
26 సంవత్సరాలు తన సొంత కూతురుని బేస్ మెంట్ లో నిర్బంధించిన ఒక తల్లి స్టోరీ – Blanche Monnier Story
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది లేదు. ఒక బిడ్డ ను అమ్మ కన్నా ఎక్కువగా ఏవారు ప్రేమించలేరు. కానీ కొంత మంది చేసే నీచమైన పనులు అమ్మ ప్రేమకే మచ్చలా తయారవుతారు.
1901 వ సంవత్సరంలో పొయిటియర్స్ లోని అటర్నీ జెనరల్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్క ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో ” మేడం మోనియార్ ఇంట్లో ఒక పెళ్లి కానీ అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి నిర్బంధం లో ఉంది. ఆమె చాలా దీనావస్థ లో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ” అని రాసి ఉంది.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మేడం మోనియార్ సొసయిటీ లో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ. మేడం మోనియార్ కు ఇద్దరు బిడ్డల తల్లి ఒక కూతురు మరియు ఒక కొడుకు. కూతురు పేరు బ్లాంచె మోనియార్ మరియు కొడుకు పేరు మార్సే మోనియార్.
కూతురు బ్లాంచే మోనియార్ చాలా అందంగా ఉండేది. చాలా మంది బ్లాంచే మోనియార్ ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడేవారు. తల్లి మేడం మోనియార్ తన కూతురి కోసం ఒక్క గొప్పింటి సంభందం తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. మరోవైపు 25 సంవత్సరాల బ్లాంచే మోనియార్ ఒక లాయర్ ప్రేమలో పడుతుంది. ఈ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడు.
తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు తాను అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోనని చెప్పింది. లాయర్ డబ్బున్న వాడు కాక పోవటం మరియు బ్లాంచే మోనియర్ కన్నా వయసు ఎక్కువగా ఉండటం వల్ల పెళ్లి కి నో అని చెప్పింది.
కూతురు మాత్రం పెళ్లంటూ చేసుకుంటే కేవలం తన ప్రేమికుడి తోనే చేసుకుంటా అని చెప్పింది. బ్లాంచే మోనియార్ మార్చి 1 వ తారీఖున పుట్టింది. 1875 సంవత్సరం 1 మర్చి రోజునే 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాకే మోనియార్ ను ఆఖరి సారి లాయర్ ను మరిచిపోవాలని అంటుంది.
కానీ బ్లాంచే మోనియార్ మాత్రం ఒప్పుకోలేదు ఒక చేసేదేం లేక ముందు నుంచే తల్లి కొడుకులు చేసిన ప్లాన్ ప్రకారం బ్లాంచే మోనియార్ ఒక చిన్న చీకటి గాడి లో బంధిస్తారు. నువ్వు ఆ లాయర్ ను మరిచిపోతే తప్ప ఈ రూమ్ లో నుంచి బయటికి రాలేవు అని తల్లి చెప్పి ఆ రూమ్ ని మూసేసింది.
ఈ చిన్న ఆ ఇంతో ఒక రకంగా స్టోర్ రూమ్ లా యూజ్ చేసేవారు. ఈ రూమ్ కి చిన్న కిటికీ ఉండేది కానీ బ్లాంచే మోనియార్ అరుపులు బయటికి రావద్దని ఆ చిన్న కిటికీ ను మూసివేయటం జరిగింది.
అందగత్తె బ్లాంచే ఇప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్న చీకటి రూంలో తన సొంత తల్లి ద్వారా బందీ గా మారిపోయింది. ఈ రూమ్ లో బ్లాంచే మోనియార్ ను కట్టేసి ఉంచారు.
కూతురు రోజుల తరబడి తన రూమ్ ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం నువ్వు ఆ లాయర్ ప్రేమను మరిచిపోవాలని పదే పదే చెప్పేది. బ్లాంచే మోనియార్ మాత్రం తన ప్రేమను మరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసేంది.
రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి అడిగారు. ఎదో ఒకటి సర్ది చెప్పి తల్లి పంపించేసేది. కేవలం తినడానికి ప్లేట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ రూమ్ తెరుచుకునేది.
ఆ తల్లి మనసులో మాత్రం కొంచెం కూడా జాలి అనిపించలేదు తన కూతురు పై కొంచెం కూడా కనికరం చూపలేదు. తల్లి కొడుకులు బ్లాంచే ను ఆ చీకటి గదిలో బంధించి తమ జీవితాలను సాధారణంగా గడపటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత బ్లాంచే మోనియార్ కట్లను విప్పేస్తారు.
రోజులు నెలలు గా నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూమ్ లో నుంచి బ్లాంచే మోనియార్ అరుపులు రావటం ఆగిపోయాయి. చీకటి గది లో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల ఆరోగ్యం బాగా క్షీణించింది.
దాదాపు తొమ్మిది సంవత్సరాల తరవాత తాను ఎంతగానో ప్రేమించిన లాయర్ కూడా చనిపోవటం జరుగుతుంది. లాయర్ చనిపోయిన విషయం కూడా తల్లి కూతురితో చెప్పదు.
లాయర్ బ్లాంచే మోనియర్ ను వెతకలేదా అని మీకు డౌట్ రావొచ్చు. ఇంటికి ఎవరూ వచ్చి బ్లాంచే మోనియర్ గురించి అడిగిన తాను పై చదువుల కోసం ఇక్కడినుంచి వెళ్ళిపోయింది అని చెప్పేది. కొన్ని రోజుల తరవాత మళ్ళీ ఎవరైనా అడిగితే తాను అక్కడే పెళ్లి చేసుకుందని అందరికి అబద్దాలు చెప్పేది.
ఇప్పుడు ప్రజంట్ లో 26 సంవత్సరాలు గడిచిన తరవాత 23 May 1901 సంవత్సరంలో అటర్నీ జనరల్ కి ఒక అజ్ఞాత వ్యక్తి లెటర్ లో బ్లాంచే మోనియార్ ఒక రూమ్ లో బందీ గా ఉంది కాపాడమని చ్ప్పటం జరుగుతుంది.
ఆ ఫామిలీ సొసైటీ లో రెస్పెక్ట్ కలిగింది మరియు ధనిక కుటుంభం కావటం తో అక్కడ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయటానికి పోలీసులు ఆలోచిస్తారు.
అక్కడే ఉన్నఒక పోలీస్ ఆఫీసర్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మోనియర్ ను చూసినట్లు చెప్పాడు. కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్ తనని చూడలేదు అని చెప్తాడు.
సెర్చ్ వారెంట్ తీసుకొని పోలీసులు మేడం మోనియార్ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడా కూడా బ్లాంచే మోనియార్ కనిపించదు. బేస్మెంట్ లో ఉన్న ఒక చిన్న రూమ్ ను పోలీసులు గమనిస్తారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి ఒక్కసారిగా బయటికి వచ్చేస్తారు.
ఆ రూమ్ లో నుంచి భరించరాని దుర్వాసన వస్తుంది. పోలీసులు ఇంకో సారి వెళ్లి చూడగా బ్లాంచే మోనియార్ శరీర బరువు మొత్తం పోయి అస్థిపంజరం లా బెడ్ పై నగ్నంగా పడుకొని ఉంది. బ్లాంచే మోనియార్ చుట్టూ కుళ్ళిన మాంసం ముక్కలు, కూరగాయలు, చేప మాంసం, కుళ్ళిన బ్రెడ్ మరియు ఓయస్టర్ షెల్స్ కనిపించాయి.
ఆమె చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. శరీరానికి చుట్టూ కుళ్ళి పోయిన ఫుడ్ మరియు మల మూత్రాలు ఉండటం వల్ల భరించరాని దుర్వాసన. గాలి ఆ రూమ్ లోకి వచ్చే అవకాశమే లేదు. ఆక్కడే ఉన్న కిటికీ ను తెరవగా సూర్య కిరణాలు బ్లాంచే మోనియార్ ముఖం పై పడతాయి. 26 సంవత్సరాల తరవాత బ్లాంచే మోనియార్ వెలుతురును చూసింది. ఆక్కడినుంచి తీసుకెళ్లి బ్లాంచే మోనియార్ వెయిట్ చెక్ చేయగా తన బరువు కేవలం 25 కేజీలు మాత్రమే ఉంది.
తల్లి ను వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుందని అక్కడి ప్రజలు మేడం మోనియార్ ముందు ప్రొటెస్ట్ చేయసాగారు.
కొడుకు మార్సెల్ మోనియార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చుసిన తల్లి తాను నిజంగానే పెద్ద తప్పు చేసింది అని అనుకుందేమో అరెస్ట్ అయిన 15 రోజులకే అనారోగ్యం తో చనిపోయింది.
కొడుకు ఇప్పుడు ఒక లాయర్, కొడుకును కోర్ట్ లో ప్రవేశ పెట్టినప్పుడు తనకు కేవలం నామ మాత్రపు శిక్ష విదిస్తుంది. మరోవైపు బ్లాంచే మోనియార్ పలు మానసిక రోగాల బారిన పడింది. తన మిగితా జీవితం బ్లాంచే మోనియార్ హాస్పిటల్ లోనే గడిపింది.
1913 వ సంవత్సరంలో 64 సంవత్సరాల బ్లాంచే మోనియార్ హాస్పిటల్ లోనే చనిపోతుంది.