Zanetti train story in telugu

టన్నెల్ లోకి వెళ్లి మాయమైన జానెట్టి ట్రైన్ స్టోరీ

ఈ రోజు నేను మీకు 1911 సంవత్సరంలో మాయమైన జానెట్టి ట్రైన్ గురించి చెప్పబోతున్నాను. ఈ స్టోరీ ఇప్పటివరకు కూడా ఒక పరిష్కరించబడని రహస్యంగా చరిత్ర లో నిలిచిపోయింది. 

1911వ సంవత్సరంలో ఇటలీ కి చెందిన జానెట్టి (Zanetti) అనే కంపెనీ ట్రైన్ లను తయారు చేయటం మొదలుపెట్టింది. ఈ ట్రైన్లను తయారు చేయటానికి వెనక ఉన్న ముఖ్య లక్ష్యం ధనికులకు ఒక మంచి లగ్జరీ తో నిండిన రవాణా సౌకర్యం కలిపించటం. ఈ ట్రైన్ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని తింటూ తమకు నచ్చిన డ్రింక్స్ ను తాగుతూ ప్రకృతి యొక్క అందాలను ఆనందిస్తూ ప్రయాణం చేయవచ్చు.

ఈ ట్రైన్ లో దాదాపు ఆ కాలం టెక్నాలజీ ప్రకారం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక ధనికులను ఈ ట్రైన్ గురించి తెలియాలి అంటే ఉచితంగా ఒక ట్రయిల్ రన్ చేసి అందరికి తెలిసేలా చేయాలి అని ట్రైన్ కంపెనీ జానెట్టి నిర్ణయించింది. 

ఆ రోజుల్లో మనలా సోషల్ మీడియా కూడా లేదు కాబట్టి కంపెనీ ఇలా ఉచితంగా ట్రైన్ ప్రయాణం చేయించి advertisement (ప్రకటన) చేయించాలని అనుకుంది.   

ఈ ఆలోచన తరవాత 100 మందిని ట్రైన్ యొక్క ట్రయిల్ రన్ కోసం ఎంచుకోవటం జరిగింది. ఈ 100 మంది మొదటి స్టేషన్ నుంచి ఆఖరి స్టేషన్ దాక మళ్ళీ తిరిగి మొదటి స్టేషన్ దాకా ఉచితంగా ప్రయాణిస్తారు.ఈ ట్రైన్ లో ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదిస్తూ నచ్చిన ఆహారాన్ని తింటూ, తాగుతూ ప్రయాణం చెయ్యాలి.

1911 వ సంవత్సరం జులై 14వ రోజున ఈ ట్రైన్ యొక్క ట్రయిల్ రన్ 100 మంది ప్రయాణికులు మరియు 6 గురు సిబ్బంది తో మొత్తం 106 మంది ఈ ట్రైన్ లో ఎక్కటం జరిగింది. ఈ ట్రైన్ లో మొత్తం 3 కంపార్టుమెంటులు మరియు ఒక ఇంజన్ ఉంది. 

ప్రయాణికులు ట్రైన్ యొక్క ప్రయాణాన్ని మరియు సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు. ట్రైన్ కదులుతున్నప్పుడు ఆ ట్రైన్ ను చూసే వారు చేతులు ఊపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ట్రైన్ ప్రయాణిస్తూ లొంబార్డి టన్నెల్ వద్దకు చేరుకుంది. ఈ  టన్నెల్ యొక్క పొడవు కేవలం అర కిలోమీటరు. ఈ ట్రైన్ టన్నెల్ లోకి వెళ్లటాన్ని కూడా చాలా మంది చూడటం జరిగింది. 

ఈ టన్నెల్ లోకి ట్రైన్ అయితే ఎంటర్ అయ్యింది కానీ ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఆ టన్నెల్ తరవాత వచ్చే స్టేషన్ దగ్గర చాలా మంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఆ ట్రైన్ మాత్రం రాలేదు. 

ఈ ట్రయిల్ రన్ ను ప్రారంభించిన కంపెనీ సైతం షాక్ కి గురు అయ్యింది. అంత పెద్ద ట్రైన్ ఒక్క సారి కనబడకపోవడం చాలా విచిత్రం. ఈ టన్నెల్ లోపల కూడా ఎలాంటి ఇతర దారులు లేవు. కేవలం ఒకవైపు నుంచి వెళ్లి ఇంకోవైపు నుండి బయటకు రావాలి.

ఈ ట్రైన్ ఆఖరికి ఎక్కడికి వెళ్లిందో కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించటం జరిగింది. రైల్వే శాఖకు చెందిన మేనేజ్ మెంట్ మరియు కార్మికులు టన్నెల్ యొక్క ఒక్కోక్క భాగం సెర్చ్ చేయటం ప్రారంభించారు. ఫలితం మాత్రం శూన్యం, ట్రైన్ ఎక్కడ కూడా కనిపించలేదు. 

 ఇన్వెస్టిగేషన్ సమయంలో ఇద్దరు ప్రయాణికులు ముందుకు వచ్చారు. మేము ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న 100 మంది ప్రయాణికులకు చెందిన వారు అని చెప్పడంతో అధికారులు వారి వివరాలు కనుక్కుని 100 మంది ప్రయాణికుల లిస్ట్ తో పోల్చగా నిజంగానే వారి పేర్లు ఉన్నాయి. 

వీరు ఇద్దరు ట్రైన్ నుంచి బయటికి ఎలా వచ్చారని అడగగా వారి మాటలలో ఇలా అన్నారు ” ట్రైన్ టన్నెల్ లోకి వెళుతున్న సమయంలో నెమ్మదించినప్పుడు ఒక దట్టమైన తెల్లని పొగ ట్రైన్ ని చుట్టు ముట్టడం ప్రారంభించింది. ట్రైన్ టన్నెల్ లోపలికి వెళ్లే కొద్దీ పొగ ఇంకా దట్టమవ్వటం మొదలైంది. మేము ఒక వింత హమ్మింగ్ శబ్దం కూడా విన్నాము. ఇదంతా చూసి మేము కిందికి దుంకాము” అని ఇద్దరు చెప్పటం జరిగింది.

వీరు ఇద్దరు అక్కడ జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు, ఆ ట్రైన్ నుంచి దూకిన తరవాత వీరికి ఏమి గుర్తు లేదు అనే విషయం విచారణ చేసే వారికి తెలిసింది.    

ఇద్దరు ప్రయాణికులను psychiatrist (మానసిక వైద్యుడు) కు చూపించగా నిద్ర లేమి మరియు స్ట్రెస్ తో బాధపడుతున్నారని విషయం తెలిసింది. కానీ ఇప్పటికి ట్రైన్ ఎక్కడికి వెళ్లిందో తెలియదు.

ఈ ఘటన తరవాత ఈ టన్నెల్ ను పూర్తిగా మూసివేయటం జరిగింది. తరవాత జరిగిన యుద్ధాలలో ఈ టన్నెల్ పూర్తిగా నశించింది.

ఇప్పటివరకు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఇంకాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ ఘటన 1911 వ సంవత్సరంలో జరిగింది కానీ 1911 వ సంవత్సరానికి ముందు వేరు వేరు సంవత్సరాలలో ఈ ట్రైన్ ను చుసిన రికార్డ్స్ ఉన్నాయి. 

ఈ ట్రైన్ ను మధ్యయుగానికి చెందిన కొంత మంది 3 బోగీలున్న ట్రైన్ ను చూసారని కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఆ సమయంలో కేవలం గుర్రపు సవారీలు మాత్రమే ప్రయాణానికి ఉపయోగించేవారు. కానీ ఫ్యూచర్ లో మిస్ అయిన ట్రైన్ గత కాలంలో కనపడటం విచిత్రం.ఆ సమయంలో బ్రతికి ఉన్న వారు ఈ సంఘటనని రాసి ఉంచినందుకు తరవాత ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.  

ఇంతేకాదు ఈ ట్రైన్ జర్మనీ, రోమానియా, ఇటలీ లోని వివిధ ప్రాంతాలలో పట్టాలపై ప్రయాణించినట్లు కూడా రికార్డ్స్ ఉన్నాయి.

అలాగే ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బంధువులు పాత రికార్డ్స్ లను చూసినప్పుడు 1840 సంవత్సరంలో జరిగిన ఇంకొక  విచిత్ర విషయం తెలిసింది. 

1840 వ సంవత్సరంలో Mexico లోని ఒక హాస్పిటల్ రికార్డు లో 104 మంది మానసిక సమస్యతో భాదపడుతూ అడ్మిట్ అయ్యారనే విషయం తెలిసింది. 

వీరిని సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) ట్రీట్మెంట్ చేస్తున్నపుడు మొత్తం 104 మంది ఆ డాక్టర్ తో “తాము జనెట్టి ట్రైన్ లో ప్రయాణించి ఇక్కడికి వచ్చామని” చెప్పారు.    

మొత్తం 104 ఒకటే మాట చెప్పటం అక్కడి డాక్టర్స్ మరియు నర్సు లకు విచిత్రం అనిపించింది. 1840 లో అడ్మిట్ అయిన ఒకరి వద్ద 1907 కు చెందిన ఒక సిగెరెట్ డబ్బా కూడా కనిపించింది. ఆ సిగరెట్ బాక్స్ ఇప్పటికి మెక్సికో మ్యూజియం లో ఉందని అంటారు.  ఆ హాస్పిటల్ తర్వాత ఆ పేషెంట్స్ ఎక్కడికి వెళ్లారనేది అనే దానికి రికార్డ్స్ లేవు. 

ఇదంతా చదువుతున్న ప్రయాణికుల బంధువులకు చాలా విచిత్రం అనిపించింది, ఎందుకంటే మొత్తం 106 మంది ప్రయాణికులలో ఇద్దరు దుంకగా మిగిలింది కేవలం 104 మంది, కానీ వీరు 1911 సంవత్సరం నుంచి 1840 సంవత్సరం లోకి ఎలా వెళ్లారనేది ఒక మిస్టరీ.

ట్రైన్ మాయమై 44 సంవత్సరాలు గడిచిన తరవాత 1955 లో ఉక్రెయిన్ లోని ఒక చిన్న పట్టణంలో డ్యూటీ లో ఉన్న రైల్వే ఉద్యోగి కి 1911 సంవత్సరంలో నడిచే పాత మోడల్  ట్రైన్ ఒకటి కనిపించింది. ఈ ట్రైన్ పట్టాలపై నుంచి మెల్లగా నడుస్తూ వెళుతుంది, ఆ ట్రైన్ లో డ్రైవర్ లేడు ఇంకా curtains వేసి ఉన్నాయి మరియు డోర్స్ తెరిచి ఉన్నాయి.

తరవాత తాను చూసిన ట్రైన్ 1911 లో మిస్ అయిన జానెట్టి ట్రైన్ ఒక్కటే అని తెలిసింది. 1991 లో ఇదే ట్రైన్ ను యూరోప్ కు చెందిన క్రిమియా లో కూడా చూడటం జరిగింది.

ఇదంతా వింటున్న మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ నిజానికి ఆ ట్రైన్ ఏమైంది అనేది ఇప్పటికి ఒక మిస్టరీ.

కొంత మంది వాదనల మేరకు  ట్రైన్ ట్రయిల్ రన్ ఉన్న రోజు లంబాడి మౌంటెన్ వద్ద భూకంపం వచ్చిందని ఫలితంగా ఆ ట్రైన్ దట్టమైన పొగలోకి వెళ్ళినప్పుడు టైం ట్రావెల్ చేసిందని మరియు సమయం యొక్క చక్రంలో ఇరుక్కుపోయింది అని అందుకే కొన్ని సార్లు ఫ్యూచర్ లో మరి కొన్ని సార్లు గతంలో కనిపించింది అని అంటారు.

మరి ఈ స్టోరీ కి గట్టి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు అని మాత్రమే చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *