
డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ని హాస్పిటల్ లోనే రేప్ చేసి చంపిన ఆర్ జె కర్ హాస్పిటల్ యొక్క స్టోరీ
ఆగస్టు 10 వ తేదీ ఉదయం ఆరు గంటల సమయంలో కలకత్తా లో ఉన్న ఆర్ జి కర్ హాస్పిటల్ లోని మూడవ అంతస్తులో ఉన్న ఒక సెమినార్ హాల్ లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్ డాక్టర్ శవం కనిపిస్తుంది. ఈ శవం ను చూడగానే ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది.
ఈ హాస్పిటల్ స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది. అప్పుడు ఇది వేరే పేరు తో ఉండేది కానీ ప్రస్తుతం ఇది రాధా గోబిందా కర్, షార్ట్ గా ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనే పేరు తో పిలువబడుతుంది.
ప్రతి హాస్పిటల్ లో డాక్టర్లు షిఫ్టుల ప్రకారం పనిచేస్తారు అంటే ఉదయం పనిచేసే డాక్టర్స్ ఉంటారు అలాగే రాత్రి పనిచేసే డాక్టర్లు కూడా ఉంటారు.
ఆర్ జి కర్ హాస్పిటల్ లో కూడా రాత్రి పనిచేసే డాక్టర్లలో మహిళా ట్రైనీ డాక్టర్లు కూడా ఉన్నారు.
ఆగస్టు 8 వ తేదీన డ్యూటీ లో ఉన్న మహిళా ట్రైనీ డాక్టర్ గత 36 గంటల నుంచి డ్యూటీ లో ఉంది. అలిసి పోయి ఉండటం వల్ల రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
సాధారణంగా డాక్టర్స్ అలిసిపోయినప్పుడు సెమినార్ హాల్ మరియు ఆ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకునేవారు.
ఆగస్టు 8 వ తేది రాత్రి మహిళా ట్రైనీ డాక్టర్ తన కన్నా ఒక సంవత్సరం జూనియర్ అయిన ఇద్దరు మేల్ జూనియర్ డాక్టర్లతో కలిసి సెమినార్ హాల్ కి వెళుతుంది.
ఆ రోజు ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో యొక్క పోటీ నడుస్తుంది. ఇండియా మరియు పాకిస్తాన్ చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
ఈ పోటీ ను లైవ్ గా చూడటానికి ముగ్గురు డాక్టర్లు సెమినార్ హాల్ కి వెళతారు. మ్యాచ్ అయిపోయిన తరవాత మహిళా డాక్టర్ సెమినార్ హాల్ లోనే రెస్ట్ తీసుకుంటారు. మిగతా ఇద్దరు జూనియర్ డాక్టర్లు సెమినార్ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్ లో వెళ్లి పడుకుంటారు.
ఈ సెమినార్ హాల్ లో కూర్చోడానికి కుర్చీలు ఉండేవి అలాగే రెండు మూడు బెడ్స్ కూడా ఉండేవి.
కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిన ట్రైనీ డాక్టర్ ఉదయం వరకు తిరిగి రాలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బెడ్ పై అర్ద నగ్నంగా ఉన్న ఒక బాడీ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా ఆ బాడీ కళ్ళలో నుంచి మరియు పెదాల నుంచి రక్తం వస్తుంది.
బాడీ ఎవరిదీ అని జాగ్రత్త గా చూసినప్పుడు అదే హాస్పిటల్ కి చెందిన ట్రైనీ డాక్టర్ కి చెందినది అని తెలుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది సైతం షాక్ కి గురవవుతారు.
డాక్టర్స్ వచ్చి ఆ ట్రైనీ డాక్టర్ పల్స్ చెక్ చేస్తారు,చనిపోయిందని నిర్ధారిస్తారు. జరిగిన విషయాన్ని హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ సందీప్ గోష్ కి కాల్ చేయాలని నిర్ణయించుకుంటారు.
7 గంటల ప్రాంతంలో ఆ ఆర్ జి కర్ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్ కి కాల్ చేయటం జరుగుతుంది.
ప్రిన్సిపాల్ 8 గంటల సమయంలో హాస్పిటల్ చేరుకుంటాడు. అక్కడికి వచ్చి క్రైమ్ సీన్ చూసిన రెండు గంటల తరవాత 9 గంటల ప్రాంతంలో పోలీసులకు కాల్ చేసి జరిగింది చెబుతాడు. ఈ ఒక గంట ప్రిన్సిపాల్ ఏమి చేసాడు అనేది ప్రశ్న, పోలీసులకు తెలియజేయడానికి ఒక గంట ఎందుకు పట్టింది.
ఈ రెండు గంటల సమయంలో హాస్పిటల్ లో ఉన్న వారు సెమినార్ హాల్ కి వచ్చి డెడ్ బాడీ ను చూస్తారు. ఆ సెమినార్ హాల్ లో ఉన్న సాక్ష్యాలు అన్ని నాశనం అవుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా సెమినార్ హాల్ ని సీల్ చేయాలని అనుకోరు. అందరు చెప్పులతో అక్కడికి రావటం మరియు అక్కడి వస్తువులను పట్టుకోవటం టచ్ చేయటం వల్ల ముఖ్యమైన ఎవిడెన్స్ లు నాశనం అయ్యాయి.
ఎట్టకేలకు ప్రిన్సిపాల్ పోలీసులకు ఇన్ఫర్మ్ చేసిన తరవాత పోలీసులు అక్కడికి చేరుకుంటారు. క్రైమ్ సీన్ ను సీల్ చేస్తారు, అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారించటం మొదలుపెడతారు.
ఆ బాడీ పరిస్థితి చుస్తే ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేసారు అని తెలుస్తుంది.
వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడటం ప్రారంభిస్తారు. జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ లోపలికి వెళ్లిన తరవాత ఎంతమంది ఆ హాల్ లో వెళ్లారో చూడటం ప్రారంభించారు.
ఆ సమయంలో పోలీసులకు ఎదురైన సమస్య ఏమిటంటే సెమినార్ హాల్ బయట కానీ లోపల కానీ సీసీటీవీ కెమెరా లేదు.
ఆ సెమినార్ హాల్ కి వెళ్లే దారిలో మాత్రమే ఉంది. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చుసిన పోలీసులకు అటువైపు వెళ్ళింది అందరు హాస్పిటల్ కి చెందిన సిబ్బంది అని గమనిస్తారు. కాన ఒక్క వ్యక్తి మాత్రం హాస్పిటల్ సిబ్బంది కి చెందిన వాడు కాదు అని పోలీసులు గుర్తిస్తారు. ఇతను రాత్రి 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్ళటం పోలీసులు గమనిస్తారు.
పోలీసులు ఆ వ్యక్తి గురించి అడగగా అతని పేరు సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. ఇతను ఒక సివిక్ వాలంటీర్ మరియు పోలీసుల కోసం పని చేస్తాడని అని తెలుస్తుంది. సివిక్ వాలంటీర్ అంటే సులువు భాషలో పోలీసులకు అవసరం అనిపించినప్పుడు వాళ్లకు సహాయం చేసేవారు అని చెప్పవచ్చు.
సంజయ్ రాయ్ వాలంటీర్ కావటం వల్ల రాత్రి సమయాలలో అక్కడి పేషెంట్స్ కలిసేవాడని తెలుస్తుంది.
ఇక పోలీసులు అనుమానించటానికి బయటివారు ఎవ్వరు లేరు.అదృష్టవశాత్తు క్రైమ్ సీన్ నుంచి పోలీసులకు నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు దొరుకుతాయి. ఈ నెక్‌బ్యాండ్ తప్పకుండ రేపిస్ట్ దే అయ్యి ఉంటుందని విచారించటం మొదలుపెడతారు.
4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లిన అందరిని పిలిచి విచారిస్తారు. అలాగే నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను కనెక్ట్ చేసి చూస్తారు. అక్కడ ఉన్న ఏ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు.
సంజయ్ రాయ్ ని పిలిచి విచారించినప్పుడు నెక్ బ్యాండ్ సంజయ్ రాయ్ ఫోన్ తో కనెక్ట్ అవుతుంది.
పోలీసులకు విషయం అర్థం అవుతుంది. పోలీసులు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్ వైపు వెళ్ళేటప్పుడు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్ ఉంది కానీ బయటికి వచ్చే సమయంలో లేదు.
మిగతా హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ వైపు వెళ్లి వేరే అంతస్తులకి లేదా వేరే రూమ్స్ కి వెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే చాలా సేపు తరవాత సెమినార్ హాల్ నుంచి బయటికి వచ్చినట్లు గమనిస్తారు.
పోలీసులు సంజయ్ రాయ్ ని వెతకటం ప్రారంభిస్తారు. సంజయ్ రాయ్ పోలీసుల బ్యారక్ లోనే పడుకొని ఉన్నాడని తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. సంజయ్ తన షూస్ మరియు బట్టలు కడిగి ఆరవేసి పడుకున్నట్లు పోలీసులు గమనిస్తారు.
పోలీసులు సంజయ్ రాయ్ షూస్ ని చెక్ చేసినప్పుడు రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేస్తారు.
ఇంతకీ సంజయ్ రాయ్ ఎవరు ? ఎలాంటివాడు ? ఇతని స్టోరీ ఏమిటి ?
సంజయ్ రాయ్ పోలీసుల కోసం ఒక సివిక్ వాలంటీర్ లాగా పనిచేసేవాడు. పోలీసుల కోసం పనిచేస్తూ ఆర్ జి కర్ హాస్పిటల్ లో బెడ్స్ దొరకకుండా సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి డబ్బులు తీసుకొని హాస్పిటల్స్ లో బెడ్స్ మరియు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు.
సంజయ్ ఒక మాములు సివిక్ వాలంటీర్ అయినప్పటికీ తను పోలీసు డిపార్ట్మెంట్ కి చెందినవాడు అని చెప్పుకునేవాడు. రాత్రి సమయాలలో కూడా పోలీసుల కోసం కేటాయించిన పోలీస్ బ్యారక్ లలో పడుకునే వాడు. సివిక్ వాలంటీర్ కావటంతో పోలీసులు కూడా ఏమీ అనకపోయేవారు.
ఆగస్టు 8 వ తేదీన కూడా రాత్రి తాను అడ్మిట్ చేసిన పేషెంట్స్ ను చుడటానికి హాస్పిటల్ లోపలికి వెళతాడు. కాసేపు తరవాత ఇంకొక సివిక్ వాలంటీర్ తో కలిసి హాస్పిటల్ బయటికి వస్తాడు.
ఇద్దరు కలిసి హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియా కి వెళతారు. సంజయ్ రాయ్ బయటే ఉండగా రెండవ సివిక్ వాలంటీర్ మాత్రం లోపలి వెళ్లి వస్తాడు.
అక్కడినుంచి ఇద్దరు బయటికి వచ్చిన తరవాత ఇంకొక రెడ్ లైట్ ఏరియా కి కూడా వెళ్తారు. ఈ సారి కూడా సంజయ్ రాయ్ బయటే ఉంటాడు, తనతో పాటు ఉన్న ఇంకొక సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్లి వస్తాడు.
ఇద్దరు బయటికి వచ్చే సమయంలో ఒక మహిళ ను చూసి సంజయ్ రాయ్ అసభ్య కరమైన కామెంట్స్ చేస్తాడు. ఆ మహిళ కూడా రెడ్ లైట్ ఏరియా కి చెందింది అని సంజయ్ అనుకుంటాడు. మహిళ జవాబుగా సంజయ్ ను తిడుతుంది.
ఈ ఇద్దరు తిరిగి హాస్పిటల్ కి వెళతారు, హాస్పిటల్ వెనక భాగం ఖాళీగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లి మందు తాగుతారు. మందు తాగుతూ సంజయ్ రాయ్ పోర్న్ వీడియో లు కూడా చూస్తాడు.
కాసేపు అయిన తరవాత సంజయ్ తో పాటు ఉన్న వ్యక్తి బైక్ టాక్సీ బుక్ చేసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
ఒంటరిగా ఉన్న సంజయ్ రాయ్ 4 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోపలికి వెళతాడు.
హాస్పిటల్ లోపల ఉన్న సెమినల్ హాల్ లో పడుకుందామని మూడవ అంతస్తుకి వెళతాడు.
అక్కడ ఉన్న కుర్చీలలో కుర్చుంటుండగా అక్కడే మహిళా ట్రైనీ డాక్టర్ కూడా పడుకొని ఉన్నట్లు గమనిస్తాడు.
మత్తులో ఉండటం మరియు పోర్న్ వీడియోస్ చూసి వచ్చిన సంజయ్ కి జూనియర్ డాక్టర్ ను చూడగానే బుద్ది మారుతుంది.
సంజయ్ రాయ్ జూనియర్ డాక్టర్ ను రేప్ చేయాలని వెళ్ళినప్పుడు డాక్టర్ కి మరియు సంజయ్ కి మధ్య ఘర్షణ జరుగుతుంది.
ఈ ఘర్షణలో సంజయ్ జూనియర్ డాక్టర్ కళ్లద్దాల పైన దాడి చేయటం వల్ల కళ్ళ నుంచి రక్తం వస్తుంది. అలాగే పెదాల నుంచి మరియు శరీరం లోని వివిధ భాగాల నుంచి రక్తం కారుతుంది.
గొంతు గట్టిగా నులిమి చంపేయడం వల్ల గొంతులోని ఎముకలు విరిగిపోతాయి. అలాగే ఒక చేయి మరియు ఒక కాలు కూడా విరిగిపోతుంది.
సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఆ మహిళా ట్రైనీ డాక్టర్ ను అతి క్రూరంగా రేప్ చేసి బాడీ ను అనుమానం రాకుండా ఒక బెడ్ పై పడుకోబెడతాడు.
బెడ్ పై పడుకోబెట్టేటప్పుడు డాక్టర్ చేతిని కళ్ళకు అడ్డంగా పెడతాడు. ఎవరైనా చూస్తే డాక్టర్ పడుకుంటుంది అని అనుకోవాలని సంజయ్ రాయ్ ఇలా చేస్తాడు.
అక్కడినుంచి బయటకు వచ్చి రక్తం అంటిన బట్టలను మరియు షూస్ లను కడిగి పోలీసు బ్యారక్ లో పడుకుంటాడు.
జూనియర్ డాక్టర్ చనిపోయిందని తెలిసిన తరవాత ఆమె తల్లి తండ్రులకు వెంటనే తెలియజేయరు.
దాదాపు 11 గంటల సమయంలో తల్లి తండ్రులకు కాల్ చేసి మీ కూతురు ఆరోగ్యం బాలేదు హాస్పిటల్ కి రమ్మని పోలీసులకు చెబుతారు. తల్లి తండ్రులు తిరిగి కాల్ చేసి తన కూతురికి ఏమైందని అడుగుతారు. మీ కూతురు సూసైడ్ చేసుకుంది త్వరగా రమ్మని చెబుతారు.
తల్లితండ్రులు వెంటనే హాస్పిటల్ కి వస్తారు తమ కూతురుని చూడాలని వేడుకుంటారు కానీ తన కూతురు శవాన్ని మాత్రం చూడటానికి అనుమతి ఇవ్వరు. ఆగష్టు 9 వ తేదీ సాయంత్రం తల్లి తండ్రులకు శవాన్ని చూడటానికి అనుమతి ఇస్తారు.
అదే హాస్పిటల్ లో మహిళా ట్రైనీ డాక్టర్ యొక్క పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ తరవాత ఇది రేప్ లేదా గ్యాంగ్ రేప్ అని తెలుసుకోవటానికి డిఎన్ఏ టెస్ట్ చేయటానికి ఫోరెన్సిక్ టీం కి ఇవ్వటం జరుగుతుంది.
మరోవైపు ఆ హాస్పిటల్ స్టాఫ్ జరిగిన రేప్ అండ్ మర్డర్ కి వ్యతిరేకంగా నిరసనలు చేయటం మొదలుపెడతారు.
మొదట మీడియా కవరేజ్ అంతగా రాదు కానీ ఒక్క రోజు గడిచిన తరవాత జరిగిన ఘోరం మీడియా ద్వారా ప్రపంచానికి తెలుసుతుంది.
దేశమంతటా నిరసనలు మొదలవుతాయి. చివరికి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఒక వారం లో సంజయ్ రాయ్ కి ఉరి శిక్ష పడే విధంగా చేస్తామని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.
దేశమంతటా నిరసనలు ఎక్కువగా కావడం వల్ల కోర్టు ఈ కేసును పోలీసుల నుంచి తీసుకొని సిబిఐ కి అప్పజెబుతుంది.
ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారిస్తుంది. కోర్టు హియరింగ్ కూడా ప్రస్తుతం లైవ్ గా చేయడం జరిగింది.
మన దేశంలో ఇప్పటి వరకు అనేక రేప్ కేసులను మనం చూసాం మరియు విన్నాం, ప్రతిసారి ఇంతకన్న ఘోరంగా ఎం జరుగుతుందిలే అని అనుకునే సరికి ముందు జరిగిన క్రైమ్ కన్నా ఇంకా భయంకరమైన క్రైమ్ జరుగుతుంది.
మన చుట్టూ ఉన్న చిన్న పాపలను, అమ్మాయిలను మరియు మహిళలను మనం మన ఫ్యామిలీ కి చెందిన వారు అని రక్షణ కలిపించటం ప్రారంభించినప్పుడు ఇలాంటి క్రైమ్స్ ను తగ్గించవచ్చు.