
ఎంతో మంది మిస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్ నుంచి బయటపడ్డ వ్యక్తి స్టోరీ – Bruce Gernon story
బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు ఎక్కడో ఒక చోట విని లేదా చూసి ఉంటారు. ఈ ట్రయాంగిల్ లో ఇప్పటికి వరకు ఎన్నో విమానాలు మరియు సముద్ర ఓడలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు, మన భూమి పై ఉన్న కొన్ని మిస్టరీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.
కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ లో ఒక వ్యక్తి ఈ ట్రయాంగిల్ నుంచి బతికి బయటపడ్డాడు.
1970 సంవత్సరం డిసెంబర్ 4 వ తారీకు బ్రూస్ గర్ణాన్ అనే వ్యక్తి సింగల్ ఇంజన్ తో తయారు చేయరు బడ్డ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆండ్రోస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడా కు బయలుదేరారు. వ్యాపార నిమిత్తం బ్రూస్ తరచు ఈ దారిలో వెళుతూ ఉండేవారు.
ఈ ప్రయాణానికి 90 నిమిషాలు పడుతుంది. బ్రూస్ ప్రయాణించే దారిలోనే బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఉంటుంది.
బ్రూస్ గర్ణాన్ ఎప్పటి లాగే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కాసేపు ప్రయాణించిన తరవాత ఆకాశంలో వెయ్యి ఫీట్ల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపిస్తాయి. ఆ దారిలో అప్పుడప్పుడు ఇలా మేఘాలు ఉండేవి కాబట్టి బ్రూస్ కి ఇదేమి కొత్త కాదు. ఆ నల్లటి మేఘాలు క్రమ క్రమంగా పెద్దగా అవ్వటం బ్రూస్ చూసాడు చివరికి ఎయిర్ క్రాఫ్ట్ మేఘాల గుండా ప్రయాణించి కాసేపటి తరవాత బయటికి వస్తుంది.
కాసేపు గడిచిన తరవాత పదకొండు వేళ ఫిట్ల ఎత్తుకు ఎయిర్ క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకూ ముందు కనిపించిన మేఘం కన్నా పెద్దగా మేఘం కనిపించింది. ఈ సారి కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘం గుండా వెళుతుంది. ఈ మేఘం ఒక సీలిండ్రికల్ షేప్ లో ఉంది.
ఆలా వెళుతున్నప్పుడు ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది, మెరుపులు లాంటివి కూడా కనిపించసాగాయి.వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపులలా కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కంటి వంతం చేసాయి.
బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయత్నిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్లే దారి కనిపించలేదు. కాసేపు గడిచిన తరవాత వెలుతురు కనిపించింది. మేఘాల నుంచి బయటికి వెళదామనే సరికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండే కంట్రోల్స్ పనిచేయటం ఆపేసాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతున్నట్టు బ్రూస్ గమనించాడు.
బ్రూస్ ప్రకారం ఆ మేఘాలలో నుంచి వెళుతున్నప్పుడు ఎదో అదృశ్య శక్తి అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిస్తున్నట్టు కనిపించింది.
ప్లేన్ లో కంట్రోల్స్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు ఒకవేళ కంట్రోల్స్ పనిచేయకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇదంతా చూస్తున్న బ్రూస్ కు భయమనిసిపించింది, ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటికి వచ్చే సమయంలో మేఘాలు మొత్తం దగ్గరికి అవ్వటం గమనించాడు. తన వద్ద కొంత సమయమే ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా ఆ మేఘాల నుంచి బయటికి వచ్చేసాడు.
మేఘాల నుంచి బయటికి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ను సంప్రదించగా తాము మయామి కి దగ్గరిలో ఉన్నారని తెలిసింది. ఇది విన్న బ్రూస్ కి నమ్మ బుద్ది అవ్వలేదు. ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం 45 నిమిషాలే అయ్యింది. అప్పుడే గమ్యానికి చేరుకున్నాడు, ఇదెలా సాధ్యం అని బ్రూస్ కంగారు పడ్డాడు.
గమ్యానికి చేరిన తరవాత తన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా చెక్ చేసాడు. ఆ ఇంధనం లో సగమే ఖర్చు అయ్యింది. ఇంకా సగం ప్రయాణం కోసం కావాల్సిన ఇంధనం కూడా అలాగే ఉంది.
బ్రూస్ యవ్వన వయసు నుంచే ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపేవాడు కాబట్టి బ్రూస్ ఒక ఎక్సపీరియన్స్ పైలట్ అని కూడా చెప్పవచ్చు.
బ్రూస్ ఎప్పటిలా కాకుండా ఈ సారి కేవలం సగం ఇంధనం తో 90 నిమిషాల ప్రయాణాన్ని 45 నిమిషాలలో పూర్తిచేసాడు. ఈ సంఘటనను పలువురు ఎక్స్పర్ట్స్ ను అడగగా వాళ్ళ వద్ద కూడా ఎం జరిగిందో అనే దానికి మాత్రం జవాబు లేదు.
కానీ బ్రూస్ మరియు ఇతరుల థియరీ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘాలలో ఉన్నప్పుడు worm hole ద్వారా టైం ట్రావెల్ చేసిందని చెప్పారు.
ఈ రోజు కి కూడా బ్రూస్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ సమయంలో ఎలా ప్రయాణించింది అనే దానికి ఎక్సప్లనేషన్ లేదు. ఇప్పటికి ఇది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఈ సంఘటన తరవాత బ్రూస్ తన తో జరిగిన ఘటనను పుస్తక రూపంలో రాసాడు.