2017 లో మలయాళ నటి పై జరిగిన లైంగిక దాడి ఫుల్ స్టోరీ l Hema committee

2017 వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఒక ఫేమస్ మలయాళ నటి త్రిసూర్ నుంచి కొచ్చి కి షూటింగ్ పని మీద వెళుతూ ఉంటుంది.

గోప్యతను దృష్టిలో ఉంచుకొని నేను ఈ నటి పేరు చెప్పటం లేదు.

మరోవైపు పల్సర్ సుని, మణి, మార్టిన్, సలీమ్, ప్రదీప్ మరియు విజేష్ లు ఈ నటి పై లైంగిక దాడి చేయటానికి ప్లాన్ వేస్తూ ఉంటారు.

ఈ ఆరు మంది లో మార్టిన్ అనే వ్యక్తి మలయాళ నటి యొక్క డ్రైవర్. పల్సర్ సుని మార్టిన్ తో కాంటాక్ట్ లో ఉండి నటి ఎంతవరకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఉంటాడు.

దాడి చేయాలనుకున్న 5 మంది అంగమాలి అనే టౌన్ లోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఎదురు చూస్తూ ఉంటారు.

నటి కారు అక్కడికి చేరుకోగానే మార్టిన్ పల్సర్ సుని కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.

వెంటనే పల్సర్ సుని తన టెంపో కారును స్టార్ట్ చేసి మిగతా నలుగురిని ఎక్కించుకుంటాడు.

ఈ టెంపో కారు కాసేపట్లోనే నటి యొక్క కారును గుద్దుతోంది. వెంటనే రెండు కార్లు ఆగిపోతాయి.

టెంపో లో నుంచి దిగిన ఈ ఐదుగురు డ్రైవర్ కి సారీ చెబుతారు. డ్రైవర్ మేడం తో మాట్లాడండి అని అంటాడు.

పల్సర్ సుని నటి తో మాట్లాడినట్లు చేసి డోర్ తీసి కారు లోపలి ఎక్కుతాడు. వెంటనే మిగతా వారు కూడా కారులో ఎక్కుతారు.

ఆ నటి పల్సర్ సుని ను గుర్తుకూడా పడుతుంది నేను ఎవరో మీకు తెలిసే కారు లోకి ఇలా ఎక్కుతున్నారా అంటుంది. అవును మేడం తెలిసే ఎక్కుతున్నాం అని చెప్పి పల్సర్ సుని కారు లోకి ఎక్కుతాడు.

డ్రైవర్ కారును నడపటం మొదలుపెడతాడు, ఈ అయిదు మంది ఆ నటి ను లైంగికంగా వేధిస్తూ వీడియో రికార్డు చేస్తూ ఉంటారు.

ఒక్కసారి ఆ నటికి ఎం జరుగుతుందో అర్థం కాలేదు. దాదాపు రెండు గంటల వరకు నటి పై ఈ దాడి జరుగుతూనే ఉంటుంది.

ఆ తరవాత ఈ నటి మలయాళం ఇండస్ట్రీ యొక్క చెందిన ఒక ఫేమస్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఇంటికి వెళుతుంది. ఆ డైరెక్టర్ కి తనతో జరిగిన భయంకర ఘటన చెబుతుంది. వాళ్లపై FIR చేయమని డైరెక్టర్ సలహా ఇస్తాడు.

ఆ డైరెక్టర్ సలహా మేరకు ఆ నటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కిడ్నప్ మరియు లైంగిక దాడి జరిగిందని రిపోర్ట్ చేస్తుంది.

దాడి చేసిన వారిలో పల్సర్ సుని కూడా ఉన్నాడని పోలీసులకు చెబుతుంది. ఆ మరుసటి రోజు ఈ న్యూస్ మీడియా లో రావటం వల్ల మలయాళ ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది.

ఆ నటి ఇచ్చిన సమాచారం ప్రకారం పల్సర్ సుని ను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తారు.

పోలీసుల విచారణలో ఈ మొత్తం దాడి ని ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్ మరెవరో కాదు మలయాళం సూపర్ స్టార్ దిలీప్ అని తెలుస్తుంది.

ఇంతకూ దిలీప్ ఆ మలయాళ నటి పై ఎందుకు దాడి చేయించాడు ?

1998 లో దిలీప్ కి మంజు వారియర్ అనే నటి తో పెళ్లి అయ్యింది. పెళ్లి తరవాత దిలీప్ కావ్య మాధవన్ అనే నటి తో రిలేషన్ షిప్ లో ఉంటాడు.

ఈ రిలేషన్ షిప్ కారణంగా దిలీప్ మంజు వారియర్ కు 2015 లో విడాకులు ఇచ్చేస్తాడు.

దిలీప్ మరియు కావ్య మాధవన్ మధ్య ఎఫైర్ నడుస్తుందని లైంగిక దాడి జరిగిన నటి దిలీప్ యొక్క భర్య తో చెబుతుంది.

బయటివారు తన ఫ్యామిలీ విషయాలలో తల దూర్చటం దిలీప్ కి నచ్చలేదు అందుకే కిడ్నాప్ మరియు లైంగిక దాడి చేయించాడు.

దిలీప్ మలయాళం ఇండస్ట్రీ కి చెందిన నటుడు మరియు నిర్మాత. ఈయన సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా చేస్తాడు. ఈయనకు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి.

మలయాళం లో ఉన్న పెద్ద పెద్ద హీరోలలో దిలీప్ కూడా ఒకరు. ఈయనతో ఎవరైనా పెట్టుకున్నారంటే ఇండస్ట్రీ లో ఎక్కడా కూడా అవకాశాలు లభించవు.

10 జులై 2017 తేదీ న నటుడు దిలీప్ ను పోలీసులు కిడ్నాప్ మరియు లైంగిక దాడి కేసులో అరెస్ట్ చేయటం జరుగుతుంది. దిలీప్ కి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరుగుతాయి.

85 రోజుల తరవాత దిలీప్ షరతులతో కూడిన బెయిల్ పై బయటికి వస్తాడు.

దిలీప్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవ్వటం వల్ల ఈ కేసు లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఇలా అయితే మహిళలకు న్యాయం జరగదని 18 మహిళలు కలిసి 2017 నవంబర్ 1 వ తేదీ న Women in Cinema Collective (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) అనే పేరుతో ఒక ఫౌండేషన్ ను మొదలుపెట్టారు.

ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మలయాళం సినిమా ఇండస్ట్రీ లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటం.

ఈ ఫౌండేషన్ చేస్తున్న నిరసనలు కొద్ది రోజులలోనే మంచి ప్రజాదరణ పొందింది. కేరళ ప్రజలు ఈ సంస్థను సమర్ధించారు.

ఇదంతా చుసిన కేరళ ప్రభుత్వం హేమ కమిటీ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీ లో కేరళ హై కోర్ట్ కె. హేమ, మలయాళ ప్రముఖ నటి శారద, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కె.బి. వల్సల కుమారి ఉన్నారు.

2017 నుంచి 2019 వరకు ఇండస్ట్రీ లో వివిధ మహిళలు మరియు యాక్ట్రెస్ లతో మాట్లాడి ఇండస్ట్రీ లో జరుగుతున్న అరాచకాలకు సంబంచిన రిపోర్ట్ 2019 లో కోర్టు కు సమర్పించారు.

ఈ రిపోర్ట్ లో ఏం ఉందో కోర్టు ప్రజలకి తెలియజేయాలి అని ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది.

కోర్టు మాత్రం ఈ రిపోర్ట్ లో చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు మరియు యాక్ట్రెస్ లకు చెందిన పేర్లు ఉన్నాయి కాబట్టి అందరికి ఈ రిపోర్ట్ గురించి చెప్పలేము అని చెప్పింది.

ఇక అప్పటి నుంచి 2024 ఆగస్ట్ వరకు కోర్టు కు రిపోర్ట్ గురించి చెప్పాలని పిటీషన్ వేస్తూనే ఉన్నారు.

2024 ఆగస్ట్ నెలలో కోర్టు రిపోర్ట్ లో ఉన్న కొన్ని పేజీలను ఉంచుకొని మిగతా పేజీలను అందరికి అందుబాటులో ఉండేవిధంగా చేసింది.

ఈ రిపోర్ట్ ను చదివిన వారు మలయాళం ఇండస్ట్రీ లో ఇంత దారుణం జరుగుతుందా అని ఆశ్చర్య పోయారు.

ఈ రిపోర్ట్ లో తెలిసిన ముఖ్య విషయాలు

1) యాక్ట్రెస్ అవ్వాలంటే డైరెక్టర్ లేదా పెద్ద నటులు చెప్పినట్లు వినాల్సిందే మరియు తమ దేహాన్ని వాళ్ళకి సమర్పించుకోవాలి. లేదు అని చెప్పినట్లైతే ఇండస్ట్రీ లో ఎవ్వరు కూడా అవకాశాలు ఇవ్వరు.

2) షూటింగ్స్ జరిగేటప్పుడు రాత్రి సమయాలలో డైరెక్టర్ మరియు నటులు హీరోయిన్ రూమ్ కి వెళ్లి తమ కోరికలను తీర్చుకునే వారు.

3) జూనియర్ ఆర్టిస్ట్ లకు కనీసం బాత్ రూమ్ లు కూడా ఇచ్ఛేవారు కాదు. బాత్రూం చేయాలంటే బయటికి వెళ్లి ఓపెన్ ప్లేస్ లో చేయమని చెప్పేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *