375 fragrant bus story in Telugu

బీజింగ్ 375 ప్రాగ్రాంట్ లాస్ట్ బస్ మిస్టరీ స్టోరీ – 375 fragrant bus story in Telugu

హెల్లో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే కథ చైనా దేశం రాజధాని బీజింగ్ కు సంబంచింది. 1995 వ సంవత్సరం నవంబర్ 14 వ రోజున అర్ధ రాత్రి సమయంలో బస్ నెంబర్ 375 బస్ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు బయలుదేరింది. ఈ బస్సు ప్రాగ్రాంట్ హిల్స్ కు వెళ్లే ఆఖరి బస్.

ఈ బస్ లో డ్రైవర్ మరియు లేడీ కండక్టర్ ఉన్నారు. చలి వల్ల ఆ రోజు గాలి బాగా వీస్తుంది, రోడ్డు పై వాహనాలు కూడా లేవు. కేవలం బస్ నడుస్తున్న శబ్దం మాత్రమే వస్తుంది. ఈ బస్సులో ఒక ముసలావిడ, ఒక అబ్బాయి మరియు ఒక కపుల్ (జంట) ఎక్కుతారు.

కపుల్ మాత్రం డ్రైవర్ వెనకాల ఉండే సీట్లలో కూర్చున్నారు, ముసలావిడ, అబ్బాయి డ్రైవర్ కి ఇవతలి వైపు కూర్చున్నారు. ముందు సీట్లో అబ్బాయి వెనక సీట్ లో ముసలావిడ కూర్చుంది.

బస్ ముందుకు కదల సాగింది, కాసేపు తరవాత డ్రైవర్ కి రెండు నీడలు కనిపిస్తాయి. ఈ ఇద్దరు బస్ ని ఆపమని చెయ్యి ని ఊపుతున్నారు. డ్రైవర్ మాత్రం బస్ ను ఆపకుండా అలాగే వెల్లబోతాడు, ఎందుకంటే వీరు స్టాప్ వద్ద కాకుండా వేరే దగ్గర బస్ ని ఆపమన్నారు అని. సాధారణంగా డ్రైవర్లు స్టాప్ వద్దనే బస్ ను ఆపుతారు.

మార్గ మధ్యంలో బస్ ను ఆపటం చెయ్యరు. కండక్టర్ మాత్రం డ్రైవర్ కు ప్రాగ్రాంట్ హిల్స్ కు వెళ్ళేది ఇదే లాస్ట్ బస్ కాబట్టి ఆపమని అడుగుతుంది. డ్రైవర్ కూడా ఈ విషయం అర్థము చేసుకొని బస్ ని ఆపుతాడు.

బస్ లో ఎక్కేటప్పుడు మాత్రం ఆ ఇద్దరు ఒక మూడో మనిషిని భుజాల పై మోసుకొని ఎక్కుతారు. ఆ మూడో వ్యక్తి మొహం మాత్రం కనిపించటం లేదు ఎందుకంటే తల పై ఉన్న వెంట్రుకలు మొహాన్ని కప్పివేస్తున్నాయి.

ఈ ముగ్గురు కనిపించటం లో విచిత్రంగా ఉన్నారు, వీళ్లు కింగ్ డైనస్టీ రాజుల కాలం నాటి బట్టలు వేసుకొని ఉన్నారు. వారి మొహం కూడా ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా తెల్లగా ఉంది.

బస్ లో ఉన్న పాసెంజర్లు మాత్రం భయానికి గురి అయ్యి కండక్టర్ కి ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు. కండక్టర్ మాత్రం వారు బహుశా ఏదైనా మూవీ లేదా డ్రామా లో పనిచేసి నేరుగా బస్ ఎక్కి ఉండవచ్చు లేదా రాత్రి ఎక్కువయిందని డ్రెస్ చేంజ్ చేసి ఉండక పోవచ్చు అని నచ్చ చెపుతుంది.

బస్ లో ఉన్న ముసలావిడ మాత్రం మాటి మాటికీ వెనకకి మల్లి చూస్తుంది. గాలి బాగా వీస్తుంది, కిటికీలు తెరుచుకొని ఉండటం వల్ల గాలి వల్ల ఒక రకమైన శబ్దాలు వస్తున్నాయి. ముసలావిడ మాత్రం వెనకకి తిరిగి ఆ ముగ్గురు పాసెంజర్లను చూస్తూ ఉంటుంది.

ఆ ముగ్గురు పాసెంజర్లు మాత్రం తమకి ఏమి పట్టనట్లు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు. బస్ కదులుతూ ఉంది, డ్రైవర్ మరియు కండక్టర్ ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు.

4 స్టాప్ ల తరవాత ఆ కపుల్ బస్ నుంచి దిగుతారు. ఆ జంట దిగిన కాసేపటికే ముసలావిడ ఆ అబ్బాయి మీద అరవటం మొదలు పెడుతుంది. “నువ్వు నా పర్సు ను దొంగిలించవని పోలీస్ కంప్లైంట్ చేస్తా అని” అరవటం మొదలు పెట్టింది. డ్రైవర్ మరియు కండెక్టర్లు ఎంత నచ్చ చెప్పిన వినటం లేదు.

అబ్బాయి మాత్రం నేను పర్సు దొంగతనం చేయలేదు అని నన్ను నమ్మమని మొరపెట్టుకుంటున్నాడు, అయినా సరే ముసలావిడ బస్సు ఆపాల్సిందే అని అరవటం మొదలు పెట్టింది.

ఇక లాభం లేదని డ్రైవర్ నెక్స్ట్ స్టాప్ లో బస్ ని ఆపగానే ముసలావిడ ఆ అబ్బాయి చెయ్యి పట్టి కిందకి దింపింది. ఆ అబ్బాయి మాత్రం కోపంతో లాస్ట్ బస్ నుంచి నన్ను ఎందుకు దింపవని మరియు పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అని అడిగాడు.

ఆ ముసలావిడ మాత్రం బస్సు కంటి నుంచి దూరంగా వెళ్లే వరకు ఆగి నెమ్మదిగా ఆ అబ్బాయి తో ” అబ్బాయి నేను ఈ రోజు నిన్ను కాపాడాను అని చెప్పింది”.

ఆ అబ్బాయి కి ఏమి అర్థము కాలేదు, ముసలావిడ ఇప్పుడు నెమ్మదిగా నువ్వు ఎలాంటి దొంగతనం చేయలేదు, బస్ లో నేను వెనకకి మళ్ళి మళ్ళి చూస్తున్నపుడు గాలి వల్ల వారి ఆ ముగ్గురి వ్యక్తుల బట్టలు పక్కకి జరిగాయని అప్పుడు వారికి కాళ్ళు లేని సంగతి నేను గమనించానని చెప్పింది. ఎవరికీ అనుమానం రాకుండా నిన్ను కిందకి దించడటానికి ఈ దొంగతనం డ్రామా చేసానని చెప్పింది.

ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కేటప్పుడు నడుచుకుంటూ ఎక్కారు కానీ ముసలావిడ ప్రకారం వారికి కాళ్ళు లేవు. ముసలావిడ మరియు ఆ అబ్బాయి మాత్రం ప్రాణాలు మిగిలాయి అని అనుకొని పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం గురించి కంప్లైంట్ చేద్దాం అని వెళ్లారు.

పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది అంత చెప్పగా పోలీస్ వాళ్ళు మాత్రం వీళ్లిద్దరు పిచ్చోళ్ళు అని పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తరవాత రోజు ఆ చివరి బస్సు ప్రాగ్రాంట్ హిల్స్ కు రాలేదు, ఎక్కడికి వెళ్లి ఉంటుందని వెతకటం మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో మీడియా ఆ ముసలావిడను మరియు ఆ అబ్బాయి ను లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇద్దరు జరిగిందంతా పూస గుచ్చినట్లు చెబుతారు.

రెండు రోజులు గడిచి పోతాయి అయినా ఆ బస్సు ఆచూకీ మాత్రం ఎక్కడా లేదు. మూడవ రోజు మాత్రం లాస్ట్ స్టాప్ కి 100 కిలోమీటర్ల దూరంలో మీయున్ రిజర్వాయరులో ఆ బస్సు ఆచూకీ దొరుకుతుంది.

పోలీస్ 375 బస్సు వద్దకి వెళ్లి చూస్తారు, అక్కడ మొత్తం 3 శవాలు కనిపిస్తాయి.

ఈ మొత్తం కథ లో మొత్తం 3 మిస్టరీలు ఉన్నాయి.

ఆ రిజర్వాయర్ లో దొరికిన మూడు శవాలలో ఒకటి డ్రైవర్, కండక్టర్, మరియు ఆ మూడో వ్యక్తి. ఈ మూడు శవాలు చాలా ఎక్కువగా కుళ్లిపోయి ఉన్నాయి. పోస్ట్ మార్టం తరవాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే రెండు రోజులలో అంతగా కుళ్లిపోవటం సాధ్యం కాదు అని ఎవరో కావాలని చేశారు అని చెప్పారు.

డ్రైవర్ తన లాస్ట్ స్టాప్ కి వెళ్లకుండా 100 కిలోమీటర్లు ఎందుకు వెళ్లాడని ఆరా తీసారు. ఆ బస్ లో కేవలం లాస్ట్ స్టాప్ కి వెళ్ళడానికి సరిపడే పెట్రోల్ ఉందని 100 కిలోమీటర్లు ఎలా వెళ్లిందని పెట్రోల్ ట్యాంక్ ని చెక్ చేయగా అందులో మొత్తం రక్తం ఉంది.

ఇదంతా చుసిన పోలీసులు మాత్రం అసలు ఏమి జరిగి ఉంటుందని సీసీటీవీ ఫుటేజ్ లను చెక్ చేయగా ఏ ఒక్క సీసీటీవీ లో కూడా బస్సు కనబడటం లేదు.

ఈ 3 మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటికి దొరకలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన చాలా రోజుల వరకు ఆ దారిలో వెళ్లాలంటే మనుషులు భయపడటం మొదలు పెట్టారు.

ఇప్పటికి అక్కడి ప్రజలు ఈ స్టోరీ గురించి చెప్పుకుంటూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *