Indian child serial killer

ప్రపంచం లోనే అతి తక్కువ వయసు కలిగిన సీరియల్ కిల్లర్ స్టోరీ

ఈ రోజు నేను  బీహార్ రాష్ట్రానికి చెందిన 8 సంవత్సరాల బాబు యొక్క సీరియల్ కిల్లింగ్స్ స్టోరీ చెప్పబోతున్నాను.

ఇప్పటి వరకు బహుశా ఇంత చిన్న వయస్సులో ఎవ్వరూ కూడా హత్యలు చేయకపోయి ఉండవచ్చు. ఈ స్టోరీ లో ఒక 8  సంవత్సరాల బాబు సీరియల్ హత్యలు ఎందుకు చేసాడో నేను మీకు చెప్పబోతున్నాను.    

బీహార్ లోని బెగుసరాయి అనే జిల్లాలోని ఒక గ్రామంలో కూలి పనులు చేసుకునే దంపతులకు ఇద్దరు సంతానం, ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి. అబ్బాయి పేరు అమరదీప్ సాదా 

అమరదీప్ సాదా 1998 సంవత్సరంలో జన్మించాడు. 2006 వ సంవత్సరంలో అమరదీప్ సాదా యొక్క 8 నెలల చిన్నాన్న కొడుకు (కజిన్) ను ఇటుకతో కొట్టి చంపేయటం జరుగుతుంది. ఈ కజిన్ యొక్క ఇల్లు అమరదీప్ ఇంటి నుంచి కాస్త దూరం లోనే ఉండేది.

8 నెలల బాబును ఎవరు చంపారు, ఆ బాబు వద్ద ఎవరు ఉన్నారు అని ఆరా తీయగా అమరదీప్ సాదా ఉన్నాడని తెలుస్తుంది.

అమరదీప్ తల్లి తండ్రులకు అమర్ దీపే ఈ హత్య చేసాడన్న విషయం అర్థం అయిపోయింది. తన కొడుకు హత్య చేసిన భయంకర నిజాన్ని వారు బయటికి చెప్పలేదు. రెండు ఫ్యామిలీలు కూడా ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పకుండా దాచారు.

వాళ్ళు చేసిన ఈ పెద్ద తప్పే మరిన్ని ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన జరిగి దాదాపు 6 నెలలు గడుస్తాయి, ఈ సారి అమరదీప్ యొక్క సొంత  6 నెలల చెల్లెలు ను కూడా ఇటుకతో చంపి వేయటం జరుగుతుంది. 

ఈ సారి కూడా అమరదీప్ సాదా నే సొంత చెల్లెలిని చంపేస్తాడు. తల్లి తండ్రులు ఈ విషయాన్ని కూడా దాచి పెడతారు. తమ ఫ్యామిలీ లో కేవలం ఆరు నెలల వ్యవధి లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను ఇంకొక చిన్నారిను ఇటుకతో కొట్టి చంపేస్తాడు. 

టైం ఇంకాస్త ముందుకు వెళుతుంది, 3 నెలలు గడిచిన తరవాత అమరదీప్ ఇంటి పక్కన కుష్బూ అనే ఒక చిన్న పాప ఉండేది. ఈ పాప వయసు దాదాపు ఒక సంవత్సరం ఉంటుంది. కుష్బూ తల్లీ పాపను పడుకోబెట్టి ఇంటి లోపలికి వెళుతుంది. తానూ వెళ్ళేటప్పుడు అమరదీప్ కూడా అక్కడ ఉన్న విషయాన్ని గమనిస్తుంది.

పనిపూర్తి చేసుకొని తిరిగి వచ్చినప్పుడు పడుకున్న కుష్బూ కనిపించదు. అమరదీప్ తో పాప గురించి అడగగా నవ్వటం మొదలుపెట్టాడు.

భర్త మరియు ఫ్యామిలీ వాళ్లకి చెప్పి కుష్బూ ను వెతకటం ప్రారంభిస్తారు కానీ ఆ పాప ఎక్కడ కూడా కనిపించదు. ఎంత వెతికిన దొరక పోవటం తో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.

 కుష్బూ తల్లీ పోలీసులకు అమరదీప్ ను ప్రశ్నించమని తనకు ఆ అబ్బాయి మీద అనుమానం ఉందని పదే పదే చెప్పగా సరే అని అమర్ దీప్ ను పిలవటం జరుగుతుంది.

అమరదీప్ పోలీసుల ముందు కూడా ఒకటే నవ్వుతున్నాడు. కుష్బూ గురించి అడగగా తనకు బిస్కెట్ ఇస్తే చెప్తాను అని అన్నాడు.

8 సంవత్సరాల బాబు ఏం చెప్తాడు అని పోలీసులు ఫార్మాల్టి కోసం అడుగుదాము అన్నట్టు బిస్కెట్ ఇచ్చి అడిగారు.  బిస్కెట్ తిన్న తరవాత ఇప్పుడు చెప్పు అని పోలీసులు అడగగా ఇటుకతో కొట్టి పాడుకోపెట్టాను అని అమరదీప్ చెప్పాడు. ఎక్కడ పడుకోపెట్టావు అని క్యాజువల్ గా అడగగా మల్లి బిస్కెట్ అని అడిగాడు.

బిస్కెట్ తిన్న తరవాత అమరదీప్ అక్కడే కొంచెం దూరంలో ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఇక్కడ పడుకోబెట్టాను అని చెప్తాడు. పోలీసులు అక్కడ ఒక గుంతను చెట్టు కొమ్మలతో కప్పి ఉంచటం చూసారు.

కొమ్మలని జరిపి చూడగా ఖుష్బూ శవం కనిపించింది. ఒక్కసారి పోలీసుల ఫ్యూజులు అవుట్ అయ్యాయి. పైగా అమరదీప్ నవ్వుతూనే ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకెవరినైనా ఇలాగె చంపావా అని అడగగా అవును అని ఇంతకు ముందు చంపిన ఇద్దరి పేర్లు అమరదీప్ చెప్తాడు. 

పోలీసులు ఈ హత్య వెనక కారణం తెలుసుకోవాలని అనుకున్నారు. అమరదీప్ తో ఈ ముగ్గురు పిల్లలను ఎందుకు చంపావు అని అడగగా వీళ్ళను కొట్టడం వారి రక్తాన్ని చూడటం నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు. 

ఈ మాట విన్న తర్వాత పోలీసులు అమరదీప్ ను డాక్టర్ కు చూపించగా అమరదీప్ మానసికంగా ఒక వ్యాధి తో బాధపడుతున్నాడని అందుకే పిల్లలను చంపటం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిసింది.   అమరదీప్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు సైలెంట్ గా ఉండేవాడు. పైగా అమరదీప్ కి తాను ఒక క్రైమ్ చేస్తున్నాని కూడా తెలియదు. కేవలం సంతోషం పొందటానికి ఈ హత్యలు చేసాడు.

చిన్న పిల్లలు క్రైమ్ చేసినప్పుడు వారికి ఒక సపరేట్ జైలు లో ఉంచుతారు. ఈ జైలులో అందరు మైనర్ లు మాత్రమే ఉంటారు. కానీ అమరదీప్ ను ఇతర పిల్లల తో ఉంచితే వారిని కూడా చంపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంచనా వేసారు.

ఇదంతా కోర్టులో వివరించి అమరదీప్ కు ఒక సపరేట్ రూమ్ ఇవ్వాలని కోరింది. ఆ తరవాత అమరదీప్ అక్కడ ఎన్నిరోజులు ఉన్నాడు ఎప్పుడు బయటికి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాలన్నీ చాలా గోప్యంగా ఉంచటం జరిగింది. 

బయటి వాళ్లకు అమరదీప్ గురించి తెలిస్తే వారు చేసే సూటి పోటి మాటలకు ఇంకా భయంకరంగా మారే అవకాశం ఉంటుందని ఈ జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది.

ప్రస్తుతం అమరదీప్ బహుశా జైలు నుంచి విడుదల అయ్యి తన కొత్త జీవితాన్ని ప్రారంభించి ఉంటాడు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *