
భార్య మీద కోపం తో చంపి తందూర్ లో కాల్చిన సందీప్ శర్మ స్టోరీ – Tandoor kaand story
హాయ్ ఫ్రెండ్స్ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. మనిషి కి కోపం వచ్చినప్పుడు అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఈ స్టోరీ.
నైనా సాహ్ని మరియు సుశీల్ శర్మ ఇద్దరు భార్య భర్తలు, నైనా సాహ్ని కాంగ్రెస్ పార్టీ లో వర్కర్ గా పనిచేసేవారు.
సుశీల్ శర్మ కాంగ్రెస్ పార్టీ లో యూత్ లీడర్ మరియు MLA గా ఉన్నారు.
నైనా సాహ్ని తో పాటు తన క్లాస్ మేట్ మథ్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ లో వర్కర్ గా పనిచేసేవాడు. ఇద్దరు భార్య భర్తలు ఢిల్లీ లోని గోల్ మార్కెట్ వద్ద ఉండే గవర్నమెంట్ ఫ్లాట్స్ లో ఉండేవారు.
సుశీల్ కుమార్ తన పెళ్లి సంగతి బయట ప్రపంచంతో దాచి ఉంచాడు. నైనా సాహ్ని కి తన పెళ్లి విషయాన్ని దాచి ఉంచటం నచ్చలేదు. ఎన్ని సార్లు చెప్పిన సుశీల్ పెద్దగా పట్టించుకోలేదు, ఇదే కాకుండా సుశీల్ చెడు అలవాట్ల వల్ల కూడా నిన్న సాహ్ని విసిగిపోయింది.
తన జీవితంలో జరుగుతున్నా విషయాలను తన క్లాస్ మెట్ అయిన matloob kareem తో చెప్పి తాను ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంది. matloob kareem ఆస్ట్రేలియా వెళ్ళడానికి సహాయం కూడా చేస్తాడు. నైనా సాహ్ని matloob kareem తో మాట్లాడటం నచ్చేది కాదు. రోజు ఇంటికి వచ్చాక రే డయల్ నెంబర్ నొక్కి నైనా సాహ్ని ఎవరితో మాట్లాడింది అని సెహెక్ చేసేవాడు.
1995 సంవత్సరం జులై రెండవ తారీకు రాత్రి నైనా సాహ్ని మద్యం తాగుతూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి రావటం తో నైనా సాహ్ని కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అని భార్య ను అడగగా ఎవరితో లేదు రాంగ్ నెంబర్ అని మాట మార్చి కిచెన్ లోకి వెళుతుంది.
భార్య కిచెన్ లోకి వెళ్ళటం చుసిన సుశీల్ శర్మ ఫోన్ తీసుకొని రీ డయల్ బటన్ నొక్కుతాడు. అవతలి వైపు నుంచి మథ్లూబ్ కరీం ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అని అంటాడు.
నైనా సాహ్ని తనతో అబద్దం చెప్పి మథ్లూబ్ కరీం తో కాల్ లో మాట్లాడిన విషయం తెలుసుకుంటాడు.నైనా సాహ్ని మరియు మథ్లూబ్ కరీం మధ్య ఎదో సంభందం ఉందని సుశీల్ శర్మ తరచూ అనుమాన పడేవాడు, ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యేయి. జులై రెండవ తారీకు కూడా ఇదే విషయం పై గొడవ పడతారు. సుశీల్ శర్మా కి పట్టరాని కోపం వస్తుంది. కోపంలో తన వద్ద ఉన్న గన్ తీసి నైనా సాహ్ని ను కాలుస్తాడు. రెండు బుల్లెట్లను తలపై మరియు ఒక బుల్లెట్ గొంతు పై తగులుతుంది.
నైనా సాహ్ని అక్కడికక్కడే చనిపోతుంది. సుశీల్ శర్మా కు ఎం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే సుశీల్ మర్డర్ చేయాలని ప్లాన్ చేయలేదు. కోపం లో కాలుస్తాడు, ఇక శవాన్ని ఎక్కడైనా పడేయాలి అని ఒక పోలితిన్ కవర్లో చుట్టి ఒక బెడ్ షీట్ లో చుట్టి కిందికి తీసుకరావటానికి ప్రయాణిస్తాడు. కానీ తాను ఆ శవాన్ని ఎత్తలేకపోయాడు. చేసేదేం లేక శవాన్ని కిందికి ఈడ్చుకుంటూ తన మారుతి కారులో పెడతాడు. కారులో నైనా సాహ్ని శవాన్ని తీసుకొని బయలుదేరుతాడు.
ఢిల్లీ లోనే తన కార్ లో శవాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడా శవాన్ని పడేయాలి అర్థం అవ్వదు. MLA కావటం తో శవాన్ని పారేసేటప్పుడు ఎవరైనా చూసే అవకాశం ఉందని భయపడి ఎక్కడా పడేయకుండా ఢిల్లీ లోనే ఉన్న తన సొంత బగియా రెస్టారెంట్ కి కార్ తీసుకెళతాడు.
ఆ హోటల్ లో కేశవ్ అనే వ్యక్తి మేనేజర్ గా పనిచేసేవాడు. రెస్టారెంట్ కి చేరిన తరవాత అక్కడికి వస్తున్నా కస్టమర్లకు రెస్టారెంట్ క్లోజ్ అయ్యిందని చెప్పి పంపించారు. కేశవ్ సుశీల్ శర్మా కి నమ్మకస్తుడు కావటం తో చెప్పినట్లు చేసాడు.
కాసేపటి తర్వాత హోటల్ స్టాఫ్ ను కూడా కేశవ్ బయటికి పంపించేసాడు. చివరికి ఆ రెస్టారెంట్ లో సుశీల్ శర్మా మరియు కేశవ్ మాత్రమే ఉన్నారు.
అప్పుడు సుశీల్ కేశవ్ తో జరిగిందంతా చెప్తాడు. కారులో శవం ఉందని ఆ శవాన్ని తందూర్ లో కాల్చి బూడిద చేయాలని కేశవ్ తో తన ప్లాన్ చెప్తాడు.
తందూర్ లో సాధారణంగా రోటీలు తయారు చేస్తారు. మీరు హోటల్స్ లో చూసి ఉంటారు. నైనా సాహ్ని శవాన్ని తందూర్ పై పెట్టి కాల్చడం మొదలుపెడతారు.
ఎంత ట్రై చేసిన శవం మాత్రం సరిగ్గా కాలదు. సుశీల్ శర్మా కేశవ్ తో బట్టర్ యొక్క 4 బ్రిక్ లను తిసురమ్మని చెప్తాడు. ఆ బట్టర్ ను తీసుకొని శవం పై వేయగా పెద్దగా మంటలు చెలరేగుతాయి.
అదే సమయంలో అక్కడ గస్తీ చేస్తున్న అబ్దుల్ నజీర్ కుంజు మరియు హోంగార్డ్ చందర్ పాల్ బగియా రెస్టారెంట్ లో నుంచి పెద్దగా మంటలు రావటం గమనించారు.
అబ్దుల్ నజీర్ కుంజు ఆ రెస్టారెంట్ గేట్ వద్దకి వెళ్లగా సుశీల్ శర్మా గేట్ కి అడ్డంగా ఒక బట్ట కట్టి అక్కడే నిల్చుని ఉండటం చూసాడు.
ఎందుకని అంతలా మంటలు వస్తున్నాయి అని అడగగా పార్టీ యొక్క పోస్టర్ పేపర్లను కాలుస్తున్నాను అని చెప్పి పంపించాడు.
సుశీల్ కుమార్ మోహంలో నెర్వస్ నెస్ చూసి ఎదో దాస్తున్నాడని పోలీసు ఆఫీసర్ కి అనిపించింది. రెస్టారెంట్ వెనక భాగం నుంచి గోడ దుంకి లోపలి వెళ్లి చూడగా సుశీల్ మరియు కేశవ్ ఎదో కాలుస్తున్నట్టు అనిపించింది.
అక్కడే ఉన్న కేశవ్ తో ఎం కలుస్తున్నావ్ అని అడగగా పొట్టేలు ను కలుస్తున్నాని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక మహిళా శవాన్ని కాలుస్తున్నట్టు తెలిసింది.
వెంటనే గస్తీ లో ఉన్న పోలీసు తన పై అధికారులకు ఫోన్ చేసి ఇక్క రెస్టారెంట్లో ఒక మహిళా శవాన్ని కలుస్తున్నారని ఇన్ఫార్మ్ చేసాడు.
ఆ రెస్టారెంట్ ఒక మ్మెల్యే డి కావటం వల్ల పై అధికారులు అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. అప్పటికే అక్కడి నుంచి సుశీల్ శర్మా పరారు అయ్యాడు.
కేశవ్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ మహిళా శవం ఎవరిది అనేది కేశవ్ మాత్రం చెప్పటం లేదు. నెక్స్ట్ డే పేపర్ లో బగియా రెస్టారెంట్ లో ఒక మహిళా శవాన్ని తందూర్ లో కాల్చారని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చదివిన matloob kareem వెంటనే అనుమానం వచ్చి పోలీసుల వద్దకి వెళతాడు. ఆ శవానికి ఉన్న ఒక రింగ్ ద్వారా ఈ శవం నైనా సాహ్ని ది అని గుర్తుపడతాడు. ఈ మర్డర్ కచ్చితంగా సుశీల్ శర్మా చేసి ఉంటాడని చెప్పాడు.
శవాన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు నైనా సాహ్ని ని కాల్చటం వల్ల చనిపోయిందని అని రిపోర్ట్ వస్తుంది. ఢిల్లీ పోలీసులు రెండవ సారి మళ్ళీ పోస్ట్ మార్టం చేయించగా బులెట్ వల్ల చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది.
సుశీల్ శర్మా మాత్రం అక్కడి నుంచి బెంగళూరు కి వెళ్లి తనను ఎవరూ గుర్తుపట్టవద్దని తలకు గుండు కొట్టించుకొని అక్కడి కోర్ట్ లో బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకుంటాడు.
ఢిల్లీ పోలీసులకు ఈ విషయం తెలిసి బెంగళూరు వెళ్లి అరెస్ట్ చేస్తారు. కేశవ్ ను పోలీసుల అప్రూవల్ మారమని అడిగినప్పుడు నిరాకరించాడు. ఎందుకంటే సుశీల్ శర్మా కి కేశవ్ పై చాలా నమ్మకం ఉండేది.
మరోవైపు సుశీల్ శర్మా కూడా అప్రూవల్ గా మారొద్దని కేశవ్ కి నచ్చచెప్పేవాడు, తర్వాత భయపెట్టాడు కూడా. చివరికి కేశవ్ తాను అప్రూవల్ గా మారటమే బెస్ట్ అని జరిగిందంతా చెప్పేసాడు.
2003 వ సంవత్సరం నవంబర్ 7 వ తారీకు రోజున సెషన్ కోర్ట్ సుశీల్ శర్మా కి ఉరి శిక్ష మరియు కేశవ్ కి 7 సంవత్సరాల శిక్ష విధించింది.
సుశీల్ కుమార్ హై కోర్ట్ లో అప్పీల్ చేయగా 2007 వ సంవత్సరంలో హై కోర్ట్ కూడా ఉరి శిక్ష విధించింది. సుశీల్ శర్మా సుప్రీమ్ కోర్ట్ లో అర్జీ పెట్టుకోగా 2013 వ సంవత్సరంలో ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
సుశీల్ కుమార్ కి క్రైమ్ రికార్డు లేదు, ఈ హత్య ప్లాన్ చేసి చేయలేదు, ఇది తన ఇంటికి చెందిన పర్సనల్ మ్యాటర్ అని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది.
ప్రస్తుతం సుశీల్ కుమార్ జైలు నుంచి శిక్ష పూర్తి చేసుకొని జీవిస్తున్నాడు. కొందరు రీపోటర్లు ఇంటర్వ్యూ చేస్తాం అని అడగగా తాను ఇప్పుడు మారిపోయానని పేరు మార్చుకొని జీవితున్నాను.
నా వల్ల నా కుటుంబం ఏంటో బాధపడింది నేను ఎవ్వరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వ దలుచుకోలేదు అని చెప్పాడు.