
37 సంవత్సరాల తరవాత తిరిగి వచ్చిన flight 914 స్టోరీ
జులై 2, 1955వ సంవత్సరంలో న్యూయార్క్ సిటీ నుంచి ఫ్లైట్ 914 టేక్ ఆఫ్ అవుతుంది. ఈ ప్లేన్ లో సిబ్బంది కలిపి మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్లేన్ న్యూయార్క్ నుంచి మియామీ గుండా వెళ్తూ ఫ్లోరిడా చేరుకోవాలి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే రాడార్ నుంచి కనిపించకుండా మాయం అయ్యింది.
ప్లేన్ కోసం వెతకడం కూడా మొదలుపెట్టారు కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. అధికారులు మాత్రం భూమి పై ప్లేన్ క్రాష్ అయ్యి ఉంటె దొరికి ఉండేదని బహుశా సముద్రం లో ప్లేన్ క్రాష్ అయ్యినందుకు ఆచూకీ లభించలేదని ప్రకటించారు.
విమానంలో ప్రయాణిస్తున్న 57 మంది చనిపోయారని కూడా అధికారికంగా ప్రకటించారు.
టైం ని ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే మార్చ్ 9 1985వ సంవత్సరంలో, కొన్ని థియరీస్ ప్రకారం 1992 సంవత్సరంలో వెనుజుల రాజధాని అయిన కారాకస్ లో 57 మంది తో ప్రయాణిస్తున్న విమానం 37 సంవత్సరాల తరవాత మళ్ళీ కనిపించింది.
కారకాస్ రాడార్ లో ఫ్లైట్ 914 అకస్మాత్తుగా కనిపించగా అక్కడున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దానిని దగ్గరగా గమనించగా అది ఫ్లైట్ 914 అని గుర్తించారు.
కారకాస్ విమానాశ్రయ రేడియో కి ఒక శబ్దం వినిపిస్తుంది “మనము ఎక్కడ ఉన్నాము” అని, ఈ మాటలు జూఆన్ అనే వ్యక్తి విన్నాడు. విమానం లోని పైలట్ తాను ఏటీసీ కి కనెక్ట్ అయిన సంగతి గ్రహించి “మేము ఫ్లైట్ 914 లో 57 మంది ప్రయాణికుల తో మియామీ కి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు జులై 2 , 1955 న చేరుకోవాలి అని చెప్పాడు” జూఆన్ దీనికి బదులుగా మీరు 1992 వ సంవత్సరం లో ఉన్నారని చెప్పగా పైలట్ భయానికి గురవుతాడు.
పైలట్ వెంటనే విమానాన్ని టేక్ ఆఫ్ చేసి ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్ళిపోయాడు.
కొన్ని థియరీల ప్రకారం పైలట్ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న సైజు 1955 కేలండర్ ప్లేన్ నుంచి బయటికి విసిరాడు.
ఈ ప్లేన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోని మియామీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిందని అక్కడి నుంచి ప్రయాణికులందరూ తమ తమ ఫ్యామిలీ మెంబెర్స్ ను కలిసారని కొన్ని వాదనలు ఉన్నాయి.
37 సంవత్సరాలు గడిచిన ప్రయాణికుల వయసు మాత్రం పెరగలేదని 37 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారని కూడా వాదనలు ఉన్నాయి.
ఈ స్టోరీ నిజామా కాదా అని ఇప్పటికి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు, చాలావరకు అందరి ఈ స్టోరీ మొత్తం ఫేక్ అని నమ్ముతారు.
అసలు ఈ స్టోరీ న్యూస్ లోకి ఎలా వచ్చింది ?
ఆ రోజులలో Weekly World News అనే వార్త పత్రిక దీనిని ప్రచురించిన తరవాత అందరు దీని గురించి మాట్లాడటం ప్రారంభించారు.
Weekly World News ఇంతకు ముందు కూడా ఇలాంటి చాలా ఫేక్ స్టోరీస్ ను పబ్లిష్ చేసిందని ఆరోపణనలు ఉన్నాయి, అందుకే ఈ పత్రిక ను ఎవ్వరు కూడా సాధారణంగా నమ్మరు.
మరోవైపు కొంత మంది టైం ట్రావెల్ నిజమని, ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తరవాత ఒక పోర్టల్ లో ప్రవేశించి భవిష్యత్తు లో కి ట్రావెల్ చేసిందని నమ్ముతారు.
అంతరిక్షంలోని కొన్ని ప్రదేశాలలో టైం చాలా నెమ్మదిగా కదులుతుంది, అందుకే 37 సంవత్సరాలు గడిచిన ప్రయాణికుల వయస్సు మారలేదు.
వికీతెలుగు అభిప్రాయం :
థియరీస్ ప్రకారం టైం ట్రావెల్ సాధ్యం మరియు బ్లాక్ హోల్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండటం వల్ల టైం స్లో గా ఉంటుందని కూడా రుజువు అయ్యింది. సైన్స్ పరంగా టైం ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఫ్లైట్ 914 నిజంగా టైం ట్రావెల్ చేసిందా ? దీనికి ఎలాంటి అధికారిక ప్రకటన వెనెజులా ప్రభుత్వం కానీ లేదా అమెరికా ప్రభుతవం కానీ ఇవ్వలేదు.
అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రుజువు లేకుండా ఇది నిజంగా జరిగిందని చెప్పలేము కావున మా అభిప్రాయం ఇదంతా ఒక పెద్ద ఫేక్ స్టోరీ.
మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారు ? దయచేసి కామెంట్స్ లో నాకు చెప్పండి.