Akku yadav Story in Telugu

కోర్టులో ఉన్న క్రిమినల్ అక్కు యాదవ్ ను 200 మహిళలు ఒకటే సారి దాడి చేసి చంపేసిన స్టోరీ

హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. మన సమాజంలో చాలా  రకాల క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. క్రైమ్ జరిగిన తరవాత క్రిమినల్స్ ను పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు. కానీ కొన్ని సార్లు పోలీసులు క్రిమినల్స్ పట్టుకో కుండా వారిని సపోర్ట్ చేస్తారు. 

అలాంటి సమయాలలో బాధితులు చట్టాన్ని తమ చేతులలోకి తీసుకొని క్రిమినల్స్ పై తమ కోపాన్ని చూపిస్తారు, కొన్ని సార్లు చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ అక్కూ యాదవ్ అనే క్రిమినల్ కి సంబంధించింది. ఈ స్టోరీ మహారాష్ట్ర లోని నాగపూర్ సిటీ కి చెందింది. 

నాగపూర్ లోని కస్తూర్బా నగర్ స్లమ్స్ లో అక్కు యాదవ్ పెరిగాడు. అక్కుయాదవ్ యొక్క అసలుపేరు భరత్ కాళీ చరణ్. 1972వ సంవత్సరంలో పుట్టిన యాదవ్ చిన్న తనం నేరాల బాట పట్టాడు. యాదవ్ యొక్క మొదటి క్రైమ్ 1991 లో చేసిన గ్యాంగ్ రేప్. 

కొంత కాలం లోనే గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని చిన్న పోకిరి నుంచి ఒక పెద్ద గుండా గా మారాడు. యాదవ్ తన క్రైమ్స్ ను ఎక్కువగా కస్తూర్బా నగర్ లోనే చేసే వాడు. అక్కడి వారు పేదవాళ్ళు అవ్వటం వల్ల వారి పై అమానుషంగా దాడి చేసేవాడు.

ఇళ్లపై దాడి చేయటం, మనుషులపై దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న డబ్బును లాక్కొనేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే అతి భయంకరంగా వారిని టార్చర్ చేసేవాడు. అక్కడే చిన్న కిరాణా షాపును నడిపే దంపతుల షాప్ నుంచి నచ్చిన సామాను తీసుకొని డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఎదురు తిరిగారంటే వారిని రేప్ చేసేవాడు. 

కస్తూర్బా నగర్ స్లమ్ లో ఉండే జనాల ప్రకారం దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిని అక్కు యాదవ్ రేప్ చేసాడు. అక్కు యాదవ్ చివరికి 10 సంవత్సరాల అమ్మాయి ని కూడా వదలలేదు. ఆ స్లమ్ లో 40 మంది మహిళలలను రేప్ చేసాడు.

అక్కు యాదవ్ వచ్చాడని తెలిస్తే అందరు ఇంట్లోనే ఉండేవారు. ఒక మహిళను ఇంటికి రాత్రి సమయం లో వెళ్లి వేరే పేరు చెప్పి బయటికి పిలిచాడు. తలుపు తెరిచిన ఆ మహిళను కడుపులో పొడిచి చెవులో ఉన్న కమ్ముల కోసం చెవులను కోసేశాడు. వేళ్ళకు ఉన్న ఉంగరాలు రావటం లేదని వెళ్ళాను కత్తిరించాడు.       

ఇలానే ఇంకో ఇంటికి ఉదయం 5 గంటలకు వెళ్లి నేను పోలీసును తలుపు తెరవమని చెప్పాడు. బయటికి వచ్చిన మనిషిని కత్తితో పొడిచి తన భార్యను ఈడ్చుకొని వెళ్లి రేప్ చేసాడు. 

బాజా వాయిస్తూ డబ్బులు సంపాదించే ఒక వ్యక్తి తనకు 100 రూపాయలు ఇవ్వలేదని అతనిని భయంకరంగా కొట్టాడు. 

ఇంతేకాదు కొత్తగా పెళ్ళైన అమ్మాయిను, కడుపుతో ఉన్న మహిళలను కూడా రేప్ చేసేవాడు. డెలివరీ అయ్యి 10 రోజులు గడిచిన ఒక మహిళను రేప్ చేయగా ఆ మహిళ కిరోసిన్ పోసుకొని చనిపోయింది.

యాదవ్ ఒక మహిళను అందరి ముందు రేప్ చేసి మర్డర్ చేసాడు. మర్డర్ చేసిన వారిని రైల్వే ట్రాక్స్ పై తీసుకెళ్లి పడేసేవాడు. 

ఇంత జరుగుతున్న పోలీసులు ఏంచేస్తున్నారు అని మీకు డౌట్ రావొచ్చు. కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరే ఎదో చేసి ఉంటారు అందుకే అలా జరిగింది అని చెప్పి పంపించేవారు. కొన్ని సార్లు అయితే నీకు అక్కుయాదవ్ కి ఎఫైర్ ఉంది కదా అందుకే అలా చేసాడు లే అని చెప్పేవారు. 

మరోవైపు అక్కు యాదవ్ తో లంచం తీసుకొని తానూ చేసే క్రైమ్స్ ను కప్పి పుచ్చేవారు. పైగా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిన వారి పేర్లు కూడా ఇచ్చేవారు. నా గురించే కంప్లైంట్ ఇస్తావా అని కంప్లైంట్ ఇచ్చిన వారిని యాదవ్ టార్చర్ చేసేవాడు.       

ఆ స్లమ్ లో ఉన్న ఒక కుటుంబం మాత్రం తమ కూతురిని అక్కడ ఉంచకుండా దూరం ఉంచి చదివించేవారు. సెలవులు ఉండటం తో ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. అదే సమయంలో అక్కు యాదవ్ ఒక అమ్మాయిని రేప్ చేయటం చూసి ఎదురు తిరుగుతుంది. పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. 

యధావిధిగా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు చెప్తారు. అక్కుయాదవ్ ఆ అమ్మాయి ఇంటికి యాసిడ్ బాటిల్ తో వెళ్లి బెదిరిస్తాడు. భూతులు మాట్లాడుతాడు, లోపలి వెళ్ళటానికి తలుపులను గట్టిగా కొట్టినప్పుడు పోలీసులకు నేను ఫోన్ చేసాను కాసేపట్లో ఇక్కడికి వస్తారని ఆ అమ్మాయి చెపుతుంది.

పోలీసులు మాత్రం అక్కడికి రారు. అక్కు యాదవ్ తలపులు పగలగొట్టి లోపలి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ గ్యాస్ ను తెరుస్తుంది. చేతిలో అగ్గిపెట్టె తీసుకొని “లోపలి రావటటానికి ప్రయత్నిస్తే సిలిండర్ పేల్చేస్తాను” అందరు చస్తారు అని బెదిరించింది. బయట ఉన్న అక్కు యాదవ్ కి సిలిండర్ గ్యాస్ వాసన రావటం తో అక్కడి నుంచి వెళ్లి పోతాడు.       

ఆ అమ్మయి చేసిన ధైర్యవంతమైన పనిని ఆ రోజు బస్తీ మొత్తం చూసింది, అందరిలో ధైర్యం వచ్చింది. ఒక్కసారిగా అందరు అక్కు యాదవ్ మరియు వాడి అనుచరులపై రాళ్లు విసిరి తరిమి కొట్టారు. ఆ మరుసటి రోజు అక్కు యాదవ్ ఇల్లు తగలబెట్టారు. మొదటి సారి తమ గెలుపు పై అక్కడి జనాలు సంబరం చేసుకున్నారు 

ఇదంతా చూసిన అక్కుయాదవ్ 2004 వ సంవత్సరం ఆగష్టు 7 వ తేదీ భయపడి పోలీసులకు సరెండర్ అయ్యాడు. పోలీసుల వద్ద ఉంటేనే తాను సురక్షితం అని అర్థం అయ్యింది. పోలీసులు కూడా అక్కు యాదవ్ కు మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. 

చదువుకోవటాని బయటకి వెళ్లి సెలవుల లో ఇంటికి వచ్చిన ఒక్క అమమయి చూపించిన ధైర్యం ఆ బస్తీ తల రాతను మార్చేసింది.

2004 వ సంవత్సరం ఆగష్టు 13 వ తేదీన అక్కు యాదవ్ ను నాగపూర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ప్రవేశ పెట్టడానికి తీసుకురావాలి. అక్కు యాదవ్ ఎలాగైనా బెయిల్ పై మళ్ళీ బయటికి వస్తాడు అని బస్తీ వాళ్లకి తెలుస్తుంది.

ఆ రోజు దాదాపు కొన్ని వందల మంది మహిళలు కారం, వంట గది చాకులు తీసుకొని కోర్ట్ కి వస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 200 నుంచి 400 మహిళలు ఆ రోజు కోర్ట్ కి వస్తారు. 

2:30 నిమిషాల సమయంలో అక్కు యాదవ్ కోర్ట్ లోపలి వెళుతున్నప్పుడు తాను రేప్ చేసిన ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళ ను బూతు మాటలు అని బయటికి వచ్చి మళ్ళీ నిన్నే రేప్ చేస్తా అని అన్నాడు. పట్టరాని కోపం వచ్చిన మహిళ తన చెప్పు తీసుకొని అక్కు యాదవ్ ను కొడుతోంది. ఈ రోజు నువ్వైనా బతకాలి నేనైనా బతకాలి అని అంటుంది. అంతలా అక్కడే వందల సంఖ్యలో ఉన్న మహిళలు కారం పొడి పోలీసుల పై చల్లి అక్కు యాదవ్ ను పట్టుకొని కళ్ళలో, నోటిలో కారం పోసి కత్తులతో పొడుస్తారు.

వెంటనే అక్కు యాదవ్ పరిగెడుతూ కోర్ట్ లోపలి వెళతాడు. అక్కడ ఎం జరుగుతుందో అర్థం కాకా పోలీసులు పక్కకి తప్పుకుంటారు. వందల కొద్ది మహిళలలు ఒకరి తరవాత మరొకరు అక్కు యాదవ్ ను పొడుస్తూనే ఉన్నారు. 

అక్కు యాదవ్ నన్ను క్షమించండి ఇంకోసారి చెయ్యను అని వేడుకుంటాడు. అంతలో ఒక మహిళ అక్కు యాదవ్ ప్రైవేట్ పార్ట్ ను కూడా కట్ చేస్తుంది.

15 నిమిషాలలో అక్కు యాదవ్ చనిపోయాడు. కోర్ట్ రూమ్ రక్తపు మడుగులా అయ్యింది. పోలీసులకు ఎవ్వరిని అరెస్ట్ చెయ్యాలో తెలియలేదు. వందల కొద్ది మహిళలలు మేమందరం చంపాము అని ముందుకు వచ్చారు.

వాళ్లే చంపారు అని అనటానికి కూడా సాక్ష్యం ఎవ్వరు లేరు. పైగా కోర్ట్ లో ప్రవేశ పెట్టిన అటాప్సీ(శవపరీక్ష) లో అక్కు యాదవ్ బాడీలో నుంచి మద్యం ఆనవాళ్లు కనిపించాయి. స్టేషన్ లో ఉంచి పోలీసులు మందు తాగించారని కోర్ట్ కు తెలిసింది. 

తరవాత గ్యాస్ సిలిండర్ తో భయపెట్టిన అమ్మాయి ను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు కానీ పెద్ద మొత్తం లో నిరసనలు జరగటంతో ఆ అమ్మాయిని కూడా వదిలేశారు.

పోలీసులు డౌట్ మీద అరెస్ట్ చేసిన వారిని కూడా కోర్ట్ తగిన అధరాలు లేవని అందరిని విడుదల చేసింది.

ఇలా పోలీసులు తమ పని చేయనందుకు బస్తీ జనాలే తమ పగను తీర్చుకున్నారు. పోలీసులు ఒకవేళ కంప్లైంట్ తీసుకొని విచారిస్తే ఇదంతా జరిగేది కాదు.

అక్కు యాదవ్ మేనల్లుడు తాను ఈ హత్యకి ప్రతీకారం తీర్చుకుంటానని తరవాత చెప్పాడు. యాదవ్ మేనల్లుడు Mukri Chhotelal చిన్న తనం నుంచే క్రైమ్స్ కి అలవాటు పడ్డాడు. ఒక 50 సంవత్సరాల మహిళను రేప్ చేసినందుకు ముక్రీ ను ఆ మహిళ యొక్క మనవళ్లు పొడిచి చంపేశారు. వీళ్లిద్దరి వయసు చాలా చిన్నది. ఒకరికి 15  సంవత్సరాలు ఇంకొకరికి 17 సంవత్సరాలు. 

ఇలా అక్కు యాదవ్ ఇంకా తన మేనల్లుడు ఇద్దరు చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *