించినప్పుడు అర చేతికి గాయమవుతుంది. మరియా ను తోసేసి మాథ్యూ నీరజ్ ను పొడుస్తూనే ఉంటాడు.
నీరజ్ కింద పడిపోయిన తరవాత మాథ్యూ కాళ్లతో తంతూ ఉంటాడు. ఇదంతా చుసిన మరియా గట్టిగా అరుస్తుంది. మరియా నోటిని మాథ్యూ మూసి అరుస్తే నిన్ను కూడా చంపేస్తానని అంటాడు.
తరవాత కత్తి చేతిలో పట్టుకొని మరియా ను రేప్ చేస్తాడు. తరవాత మరియా ను కొట్టి ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పవద్దు అని అంటాడు.
అప్పుడు సమయం 8 అవుతుంది. నీరజ్ ను హాస్పిటల్ తీసుకెళదాం అని మరియా వేడుకుంటుంది. 4 5 గంటల వరకు నీరజ్ చనిపోడు అని మాథ్యూ నచ్చ చెబుతాడు.
మరియా ను బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అవ్వమని మాథ్యూ అంటాడు. మరియా బాత్రూం లో ఫ్రెష్ అవుతుండగా ఇంకొకసారి మరియా ను రేప్ చేస్తాడు.
ఉదయం 11 గంటల సమయంలో మాథ్యూ తన మర్డర్ ను కప్పి పుచ్చడానికి మరియా ను నీరజ్ గ్రోవర్ యొక్క కజిన్ కి కాల్ చేసి నీరజ్ రాత్రి 12:30 నిమిషాలకే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయాడు కానీ ఫోన్ ఇక్కడే మరిచిపోయాడు అని చెప్పమంటాడు.
అలాగే ఫ్లాట్ నుంచి నీరజ్ ఫోన్ కూడా తీసుకెళ్లమని చెప్పమంటాడు. మాథ్యూ చెప్పిన విధంగానే మరియా నీరజ్ కజిన్ అయిన నిశాంత్ కి కాల్ చేస్తుంది. నిశాంత్ మాత్రం నేను ఫోన్ తీసుకెళ్లడానికి రాలేను అని చెబుతాడు.
తరవాత మాథ్యూ మరియాను మలాడ్ లో ఉన్న హైపర్ సిటీ మాల్ కి వెళ్లి శవాన్ని తీసుకెళ్లడానికి కత్తి, రూమ్ ఫ్రెషనర్,పెద్ద సైజు బ్యాగులు మరియు కర్టైన్స్ తీసుకొని రమ్మంటాడు.
మరియా మాల్ కి వెళ్లిన తరవాత నీరజ్ యొక్క శవాన్ని బాత్రూం లోకి ఈడ్చుకొని వెళతాడు.
మరియా సామాను తీసుకొని ఇంటికి రాగానే బాత్రూం లోపలికి పిలిచి రూమ్ షిఫ్టింగ్ కోసం తీసుకున్న సామాను లను ఖాళీ చేసి పాలిథీన్ బ్యాగులను తీసుకొని రమ్మంటాడు.
అలాగే హాల్ లో ఉన్న రక్తపు మరకలను కూడా శుభ్రం చేయమని చెప్తాడు. ఈలోగా మాథ్యూ నీరజ్ యొక్క శవాన్ని చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేస్తాడు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 100 కు పైగా నీరజ్ యొక్క శవం ముక్కలుగా చేయబడింది.
శవాన్ని సిటీ కి దూరంగా తీసుకెళ్లి పూడ్చి పెట్టాలని మాథ్యూ డిసైడ్ అవుతాడు. శవాన్ని తీసుకెళ్లడానికి మరియాను తన ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికైనా కారు ఉంటే కనుక్కోమంటాడు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరియా తన ఫ్రెండ్ కిరణ్ కి కాల్ చేసి కారు కావాలని అడుగుతుంది. కారు ఎందుకు కావాలి అని అడిగినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కి కావాలి అని అంటుంది.
కిరణ్ బంగ్లా దగ్గర్లోనే ఉండటంతో మరియా మరియు మాథ్యూ ఆటో ద్వారా అక్కడికి చేరుకొని కారు తీసుకుంటారు.
ఇద్దరు లోఖండ్ వాలా పెట్రోల్ బంక్ వద్ద కారు లో పెట్రోల్ నింపుకోటానికి ఆగుతారు. అదే సమయంలో మాథ్యూ ఒక ప్లాస్టిక్ క్యాన్ లో 5 లీటర్ల పెట్రోల్ ను తీసుకుంటాడు.
ఇద్దరు ఫ్లాట్ నంబర్ 201 కి వెళ్లి ముక్కలుగా చేసిన నీరజ్ గ్రోవర్ శవాన్ని మాల్ నుంచి తెచ్చిన బ్యాగులో పెట్టిన కింద ఉన్న కారు లో పెడతారు.
సిటీ లోపల శవాన్ని కాల్చటం లేదా పూడ్చిపెట్టడం కష్టం కాబట్టి సిటీ కి దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
మాథ్యూ మరియా ను కారు నడపమని చెబుతాడు. హైవే మీద నడుపుతూ 3 టోల్ గేట్ లను క్రాస్ చేస్తారు. అదే సమయంలో హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఇంకో క్యాన్ లో పెట్రోల్ ను మరియు లైటర్ ను తీసుకుంటాడు.
మూడవ టోల్ గేట్ తరవాత యూ టర్న్ తీసుకుంటారు. ఇలా డ్రైవ్ చేస్తూ దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ రెండు మరియు 3 మధ్యలో ఉన్న మనోర్ అనే ప్రదేశానికి చేరుకుంటారు.
ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటం వల్ల మాథ్యూ ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు.
ఈ ప్రదేశానికి చేరుకునే సరికి సాయంత్రం 7.00 to 7.30 నిమిషాల సమయం అవుతుంది. అన్ని బ్యాగులను బయటికి తీసి పెట్రోల్ పోసి తనతో పాటు తెచ్చిన లైటర్ తో నిప్పు అంటిస్తాడు.
శవం పూర్తిగా కాలిపోయింది అని తెలిసిన తరవాత తిరిగి ఫ్లాట్ నెంబర్ 201 కి బయలుదేరుతారు. తిరిగి వచ్చే సమయంలో మాథ్యూ కారును నడుపుతాడు.
రిటర్న్ వస్తున్న సమయంలో మ్యాట్రెస్ వాడికి కాల్ చేసి కొత్త మ్యాట్రెస్ కవర్ కావాలని మరియు పెయింట్ వేసే వాడికి కాల్ చేసి గోడలకు పెయింట్ వేయమని చెపుతాడు.
మాథ్యూ తాను ముంబై నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్లాలని అనుకుంటాడు. కానీ వెళ్లేముందు అన్ని సాక్ష్యాలు తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
9:30 నిమిషాలకు ఇద్దరు ఫ్లాట్ నెంబర్ 201 కి చేరుకుంటారు. మరియా చేతికి గాయం కావడం కారణంగా మాథ్యూ ఫ్లాట్ నంబర్ 201 లో ఉన్న రక్తం మరకలను క్లీన్ చేయటం మొదలుపెడతాడు.
మరోవైపు నీరజ్ తల్లి తండ్రులు మరియు స్నేహితులు నీరజ్ గురించి వెతకటం మొదలుపెడతారు.
రాత్రి 10:30 నిమిషాల సమయంలో నీరజ్ కజిన్ నిశాంత్ మరియా కు కాల్ చేసి నీరజ్ గురించి అడుగుతాడు. మరియా తనకు ఏమి తెలియదు నీరజ్ ఫోన్ మాత్రం తన దగ్గర ఉంది అని చెబుతుంది.
మరోవైపు నీరజ్ గ్రోవర్ తల్లి రోజు ఉదయం కాల్ చేసి నీరజ్ తో మాట్లాడేది. నీరజ్ కాల్ లిఫ్ట్ చేయకపోవటం తో నిశాంత్ గ్రోవర్ కి కాల్ చేసి అడుగుతుంది.
నిశాంత్ ఫ్లాట్ నెంబర్ 201 కి వెళ్లి నీరజ్ మొబైల్ ఫోన్ తీసుకుంటాడు. “నీరజ్ కనిపించటం లేదని అందరు దిగులుగా ఉన్నాము పోలీస్ కంప్లెయింట్ చేయటానికి వెళ్తున్నాం నువ్వు కూడా మాతో పాటు రా” అని నిశాంత్ మరియా తో అంటాడు.
పోలీస్ స్టేషన్ లో మర్డర్ గురించి ఏమి చెప్పవద్దని మాథ్యూ మరియా తో అంటాడు.
మాథ్యూ చెప్పిన విధంగా మరియా సరే అని నిశాంత్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తుంది. పోలీసులతో నాకు నీరజ్ గురించి ఏమి తెలియదు అని అబద్దం చెబుతుంది.
కంప్లెయింట్ ఇచ్చి మరియా రాత్రి 3 గంటలకు ఫ్లాట్ కు చేరుకుంటుంది. మరియా తో పాటు మాథ్యూ కూడా ఫ్లాట్ లోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మాథ్యూ ను కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వమని అడుగుతారు.
ఆ మరుసటి రోజు అంటే 8th May, 2008 రోజున మరకలతో ఉన్న కాళ్ళు తుడిచే మ్యాట్ ను ఇతర రక్తపు మరకలు వస్తువులను పడేయడానికి బయలుదేరుతాడు.
ఆ తరవాత 8:30 నిమిషాల సమయంలో ఫ్రెండ్ కిరణ్ వద్ద తీసుకున్న కారును తిరిగి ఇచ్చి వేయటానికి వెళతారు.
9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కి వెళతారు. పోలీసుల విచారణలో జెరోమ్ మాథ్యూ తాను నావెల్ ట్రైనింగ్ కోసం ముంబై వచ్చానని స్టేట్ మెంట్ ఇస్తాడు. మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకొని తిరిగి సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వెళతారు.
పోలీస్ స్టేషన్ లో పని ముగించుకొని మాథ్యూ తిరిగి ఫ్లైట్ ద్వారా కొచ్చిన్ కి తిరిగి వెళ్ళిపోతాడు.
మరియా మరియు నీరజ్ కి చాలా దగ్గరి సంభందం ఉండటం తో పోలీసులు మరియాను విచారిస్తూనే ఉంటారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మరియా స్టేషన్ లోనే ఉంటుంది.
మరియా తన పరిస్థితిని తన కుటుంబ సభ్యులకి తెలియజేస్తుంది. తన కుటుంబ సభ్యులు కూడా ముంబై చేరుకుంటారు.
మర్డర్ ఎవరు చేసారు, ఎలా చేసారు మరియు ఎందుకు చేసారు అనే విషయాలు తెలిసి కూడా మరియా ఎవ్వరికి ఏమి చెప్పలేదు.
మాథ్యూ ఎవ్వరికి చెప్పవద్దు అని రోజు కాల్ చేసినప్పుడల్లా బెదిరించేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తా అని అనేవాడు.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ :
మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి కేసులో కనిపించకపోవడం మరియు ఆధారాలను సరిగా పరిగణ లోకి తీసుకోకపోవటం తో నీరజ్ గ్రోవర్ తండ్రి అమర్ నాథ్ గ్రోవర్ అప్పటి జాయింట్ కమీషనర్ రాకేష్ మరియా తో కలిసి తన బాధ చెప్పుకుంటారు.
రాకేష్ మరియా క్రైమ్ బ్రాంచ్ ను కూడా ఈ కేసు ను ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ చేస్తాడు.
ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరియు క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు లో మొదలవుతుంది.
పోలీసులు మరియా స్టేట్ మెంట్స్ వెరిఫై చేసిన తరవాత ఎక్కువగా అనుమానం మరియా పైనే చేస్తారు.
ఈ అనుమాన పరిచే విషయాలు ఏమిటంటే
పోలీసులు నీరజ్ గ్రోవర్ కాల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు మే 6 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు నీరజ్ మరియు మరియా ఒకే దగ్గర ఉన్నారని సెల్ టవర్ ద్వారా తెలుస్తుంది.
మే 7 వ తేదీన జెరోమ్ మాథ్యూ ఫ్లాట్ కి రాకముందే నీరజ్ తన ఫోన్ నుంచి ఒక బిజినెస్ కార్డు తన ఫ్రెండ్ ఫోన్ కి పంపుతాడు.
ఇలా కాల్ రికార్డ్స్ ఆధారంగా మరియా మరియు నీరజ్ ఒకే దగ్గర కలిసి ఉన్నారని తెలుస్తుంది.
మరియా బిల్డింగ్ వాచ్ మెన్ ను విచారించినపుడు మరియా మరియు ఇంకో వ్యక్తి పెద్ద పెద్ద బ్యాగులను కారులో పెట్టడం చూశానని చెప్పాడు.
విచారణలో నీరజ్ మిస్ అయిన రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని పోలీసులు అడగగా నేను, జెరోమ్ మాథ్యూ కలిసి ముంబై లో కారు లో తిరిగామని చెబుతుంది.
కారు ఎవరిది అని అడిగినప్పుడు జెరోమ్ మాథ్యూ యొక్క ఫ్రెండ్ మరియు నావెల్ ఆఫీసర్ అయిన జితేష్ ది అని చెబుతుంది. తరవాత మరియా జితేష్ కి నీ కారు మేము తీసుకున్నట్లు అబద్దపు సాక్ష్యం చెప్పమంటుంది. దానికి జితేష్ నిరాకరిస్తాడు.
పోలీసులు జితేష్ ను విచారించినపుడు మరియా కారు గురించి అబద్దం చెప్పినట్లు తెలుస్తుంది.
మే 7 వ తేదీ రోజు సాయంత్రం నీరజ్ బాడీ ను తగలపెట్టడానికి వెళుతున్నప్పుడు నీరజ్ మొబైల్ కి కాల్ వస్తుంది.
మరియా పొరపాటున కాల్ లిఫ్ట్ చేస్తుంది. మరియా వెంటనే కాల్ కట్ చేస్తుంది అయినా పోలీసులు లొకేషన్ ను ట్రాక్ చేస్తుంది.
మరియా ఇంతకు ముందే నీరజ్ తన వద్ద ఫోన్ మరిచిపోయాడని చెబుతుంది. మరియు ఆ రోజు తాను ఫ్రెండ్ తో ముంబై లో తిరుగు తున్నాం అని చెప్పింది.
పోలీసులు ట్రేస్ చేసిన లొకేషన్ ముంబై నుంచి చాలా దూరంలో ఉంది. ఇలా నీరజ్ మిస్ అయిన రోజు మరియా ముంబై లోనే లేదని తెలుస్తుంది.
ఇలా ఒకటి తరవాత మరొకటి మరియా ఇచ్చిన అన్ని స్టేట్ మెంట్స్ తప్పని తెలుస్తుంది.
ఇన్వెస్టిగేషన్ సమయంలో క్రైమ్ బ్రాంచ్ గమనించిన ఇంకో విషయం ఏమిటంటే మే 7 తేదీ నుంచి అరెస్ట్ అవ్వనంత వరకు జెరోమ్ మాథ్యూ దాదాపు 1000 సార్లు మరియా కు కాల్ చేసాడు.
ఇన్ని సార్లు కాల్ చేసుకోవటం వల్ల పోలీసులకి అనుమానం వచ్చింది.
మొదట పోలీసులు వచ్చి 201 ఫ్లాట్ ను తనిఖీ చేసినప్పుడు కొత్తగా పెయింట్ వేయటాన్ని మరియు బేడీషీట్ మరియు మ్యాట్రెస్ కవర్లు కొత్తగా ఉండటాన్ని చూసి ఎలాంటి అనుమానం కలగలేదు.
క్రైమ్ బ్రాంచ్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక్క గోడకే పెయింట్ ఎందుకు వేసారు మరియు రక్తపు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణంలో విచారించారు.
అన్ని కోణాలలో పరిశీలించినప్పుడు మరియా కి మరియు నీరజ్ మిస్సింగ్ కి సంభందం ఉందని తెలుస్తుంది.
ఇదంతా గమనించిన మరియా చివరికి నీరజ్ ను మాథ్యూ మర్డర్ చేసిన సంగతి చెబుతుంది.
మరియా మనోర్ కి తీసుకెళ్లి నీరజ్ శవాన్ని కాల్చిన ప్రదేశాన్ని చూపిస్తుంది. అక్కడి నుంచి నీరజ్ శవం యొక్క కొన్ని ముక్కలు మరియు నీరజ్ ధరించిన కొన్ని వస్తువులను సేకరించారు.
మరియా మరియు జెరోమ్ మాథ్యూ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేస్తుంది.
అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మరియా నీరజ్ ను మర్డర్ చేయలేదని కానీ సాక్ష్యాలను తారు మారు చేసిందని మరియు నీరజ్ బాడీ ను కాల్చటం లో సహాయం చేసినందుకు ఎవిడెన్స్ destruction కింద 3 సంవత్సరాల శిక్ష విధించారు.
కోర్ట్ తీర్పు వచ్చే సమయానికి మరియా ఆల్రెడీ 3 సంవత్సరాలు జైలు లో ఉంది కాబట్టి తీర్పు వచ్చిన మరుసటి రోజు మరియా జైలు నుంచి రిలీజ్ అయ్యింది.
జెరోమ్ మాథ్యూ కోపంలో నీరజ్ మర్డర్ చేసాడు. ఇది ముందే అనుకోని చేసిన మర్డర్ కాదు అని కోర్ట్ నమ్మింది.
జెరోమ్ మాథ్యూ కి కోర్ట్ 10 సంవత్సరాల శిక్ష ను విధించింది. నీరజ్ తండ్రి మాత్రం ఈ తీర్పు తో నిరాశ చెందాడు. ఈ శిక్ష చాలా తక్కువ అని పై కోర్ట్ కు వెళ్లే స్తొమత కూడా తన వద్ద లేదని తన బాధను వ్యక్తం చేసాడు.
తొందర పాటు తో చేసిన తప్పు ముగ్గురి జీవితాలను నాశనం చేసింది. మన చుట్టూ మర్డర్స్ కి సంబంధించిన క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి,ఈ మర్డర్స్ న్యూస్ చానెల్స్ లో కూడా చూపిస్తారు.
కానీ మర్డర్ తరవాత క్రైమ్ ను కప్పి పుచ్చడానికి చేసే ప్రయత్నాలే కేసులును స్పెషల్ గా మారుస్తాయి.
నీరజ్ గ్రోవర్ కేసు కూడా ఒక స్పెషల్ కేసు అని చెప్పవచ్చు.