Pakistan grave story

చనిపోయిన ఆడవారి శవాలతో అతిక్రూరంగా ప్రవర్తించిన పాకిస్తాన్ వ్యక్తి స్టోరీ

ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ మీకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు. మనుషులలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, అసలు ఇలా కూడా చేసే వారు ఉంటారా అని అనేలా చేసేదే ఈ స్టోరీ.

పాకిస్తాన్ దేశంలోని సర్గోదా అనే పట్టణానికి చెందిన మొహమ్మద్ రియాజ్ అనే యువకుడు బతుకుదెరువు కోసం కరాచీ పట్టణానికి రావటం జరుగుతుంది. కరాచీ లో కొన్ని రోజులు హమాలీ పనులు చేసిన తరవాత వజీరా అనే యువకుడి తో పరిచయం ఏర్పడుతుంది. 

వజీరా కరాచీ లోని ఒక స్మశాన వాటికలో సమాధులకు నీళ్లు పొసే పని చేసేవాడు. ముస్లింలు చనిపోయిన వ్యక్తులను పూడ్చి పెట్టిన తరవాత మట్టి అటుఇటు వెళ్లకుండా ఒకటే దగ్గర ఉండటానికి నీళ్లు పోస్తారు.

వజీరా తో పరిచయం ఏర్పడిన తరవాత రియాజ్ ను కూడా తనతో పాటు స్మశాన వాటికలో పనిచేయమని చెప్తాడు. వజీరా చెప్పిన విధంగానే రియాజ్ స్మశానంలో పనిచేయటం మొదలుపెడతాడు.

అక్కడ పనిచేసే సమయంలో రియాజ్ వజీరా యొక్క ఒక వింత అలవాటును చూడటం జరుగుతుంది. వజీరా స్మశానం లో ఏదైనా మహిళా లేదా అమ్మాయి శవం సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆ సమాధిని తవ్వి లోపలికి వెళ్లి తిరిగి కాసేపటికి బయటికి వచ్చేవాడు.

వజీరా ను ఈ విషయం రియాజ్ అడిగినప్పుడు తాను ఈ సమాధులలో ఉన్న అమ్మాయిలు లేదా మహిళలతో రేప్ చేస్తున్నాని చెప్పాడు. ఈ విషయం తెలిసాక వజీరా తో పాటు రియాజ్ కూడా చేరి ఆడవారి శవాలతో తమ కోరికలను తీర్చుకునేవారు. 

ఆ రోజు వచ్చిన సమాధి ఆడ లేక మెగా అని తెలుసుకోవడానికి కూడా వీరికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండక పోయేది. ఎందుకంటే సాధారణంగా ముస్లిం లు మహిళల యొక్క సమాధుల పైన ఒక బట్టను కప్పటం చేస్తారు. 

ఈ ఇద్దరు కేవలం సాయంత్రం పూట పూడ్చి పెట్టిన సమాధులను మాత్రమే ఎంచుకునేవారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ముస్లింలు సమాధి లో శవానికి పైన క్రాస్ గా బండలు పెట్టి ఆ బండల పై మట్టిని వేస్తారు. ఇలా ఉండటం వల్ల రియాజ్ మరియు వజీరా కేవలం కాలి వద్ద తవ్వి బండలను జరిపి తాము అనుకున్న పని చేసేవారు.

కొంత సమయం గడిచిన తరవాత వజీరా కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చనిపోవటం జరుగుతుంది.  వజీరా చనిపోయిన తరవాత కూడా రియాజ్ మాత్రం ఈ పాడు పని చేస్తూనే ఉండేవాడు. 

2011 సంవత్సరంలో ఒక రోజు ఆ స్మశానవాటికలో ఒక అమ్మాయి యొక్క శవం రావటం జరుగుతుంది. ఎప్పటిలాగే రియాజ్  సమాధి యొక్క మట్టిని తీసి లోపల ఉన్న బండలను తీసి ఆ అమ్మాయి తో రేప్ చేయటానికి ప్రయత్నించినప్పుడు రియాజ్ ఆ సమాధి యొక్క మొఖం పై ఉన్న బట్ట కొంచెం జరిగి ఉండటం గమనిస్తాడు. చిమ్మ చీకటి లో ఆ అమ్మాయి శవం యొక్క దంతాల నుంచి వెలుతురు రావటం గమనిస్తాడు అంతలో ఆ శవం యొక్క రెండు కళ్ళ నుంచి కూడా వెలుతురు రావటం గమనిస్తాడు. 

వెలుతురు రావటం చూసి రియాజ్ ఒక్కసారిగా భయపడ్డాడు, ఒక్కసారి కి ఆ శవం బతికి ఉందని అనిపించింది. తాను చేస్తున్న ఈ పని వల్లే ఆ శవం నుంచి వెలుతురు వచ్చిందని అనుకున్నాడు. 

వెంటనే ఆ సమాధి నుంచి బయటికి అరుస్తూ బయటికి పరుగులు తీస్తాడు అక్కడే ఉన్న కొంత మంది ఏమైందని అడగగా రియాజ్ మాత్రం ఏమి చెప్పడు కానీ తన బట్టలకు మట్టి మొత్తం అంటుకొని ఉంది. ఆ స్మశాన వాటికలోకి వెళ్లి చూడగా ఆ రోజే పూడ్చి పెట్టిన ఒక అమ్మాయి సమాధి అని తెలుసుకున్న అక్కడివారు గట్టిగా అడగటం మొదలుపెడతారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇంతకూ ముందు పూడ్చి పెట్టిన సమాధుల నుంచి మట్టి జరిపినట్టు ఆనవాళ్లు ఉండటం కూడా వీరి రెలెటివ్స్ గమనించటం జరిగింది. కానీ ఆ సమయంలో వారికి ఏమి అర్థం కాలేదు బహుశా ఇలా జరిగి ఉంటుందని కూడా ఎవ్వరు ఊహించలేదు. సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కొన్ని రోజుల వరకు స్మశాన వాటికకు వెళ్ళటం జరుగుతుంది. 

రియాజ్ ను గట్టిగా అడిగిన తరవాత నిజం చెప్పేసాడు అక్కడి ప్రజలు చాలా కోపానికి గురి అయ్యి కొట్టడం ప్రారంభించారు. ఇంతలో అక్కడికి పోలీసులు రావటం మరియు రియాజ్ ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన తర్వాత తాను ఈ స్టోరీ మొత్తం మీడియా ముందు చెప్పటం జరిగింది.

ఇలా ఎంత మంది తో నువ్వు ఈ పని చేసావు అని అడగగా 48 మహిళలతో నేను ఈ పని చేసానని చెప్పాడు. అరెస్ట్ చేసినప్పుడు రియాజ్ యొక్క వయసు 27 సంవత్సరాలు. మానసికంగా కూడా ఆరోగ్యంగానే ఉన్నాడనే విషయం కూడా తెలిసింది. 

ఆ సమయంలో రియాజ్ కి కొన్ని సెక్షన్ ల ప్రకారం ఉరిశిక్ష ను విధించటం జరిగింది. తర్వాత రియాజ్ ను ఆ స్మశానానికి తీసుకెళ్లి తాను రేప్ చేసిన సమాధులను చూపించమని అడగగా సమాధులను చూపించటం మొదలుపెట్టాడు. ఈ విషయం విన్న ఆ చుట్టు పక్కల ఉన్న వారు తమ ఫ్యామిలీకి చెందిన మహిళ తో కూడా ఈ పని చేశాడా అని తెలుసుకోవటానికి వచ్చిన వారికి అవును అని తెలిసినప్పుడు వారు ఒక భరించరాని బాధను అనుభవించారు.  

ఇది ఇవాళ్టి పాకిస్తాన్ కు చెందిన ఒక భయంకరమైన స్టోరీ.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *