
డి.బి కూపర్ హైజాక్ స్టోరీ – D.B cooper plane hijack story in Telugu
మనం మన జీవితంలో చాలా చోరీ కి సంబంధించిన కథలను విని ఉంటాము. కానీ ఈ రోజు నేను చెప్పబోయే కథ వింటే మీరు షాక్ కి గురవుతారు.
ఈ కథలో డబ్బులు దొంగిలించిన దొంగ ఇంత వరకు దొరకలేదు. అసలు ఆ దొంగ ఎవరు ఏ దేశానికి చెందిన వాడు అనేది ఇప్పటికి మిస్టరీ.
1971 నవంబర్ 4 రోజున ఒక మధ్య వయసు కలిగిన వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాలు, సూట్ మరియు టై వేసుకొని పోర్ట్ లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ఒక బ్రీఫ్ కేసు తో వస్తాడు. ఈ వ్యక్తి తన పేరు డాన్ కూపర్ అని చెప్పి నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్ లైన్స్ లో ఒక టికెట్ కొనుక్కుంటాడు. ఈ టికెట్ సియాటెల్ వెళ్ళడానికి తీసుకున్నాడు. ఈ ప్రయాణం కేవలం 30 నిముషాలు ఉంటుంది.
టికెట్ తీసుకున్న కూపర్ 18C సీట్ లో కూర్చుంటాడు. కూపర్ కూర్చున్న కాసేపటి తర్వాత విస్కీ మరియు సోడా ఆర్డర్ చేస్తాడు.
కూపర్ కూర్చున్న ఫ్లైట్ 305 మధ్యాహ్నం 2:50 నిమిషాలకు టేక్ ఆఫ్ చేసిన తరవాత కూపర్ ఫ్లైట్ అటెండెంట్ (Florence Schaffner) ను పిలిచి ఒక పేపర్ నోట్ ఇస్తాడు.
ఫ్లైట్ అటెండెంట్ మాత్రం కూపర్ తనని ఫ్లర్ట్(Flirt) చేస్తున్నాడని, ఈ పేపర్ నోట్ లో తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాడని అనుకున్న తాను ఆ పేపర్ నోట్ చూడకుండా తన బ్యాగ్ లో వేసు కుంటుంది.
ఈ విషయం గ్రహించిన కూపర్ అటెండెంట్ ను పిలిచి మెల్లగా ” మిస్, మీరు నా పేపర్ నోట్ చుస్తే మంచిది ఎందుకంటే నా వద్ద బాంబు వుంది” అని అంటాడు.
ఈ విషయం విన్న తరవాత ఫ్లైట్ అటెండెంట్ ఒకసారి బాంబు చూపించాలని అడిగింది. కూపర్ తన బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి బాంబు ని చూపించాడు. బాంబు చూపించిన తరవాత కూపర్ తన 3 డిమాండ్లను పూర్తి చేయాలనీ చెప్పాడు. 1) $200,000 డాలర్లు అది కూడా 20 $ డాలర్ల నోట్లు మాత్రమే ఉండాలని చెప్పాడు. 2) 4 పారాచూట్ కావాలని చెప్పాడు. 3) సియాటెల్ లో దిగిన తరవాత ఫ్యూయల్ ట్రక్ అక్కడ రెడీ గా ఉండాలని చెప్పాడు.
ఏ విమానమైన ప్రయాణానికి ఎంత అవసరమైన ఫ్యూయల్ కావాలో అంతే నింపుకొని ప్రయాణిస్తుంది.
కూపర్ చూపించిన బాంబు గురించి మరియు మూడు డిమాండ్లను ఫ్లైట్ అటెండెంట్ పైలట్ కు తెలియజేస్తుంది. పైలట్ సియాటెల్ లోని అధికారులకు ప్లేన్ హైజాక్ అయిన సంగతి తెలియజేస్తాడు. ఈ విషయం విన్న వెంటనే ఫెడరల్ అధికారులు విమానాశ్రయనికి చేరుకుంటారు. అటు ప్రభుత్వం కూడా కూపర్ అడిగిన డబ్బు ను సమకూర్చడానికి అనుమతి ఇస్తుంది.
అక్కడ ఉన్న బ్యాంకుల సహాయం తో 20 డాలర్ల నోట్లు కలిగిన 200,000$ డాలర్ల డబ్బును ఏర్పాటు చేయటం మొదలుపెడతారు.
ప్లేన్ లో ఉన్న మిగతా పాసెంజర్లకు మాత్రం హైజాక్ అయిన విషయం తెలియదు. మిగతా పాసెంజర్లకి టెక్నికల్ ఇష్యూ ఉన్నందుకు ఫ్లైట్ ఆలస్యం అవుతుందని చెప్పారు.
ఇదంతా జరుగుతున్నసమయంలో కూపర్ మాత్రం ఏమి జరగటం లేదన్నట్టు చాలా కూల్ గా నర్వస్ అవ్వకుండా అందరితో మాట్లాడుతున్నాడు.
సాయంత్రం 5:24 p.m కు డబ్బు రెడీ గా ఉందని కూపర్ కి తెలియజేస్తారు. 5:39 నిమిషాలకు ప్లేన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. కూపర్ పైలట్ తో ప్లేన్ ను అందరికి కనిపించేలా అన్ని ప్లేన్ లకు దూరంగా ఆపమని కోరుతాడు. ఫ్లైట్ లో ఉన్న అన్ని విండోస్ లను మూసివేయమని కోరుతాడు.
ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందని గ్రహించిన అధికారులు ఎయిర్పోర్ట్ మేనేజర్ చేతికి డబ్బులు మరియు పారాచూట్ ఇచ్చి పంపిస్తారు. డబ్బు అందిన తరవాత కూపర్ అందరు పాసెంజర్లను మరియు ఫ్లైట్ అటెండెంట్లను దిగి వెళ్ళమని కోరుతాడు.
ఫ్లైట్ లో ఫ్యూయల్ నింపేటప్పుడు కూపర్ పైలట్ తో తన ఎస్కేప్ ప్లాన్ చెప్తాడు. ఫ్లైట్ ను తక్కువ స్పీడ్ తో మెక్సికో నగరం వైపు నడపాలని, ఫ్లైట్ ఎత్తు కూడా 10,000 అడుగుల మాత్రమే ఉండాలని తన షరతులను చెప్పాడు. పైలట్ మాత్రం ఆ విమానం కేవలం 1600 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలదని మెక్సికో వరకు వెళ్లటం సాధ్యం కాదు అని చెప్పాడు. మధ్యలో ఇంకో స్టాప్ తీసుకోని ఫ్యూయల్ నింపుకోవాలని చెప్పగా కూపర్ సరే అని అన్నాడు.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లాండింగ్ గేర్స్ అలాగే ఉండాలని మరియు ఎగ్జిట్ డోర్ కూడా తెరిచి, మెట్లను దింపి ఉంచాలని చెప్పాడు.
ఈ విషయం విన్న అధికారులు ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి ఉంచడం సాధ్యం కాదు అని చెప్పారు. కూపర్ మాత్రం ప్రశాంతంగా సరే అని ఒప్పుకున్నాడు.
ఇవన్ని మాటలు కూపర్ మరియు పైలట్ ల మధ్య మాత్రమే జరుగుతున్నాయి. ఫెడరల్ అధికారులు మాట్లాడాలని అనుకున్న కూపర్ అనుమతి ఇవ్వటం లేదు. ఫ్యూయల్ నింపటం కాస్త ఆలస్యం అవ్వటం వల్ల రాత్రి 7:40 నిమిషాలకు కూపర్, ఇద్దరు పైలట్ లు, ఒక ఫ్లైట్ అటెండెంట్ మరియు ఒక ఇంజనీర్ ఇలా ఐదుగురు ఆ విమానం నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటారు.
విమానం గాలిలోకి ఎగిరిన తరవాత రెండు ఫైటర్ విమానాలు వెంబడించసాగాయి. ఒక ఫైటర్ విమానం పై నుంచి మరొక ఫైటర్ విమానం కింది నుంచి కవర్ చేస్తూ కూపర్ కు కనిపించకుండా వెళుతున్నాయి.
ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కూపర్ ఫ్లైట్ అటెండెంట్ ను కూడా కాక్ పిట్ లో మిగతా వాళ్ళతో వెళ్లి ఉండమని చెప్తాడు. కూపర్ మనీ బ్యాగ్ ను తన ఛాతి భాగంలో కట్టడం చుసిన ఫ్లైట్ అటెండెంట్ కాక్ పిట్ లోకి వెళ్లి పైలట్ లకు చెబుతుంది.
కూపర్ కు ఏమైనా సహాయం కావాలా అని అడగగా వద్దు అని చెప్పాడు. కాసేపటికి ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయి ఉందని వార్నింగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఫ్లైట్ ప్రెషర్ లో మార్పు వచ్చింది.
అనుకున్న ప్రకారంగా రెండవ ఫ్యూయల్ స్టాప్ కోసం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు నెవాడా ఎయిర్పోర్ట్ లో విమాన ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యి ఉండగానే ల్యాండ్ అవుతుంది.
ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫెడరల్ మరియు పోలీస్ అధికారులు విమానంని చుట్టు ముట్టరు. ఆ విమానం లో కూపర్ లేడు అనే సంగతి కాసేపటికే వారికి అర్థము అయ్యింది. కూపర్ పారాచూట్ సహాయం తో విమానం నుంచి కిందికి దూకేసాడు.
కూపర్ ఎస్కేప్ అయిన విషయం తెలుసుకున్న ఫెడరల్ అధికారులు వెతకటం మొదలుపెట్టారు. ఎంత వెతికిన కూపర్ కానీ అతను తీసుకున్న డబ్బు ఆచూకీ మాత్రం తెలియలేదు.
తనను చుసిన ఫ్లైట్ అటెండెంట్ల సహాయం తో స్కెచ్ గీశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 సంవత్సరాలు కూపర్ ని వెతికారు కానీ ఏమి ప్రయోజనం లభించలేదు.
ఈ 45 సంవత్సరాలలో ఎంతో మందిని అనుమానించారు కానీ కూపర్ ని మాత్రం పట్టుకోలేకపోయారు. అమెరికా హిస్టరీ లో ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం వెతకటం చాలా అరుదు.
ఇది డాన్ కూపర్ యొక్క కథ, మీకు ఈ కథ నచ్చినట్లైతే నాకు కామెంట్ చేసి చెప్పండి.