Codex Gigas story in telugu

కేవలం ఒక్క రాత్రిలో రాయబడ్డ ప్రపంచంలోని అతి భయంకర పుస్తకం డెవిల్స్ బైబిల్

హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో  మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ క్రైమ్ కి సంబంచింది కాదు కానీ ఖచ్చితంగా ఒక మిస్టరీ అని చెప్పవచ్చు.

మధ్యయుగం లో రాసిన అతిపెద్ద పుస్తకం డెవిల్స్ బైబిల్ గురించి మీకు చెప్పబోతున్నాను. దీనికి Codex Gigas అని ఇంకో పేరు కూడా ఉంది. Codex Gigas అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం. ఈ పుస్తకాన్ని ఒక డెవిల్ లేదా సైతాన్ రాసాడని అని అంటారు. ఈ పుస్తకం ఈ రోజు కూడా మ్యూజియం లో భద్రపరిచి ఉంది.   

ఈ పుస్తకం యొక్క పొడువు 92 సెంటి మీటర్లు, వెడల్పు 50 సెంటీమీటర్లు మరియు మందం 22 సెంటీమీటర్లు ఉంది.  

ఈ పుస్తకం యొక్క కవర్ కూడా దృడంగా చెక్క బోర్డు తో తయారు చేయబడ్డాయి. ఈ చెక్క బోర్డు ను లెదర్ కవర్ కప్పి ఉంటుంది. ఈ పుస్తకం యొక్క బరువు 75 కిలోలు ఉంటుంది.  ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే కనీసం ఇద్దరు కావాలి. 

కాల క్రమంలో పుస్తకంలో కొన్ని పేజీలు చింపేయబడ్డాయి, ఎవరు చింపారు ఎందుకు చిప్పారు అనే దానికి జవాబు మాత్రం లేదు. ప్రస్తుతం ఈ పుస్తకం లో 310 పేజీలు ఉన్నాయి, ఈ పుస్తకం లోని పేజీలు గాడిదల చర్మం తో చేయబడ్డాయి. ఈ పేజీల కోసం 160 గాడిదల చర్మాన్ని ఉపయోగించారని నిపుణులు అంచనా వేసారు. ఈ పుస్తకం రాయటానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం మరియు బంగారం లాంటి రంగులను ఉపయోగించారు. 

 సాధారణంగా ఇలాంటి పుస్తకాన్ని రాయటానికి 20 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇంకొంత మంది నిపుణులు 30 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం కేవలం ఒకటే రాత్రి లో రాయబడింది. 

ఈ పుస్తకం పై రీసెర్చ్ చేసిన వారు మాత్రం పుస్తకాన్ని ఒక్క రాత్రి లో రాయటం అసంభవం అని అన్నారు. 

ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు మరియు హ్యాండ్ రైటింగ్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఒకేలా ఉంటుంది. హ్యాండ్  రైటింగ్ ఒకటే లాగ ఉన్నప్పుడు కేవలం ఒక్కరే ఈ పుస్తకాన్ని రాసి ఉండాలి.   

ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది ఆ పుస్తకం లో ఏం రాసి ఉంది అలాగే ఈ పుస్తకాన్ని చదివితే ఏమైనా అవుతుందా అనే ప్రశ్నలకు సమాధానాం ఇవ్వబోతున్నాను.   

13 వ శతాబ్దం లో బొహేమియా ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి Herman the Recluse  ఉండేవాడు. ఈ సన్యాసి తాను ఉంటున్న మఠం యొక్క నియమాలను ఉల్లంగింస్తాడు.

ఒక సన్యాసి మఠం యొక్క నియమాలను ఉల్లంఘించటం ఒక పెద్ద నేరం. ఈ విషయం ఆ సమయంలో ఉన్న రాజు కి తెలుస్తుంది, నియమాలను ఉల్లంఘించినందుకు ఆ సన్యాసి ని బతికుండగానే సమాధి కట్టేయాలని ఆదేశిస్తాడు.

ఎలాగో మరణించబోతున్నానని తెలిసిన సన్యాసి తనకు ఒక్క అవకాశం ఇస్తే కేవలం ఒక్క రాత్రి లో మనుషులకు ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని నేను ఒక అద్భుత మైన పుస్తకంగా రాస్తాను. నా వల్ల పోయిన ఈ మఠం యొక్క పరువును ఈ పుస్తకం ద్వారా తీసుక వస్తాను, ఒకవేళ పూర్తి చేయలేకపోతే మీరు శిక్ష విధించండి అని రాజు కి సందేశం పంపుతాడు.

రాజు కూడా సరే అని అంటాడు ఉదయం వరకు సమయం ఇచ్చాడు. సన్యాసి పుస్తకం రాయటం మొదలుపెడతాడు అర్ధరాత్రి అవుతుంది కానీ పుస్తం కొంచెం కూడా పూర్తి అవ్వలేదు. ఈ పుస్తకం తాను కచ్చితంగా ఉదయం వరకు పూర్తి చేయలేను అన్న విషయం అర్థమయ్యింది. 

ఆ సమయంలో తాను ఒక ప్రత్యేక పూజ చేసాడు. ఈ పూజ దేవుడి కోసం చేయలేదు, సైతాన్ కోసం చేసాడు. పూజ తరవాత సైతాన్ అక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుత పుస్తకం రాయటంలో సహాయం చేయమని అడుగుతాడు. నా ఆత్మ కి బదులుగా ఈ పుస్తకాన్ని రాయమని సన్యాసి సైతాన్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. 

సైతాన్ సరే అని ఆ రాత్రి మిగిలిన కొన్ని గంటల వ్యవధి లోనే ఆ పుస్తకాన్ని రాసి ఇస్తాడు. ఇంతకీ ఆ పుస్తకంలో సైతాన్ ఏం రాసాడు ?

ఈ పుస్తకం యొక్క మొదటి రెండు పేజీలలో హీబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మిగతా పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాసి ఉంది.   

ఈ పుస్తకం లో ఎక్కువ భాగం బైబిల్ నే రాయటం జరిగింది. బైబిల్ కాకుండ ఒక పేజీ లో ఒక పక్క స్వర్గం లాంటి ఒక నగరం మరియు ఇంకో వైపు సైతాన్ బొమ్మ ఉంది. కొన్ని పేజీలు వైద్యానికి,మ్యాజిక్ ట్రిక్స్ మరియు భూతవైద్యం(exorcism) కి సంబంధించినవి గా ఉన్నాయి. 

ఈ పుస్తకం లో కొన్ని పేజీలు ఓల్డ్ లాటిన్ లో ఉండటం కారణంగా పూర్తిగా చదవలేదు. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఎదో ఒక చెడు జరుగుతుందని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. కొన్ని థియరీల ప్రకారం ఇది సైతాను ను గొప్పగా చూపించే పుస్తకం అని ఇల్ల్యూమినాటి అనే సంస్థ ఈ బుక్ లో ఉన్న రహస్య సందేశాలను ఫాలో అవుతుందని చెప్తారు.

నా అభిప్రాయం ప్రకారం ఈ థియరీలకు ఎలాంటి ప్రూఫ్ లేదు. కానీ ఈ పుస్తకం మాత్రం ఈ రోజు కూడా మ్యూజియం లో భద్రంగా ఉంది. 

సన్యాసి పుస్తకం రాసిన తరవాత కొన్ని సంవత్సరాలు అక్కడి మఠం లోనే ఈ పుస్తకం ఉండేది. ఆ తరవాత ఒక లైబ్రరీ లో ఈ పుస్తకాన్ని ఉంచారు. 1594 సంవత్సరంలో అప్పటి రాజు తన వద్ద ఒక మంచి కలెక్షన్ గా ఉండాలని ఈ పుస్తకాన్ని ఉంచుకున్నాడు.

ఆ తరవాత జరిగిన యుద్ధాల్లో స్వీడిష్ ఆర్మీ ఆ రాజు ను ఓడించి అక్కడి సంపదను తీసుకున్నారు. ఆ సమయంలో స్వీడిష్ ఆర్మీ మొదటి సారి ఆ పుస్తకాన్ని చూసింది. ఒక మనిషి కూడా ఎత్తలేని భారీ పుస్తకం అక్కడ ఉండటం చూసి తమ వెంట తీసుకెళ్లిపోయారు.   

ప్రస్తుతం ఈ పుస్తకం స్టాక్ హామ్ లోని నేషనల్ లైబ్రరీ అఫ్ స్వీడన్ లో భద్రపరిచి ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *